ఉమ్మాడి కుటుంబంలో పుట్టిన రేవంత్ రెడ్డి ఎప్పుడు ప్రేమ గురించి ఆలోచించలేదు. కానీ వారిది వ్యవసాయ కుటుంబం. బాగా ఉన్నవాళ్లు కాస్త ఆర్థికంగా వెనకబడి పోయారు. మొదటి నుండి రేవంత్ రెడ్డికి బాగా చదువుకొని, మంచి స్థాయికి రావాలనుకునే మనసు ఉన్న వ్యక్తి. అలాంటి రేవంత్ రెడ్డి మనసును దోచుకున్నారు గీత అనే అమ్మాయి. రేవంత్ రెడ్డి ఇంటర్ చదివే రోజులో ఒక్కసారి తన స్నేహితులతో కలిసి నాగార్జున సాగర్ కు వెళ్లటం జరిగింది. నాగార్జున సాగర్ లో ఉన్న జల అందాలను, పచ్చని ప్రక్రుతి చూసి ఆనందించే రేవంత్ రెడ్డికి ఒక గీత కనిపించింది. ఆ గీతే తన జీవితాన్ని మార్చబోతుందని రేవంత్ రెడ్డి గ్రహించారు. మొదటి చూపులోనే రేవంత్ రెడ్డి మనసు చుట్టు ఆమె గీత గీసుకోవటం జరిగిందట. ఆ రోజు జనవరి రెండో తారీఖు అనుకోకుండా అమ్మానాన్నలతో కలిసి గీత కూడా నాగార్జున సాగర్ రావటం జరిగింది. రేవంత్ రెడ్డి ఉన్న స్నేహితుల్లో ఒకరు గీత కజిన్ ఉండటం రేవంత్ రెడ్డి ఫ్లస్ ఫాయింట్ అయ్యింది. అప్పుడు గీత 10వ తరగతి చదువుతుంది. మొదటి చూపుల్లోనే ఇద్దరు కలిసి మాట్లాడుకోవటం జరిగిందట. కానీ ఈ ఇద్దరు కలవటానికి ఒక సంవత్సరం సమయం తీసుకున్నారు. గీత కోసం రేవంత్ రెడ్డే ఒక అడుగు ముందుకేసి జనవరి ఒకటో తారీఖున ఒక గ్రీటింగ్ కార్డు పోస్టు ద్వార పంపించడం జరిగింది. రేవంత్ రెడ్డి పంపించిన గ్రీటింగ్ కార్డు గీత తండ్రి చేతిలో పడింది. అంతే ఆయన అగ్గిమీద గుగ్గిలం అయ్యి, ఎవరీ రేవంత్ అనడిగారు. అంతే గీత ఒక్కసారిగా షాక్ తగిలింది. వెంటనే గుర్తోచ్చి.. , అయినా, ఎవరో తెలియదని తండ్రికి అబద్దం చెప్పి తప్పించుకుంది. ఆయన మాత్రం కోపంతో ఆ గ్రీటింగ్ కార్డును చించేశారు. మరో సారి ఇద్దరు ఒకే చోట అనుకోకుండా కలుసుకున్నారు. గీత కజిన్ ఇంటికి వెళ్లినప్పుడు రేవంత్ రెడ్డి అక్కడే ఉండటంతో మళ్లీ ప్రేమ మాటలు చిగురించాయి. రేవంత్ రెడ్డి మాటల్లో నిజాయతీ, ఏదయినా సాధించాలనే తపన గమనించిన గీత, వెంటనే రేవంత్ రెడ్డికి ప్రేమ ఓటు వేసింది. అయితే ఇప్పటికి వారు ఐ లవ్యూ చెప్పుకోలేదట. ఒకరి మనసోకరికి తెలిశాక అలాంటి అవసరం లేదని ఈ ప్రేమ జంట ఆలోచన. తన ప్రేమ కోసం రేవంత్ రెడ్డి జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు.
ఒక పక్క చదువుకుంటునే మరొ పక్క ప్రింటింగ్ ప్రెస్ లో పని చేస్తు తన జీవితాన్ని విజయం వైపుకి అడుగులు నడిచేవారు. పగలంతా కాలేజీలో, సాయంత్రం ప్రింటింగ్ ఫ్రెస్ లో ఉండేవారు. వీరి ప్రేమలో మొదటి సినిమా అన్వేషణ చూసి గీత చాలా భయపడి పోయారు. కానీ అప్పటి నుండి తన ఎదుగుదల కోసం అన్వేషణ చేసి చేసి.. ఈ రోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. రేవంత్ రెడ్డికి గీతాంజలి సినిమా చాలా ఇష్టమాట. రేవంత్ రెడ్డి గీతల ప్రేమను ఆ అమ్మాయి ఎంట్లో ఎవరు అంగీకరించలేదు. కానీ రేవంత్ రెడ్డికి గీత తల్లిదండ్రుల నుండి వార్నింగ్ ఇవ్వటం జరిగిందట. చివరకు రేవంత్ రెడ్డి నుండి దూరంగా గీతను ఢిల్లీకి పంపించారు. అప్పట్లో ఆమె కోసం రేవంత్ రెడ్డి చేయ్యని సాహసం లేదు. ఢిల్లీ వెళ్లాటానికి చార్జీల కోసం రాత్రి పగలు ప్రెస్ లో కష్టపడి పని చేసి తన ప్రేమను నిరూపించుకున్నారు. ప్రేమను అర్థం చేసుకొనే పెద్దలు ఒక్కరైన ఉంటారు అనేది నిజం చేశారు. గీత వాళ్ల పెద్దనాన్న జైపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి కి పెద్దన్నయ్య మాత్రం గీత కు ముందే ఒక మంచి మాట చెప్పారు. మీ ఇంట్లో పెద్దలను ఒప్పించగలిగితే.. మా తమ్ముడిని ప్రేమించు. ఎందుకంటే .. నా తమ్ముడు బాధపడితే నేను తట్టుకొలేను, అనే మాటలు గీత మనసును తాకాయి. ఆ రోజే గీత మనసులో వస్తే ఈ ఇంటికే కోడలు రావాలని నిర్ణయం తీసుకుంది. అప్పటికి రేవంత్ రెడ్డి ఇంకా స్థిరపడలేదు.
గీత వారి ఇంట్లో పెళ్లి సంబందాలు చూస్తున్నారు. 1992 లో గీత పెద్దనాన్న జైపాల్ రెడ్డి గీత ప్రేమ విషయంలో చొరవ తీసుకొని గీత తండ్రిని ఒప్పించటంతో వారి ప్రేమ పెళ్లి పెద్దల సమక్షంలో జరిగింది. గీతతో పెళ్లి జరిగిన రోజు నుండి రేవంత్ రెడ్డికి పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది. అప్పటి నుండి ఆర్థిక సమస్యలు ఆగిపోయాయి. రేవంత్ రెడ్డి కి పేరు ప్రఖ్యాతలు రావటం మొదలుపెట్టాయి. అయితే ఏ రోజు రేవంత్ రెడ్డి తన భార్య అయిన గీతను కోపగించుకోలేదు. ఆమె కు అన్నీ దగ్గరుండి నేర్పించారు. ఒక మంచి భర్తగానే కాకుండా , ఒక మంచి గురువుగా, ఒక తండ్రిగా, ఒక అమ్మలా అన్నీ నేర్పించారు. ఇప్పటికి వారు రాసుకున్న ప్రేమ లేఖలు చాలా భద్రంగా ఉన్నాయంటే. వారి ప్రేమలో ఎంత స్వచ్చత కలిగి ఉందో ఇట్టే అర్థం అవుతుంది. పదిలమైన ప్రేమ జ్నాపకాలంటే ఇదే మరి. ఇలాంటి మంచి ప్రేమికులకు 365 రోజులు ప్రేమ రోజులే. ప్రేమికులు ఇలాంటి ప్రేమ జంటలను ఆదర్శంగా తీసుకోవాలి. అప్పుడే ప్రేమలో నిజాయితీ ఉంటుంది. రేవంత రెడ్డి దంపతులకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more