Anantha sriram chocolate love letter

anantha sriram, anantha sriram chegondi, lyricist anantha sriram interview, lyricist anantha sriram songs, anatha sriram love letters in school days, lover letter cost 250 rupees, love, lovers day, valentines day, ramudu, seetha, satyabhama, srikrishnudu, chocolate love letters,

anantha sriram love letter. Anantha Sriram Chegondi. school love letter,

anantha-sriram.gif

Posted: 02/14/2013 11:43 AM IST
Anantha sriram chocolate love letter

anantha sriram love letter

ప్రేమంటే తెలియాని వారు ఈ ప్రపంచంలో ఉంటారేమోగానీ,  ప్రేమ పుట్టని మనిషి ఈ ప్రపంచంలో  ఎవరు ఉండరు.  ప్రేమంటే ప్రేమే. దాని పరిపూర్ణతను భర్తీ చేసే  మరోపదం నిఘంటువులో  ఇప్పటి వరకూ చేరలేదు.  ప్రేమంటే .. మౌనం నుంచి పుట్టే మాట. నిశ్శబ్దంలోను ధ్వనించే  పాట. ఇద్దరూ గెలిచే ఒకే ఒక ఆట.  ఒకరి  ద్రుష్టిలో  ప్రేమంటే నమ్మకం.  మరొకరి  అనుభవంలో  అదే జీవితం.   ఈ రోజు ప్రేమికుల రోజు కాబట్టి  మన పాటల రచయిత  అనంత శ్రీరామ్ గారి ప్రేమ ఎంతో తెలుసుకుందాం.   తొలి ప్రేమ సినిమా 19 సార్లు చూసిన అనంత శ్రీరామ్ లో ప్రేమ పుట్టిందా? ప్రేమ పుట్టలేదా?  ఆ సినిమా అన్నీ సార్లు ఎందుకు చూశాడు. ప్రేమ కోసమే చూశాడా లేక  పవన్ కళ్యాణ్ కోసం చూశాడా  అని అంటే  అనంత శ్రీరామ్ మాత్రం కేవలం ప్రేమ  కోసమే చూశానని చెబుతున్నారు.  బ్రిటీషువాళ్లు వెళ్లిపోతు  వెళ్లిపోతూ .. మన నమ్మకాన్ని, బలాన్నీ, మూలాన్నీ  దెబ్బకొట్టివెళ్లారేమో  అనిపిస్తుంది.  వారి అచరించే కొన్ని అలవాట్లను మనకు వదిలిపెట్టివెళ్లినట్లు తెలుస్తోంది. అందులో  ప్రేమికుల రోజు ఒకటి.  అనంత శ్రీరామ్ ద్రుష్టిలో  ప్రేమ రెండు భాగాలున్నాయని చెబుతున్నారు.  ఒకటి ఇష్టపడిన వ్యక్తిని అర్థం చేసుకోవడం, రెండోది  వారి ఇష్టానికి  తగినట్టు మనం మారడం.  ఇది నిరంతరం  ప్రక్రియ . ఒక రోజులో మొదలై.. అదే రోజులో పూర్తయ్యేది కాదు . అందుకే  అనంత శ్రీరామ్  ప్రేమికుల రోజు కి పూర్తి వ్యతిరేకినని చెబుతున్నారు.  అయితే ప్రేమకు మాత్రం వ్యతిరేకం కాదని చెబుతున్నారు.  ఇద్దరు వ్యక్తుల  స్వార్తం ప్రేమ.  ఆ స్వార్థం  మంచిదే.  ఈ స్రుష్టికి మూలం అని అంటారు శ్రీరామ్.

anantha sriram love letter

 అనంత శ్రీరామ్  ఎనిమిదో తరగతిలో  ఉండగా.. ప్రేమికులకు మధ్యవర్తిగా  ఉండేవాణ్ని. కాలేజీ రోజుల్లో  నేనే ప్రేమలేఖల స్పెషలిస్టుని. నా చేత  చాలా మంది  లేఖలు  రాయించుకొన్నారు.  ఒక లేఖకి రూ. 250 తీసుకొన్నానని నవ్వుతూ చెబుతున్నారు.  చివరకి చాక్లెట్ కోసం ప్రేమలేఖ రాసిచ్చిన సందర్బాలు ఉన్నాయట. అయితే  ఆ ప్రేమలతో  చాలా మంది తన్నులు తిన్నారట.   ఇలాంటి ప్రేమ లేక నువ్వు రాశావంటే  నమ్మను.  రాసిచ్చిన  వాడిని తీసుకు రా అని తిప్పికొట్టిన  సందర్భాలు ఉన్నాయి.   నిజానికి అవన్నీ  నాతో రాయించుకొన్న  వారి ఆలోచనలే . నా సొంత మాటలు రాయటం జరగలేదని శ్రీరామ్ చెబుతున్నారు.  అయితే  పదాల అమరిక, బాషాపరమైన  అలంకారాలు , ప్రక్రుతి  ఉపమాణాలూ జోడించే   రాయటంతో  ప్రేమలేఖ కొత్త అందం వచ్చేదని శ్రీరామ్ చెబుతున్నారు.  మొదటి ప్రేమలేఖలోని అనంత్ శ్రీరామ్ రాసిన పాదాలు ..  ‘‘పూతవేసిన లేత మావిని చూసినట్టుంది నువ్వు నవ్వుతూ ఉంటే అంటూ’’ రాయటం  జరిగిందని చెబుతున్నారు. అయితే సినిమాల్లోకి వచ్చిన తరువాత పరిస్థితి మారిపోయింది.   ప్రేమలోని  సున్నితత్వాన్ని  మనం క్రమంగా కోల్పోతున్నామేమో అనిపిస్తోంది.  ఆరోజుల్లో  రాముడు  అడవులకు వెళ్లినప్పుడు  సీత వెంటనడిచింది.   ఆ రోజు నిజమైన ప్రేమికుల రోజు. భర్త  అచేతన  అవస్థలో ఉన్నప్పుడు  ఆయన బాధ్యతని  భూజాన వేసుకొని  సత్యభామ నరకాసుర వధ చేసింది.ఆ రోజే నిజమైన ప్రేమికుల దినోత్సం  మన దేశంలో ఎంతో గొప్ప ప్రేమికులున్నారు.  వారందరినీ స్మరిస్తూ.. ప్రతి  రోజూ  ప్రేమను  ప్రేమగా పంచుదాం..  365 రోజులూ ఇతరులతో  ప్రేమగా మసులుదాం అని అంటారు యువ రచయిత అనంత శ్రీరామ్. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Valentines day special
Life term for killing wife  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more