కనిమెళికి బెయిల్ ఇచ్చారు? రాజకు బెయిల్ ఇచ్చారు? శ్రీలక్ష్మీకి బెయిల్ ఇచ్చారు? నిన్నగాక మొన్న అరెస్ట్ అయిన అసదుద్దీన్ కు బెయిల్ ఇచ్చారు? రేపో మాపో అక్బరుద్దీన్ కూడా బెయిల్ వస్తుంది? కానీ వైఎస్ జగన్ మాత్రం బెయిల్ ఎందుకు ఇవ్వటంలేదు? దేశంలో పెద్ద పెద్ద కుంభకోణాలు చేసిన వారు బెయిల్ తెచ్చుకున్నారు? జగన్ ఎందుకు బెయిల్ తెచ్చుకోలేక పోతున్నారు? ఎవరి దగ్గర తప్పు ఉంది? జగన్ దగ్గరా? లేక సిబిఐ దగ్గరా? ప్రభుత్వం ఏమైన సిక్రెట్ రాజకీయం చేస్తుందా?అంటే సిబిఐ, ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కలిసి రాజకీయ చేస్తున్నాయని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత సంవత్సరం మే 27న అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుటికి జగన్ జైల్లో రెండు సెంచరీలు దాటిపోయారు. జగన్ అరెస్ట్ అయిన దగ్గర నుండి బెయిల్ కోసం విశ్వప్రయత్నం చేస్తునే ఉన్నాడు. కానీ ఒక ఫలితం మాత్రం శూన్యం. బెయిల్ కోసం జగన్ అన్ని కోర్టు మెట్లు ఎక్కి దిగిన ఫలితం లేకుండా పోయింది. చివరకు కోర్టే బెయిల్ ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నవేసినట్లు తెలుస్తోంది. జగన్ తరపున న్యాయవాది మోస్ట్ క్రిమినల్ లాయర్ రామ్ జెఠ్మాలనీ బీజేపి పార్టీ నాయకుడు వకల్తా పుచ్చుకొని వాదించిన చివరకు ఫలితం లేకుండా పోయిందని ఆపార్టీ కార్యకర్తలు అంటున్నారు. జగన్ బెయిల్ ఫిటిషన్ సంఖ్య ఇప్పటికే అరడజన్ కు దాటిపోయింది.
ఆస్తుల కేసుకు సంబంధించి దర్యాప్తు పేరుతో తమ పార్టీ అద్యక్షుడ్ని ఇంకా ఎంతకాలం జైల్లో పెడతారని ? ఆ పార్టీ నాయకులు అడుగుతున్నారు. రాజకీయ వత్తిళ్లకు తలొగ్గి పనిచేస్తున్న సిబిఐ జగన్ విషయంలో అతిగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. కేసు దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే అక్రమలు జరిగినట్లు ఎలా నిర్థారిస్తారని? ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం సహకరించని పక్షంలో ముఖ్యమంత్రిని , రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అరెస్టు చేయాలేకానీ , జగన్ కు బెయిల్ రాకుండా అడ్డుపడుతూ నిబంధనలకు ఉల్లంఘించడమేమిటని? ఆమె ధ్వజమెత్తారు. అసలు సిబిఐ ఏ ఆధారాలతో జగన్మోన్ రెడ్డిని అరెస్టు చేసిందో చెప్పాలని ఆమె నిలదీశారు. వైఎస్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో రాజకీయాలతో సంబంధంలేకుండా , ఏ పదవిలో లేకుండా బెంగళూరులో వ్యాపారాలు చేసుకున్న జగన్ ను ఏమాత్రం సంబంధంలేని కేసుల్లో అన్యాయంగా ఇరికించారని ఆమె మండిపడ్డారు. వైఎస్ మరణాననంతరం తన తండ్రి ఆశయాలను సాధించే క్రమంలో కాంగ్రెస్ పార్టీని వీడినందుకే జగన్ పై కక్షగట్టి అక్రమ కేసులు పెట్టించారన్నారు. జగన్ ను రాజకీయంగా ఎదుర్కోవడం అసాధ్యమని భావించి అధికార కాంగ్రెస్ , ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి సిబిఐ ద్వారా జగన్ ను వేదిస్తున్నాయని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more