Importance of pongal festival

pongal festival, pongal festival in andhra, pongal festival dishesh, pongal festival in west godavari, pongal festival in south india, pongal festival, importance of pongal festival

importance of pongal festival

1.gif

Posted: 01/13/2013 12:09 PM IST
Importance of pongal festival

Bhogi-2016Date

        మూడురోజులపాటు కనులపంటలా జరుపుకునే ఆంధ్రుల పెద్దపండుగ సంక్రాంతి. అసలు ఈ పండుగ పుట్టు పూర్వత్రాలు అంతరార్థం ఏంటంటే... శ్రీ మహావిష్ణువు అసురులను మంధర పర్వతం కింద మట్టుబెట్టింది ఈ రోజునే. ఈ భూమిపై ఆ పరమాత్మ ధర్మ స్థాపన జరిపి అధర్మపు రూపుమాపింది ఆ రోజునే. పురాణాల ప్రకారం సూర్య భగవానుడు ఈ రోజునే తన కుమారుడైన శని ఇంటికి వెళతాడు. కపిల మహర్షి శాపానికి గురైన సగర చక్రవర్తి 60 వేల మంది పుత్రులు బూడిద కుప్పలుగా మారినప్పుడు, వారి వారసుడైన భగీరధుడు వారికి విముక్తి కలగడానికి గంగానదిని భూమి మీదకు తేవడానికి మహా తపస్సు చేయగా, గంగానది భూమిమీద ప్రవహించి వారి భస్మములకు ఉత్తమగతులు ప్రాప్తించేలా చేసింది ఈ మకర సంక్రమణం జరిగిన రోజునే. మకర సంక్రాంతి రోజునే వసంత ఋతువు ప్రారంభమవుతుంది.
       సంక్రాంతి పండుగ సంబరాలు మూడురోజులు జరుపుకుంటాం. పండుగ మూడురోజులూ ఆకాశమంతా గాలి పటాలు చుక్కల్లా పరుచుకున్నప్పుడు భూమి రంగు రంగుల రంగవల్లుల అల్లికల అందం సమకూర్చుకుంది. గంగిరెద్దుల డూడూ బసవన్నలు, హరిదాసుల పాటలు పండగ వాతావరణాన్ని నింపివేస్తాయి. పట్టణమైనా, పల్లెలైనా సంక్రాంతి శోభ పరచుకుంటాయి. ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే వాక్యానికి సంక్రాంతి పండుగ బాగా నప్పుతుంది. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు. పండుగ జరుపుకునే మూడు రోజులలో మొదటి రోజును భోగి అని, రెండవ రోజును సంక్రాంతి అని, మూడవ రోజును కనుమ అని పిలుస్తారు. మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. మనం మహాభారతంలో భీష్ముడు ఈ ఉత్తరాయణం పుణ్యకాలం ఆరంభమయ్యేదాకా అంపశయ్య మీదే ఉండి ఆ తర్వాత స్వర్గాన్ని చేరుకున్నాడని చదివాం. దీనికి కారణమేమిటంటే ఉత్తరాయణంలో మరణించిన వారికి ఉత్తమగతి లభిస్తుందని ఆస్తిక లోకపు నమ్మకం. ఉత్తరాయణ పుణ్యకాలం అనీ అంటారందుకే.
       ఇంకా చెప్పాలంటే మకర సంక్రాంతినే సంవత్సరాదిగా చెప్పాలి. ఎందుకంటే, సంవత్సరంలోని రెండు ఆయనాల్లోనూ ఉత్తమమైన ఉత్తరాయణానికి తొలిరోజు ఇదే. ఈ రోజునుంచే ప్రకృతిలో నెమ్మదిగా మార్పులు కానవస్తాయి. సంవత్సరం పొడవునా ఫలాలను సూచించే సంక్రాంతి పురుషుడు అవతరించేదీ ఈ రోజే. ఎంతో శారీరక శ్రమను పొంది ప్రజలకు ఉపశమనం కలుగనారంభిస్తుంది. శీతవాతాలు తగ్గుముఖం పడతాయి. పంటలు చేతికి రావడం వల్ల చికాకులు చింతలు తగ్గడంవల్ల జన జీవితంలో నూతనోత్సాహం కలుగుతుంది. సంక్రాంతి ముందు రోజు తెల్లవారుజామునే పెద్దఎత్తున మంటలు వేసి చలి కాచుకోవడం అనాదిగా ఆనవాయితీ. వీటినే భోగిమంటలంటారు కూడా. భోగినాడు మంటలు వేసి చలి కాచుకోవడంతో చలి నెమ్మదిగా తగ్గుముఖం పడుతుందన్న మాట.

Sankranti_wishes_in_telugu
          మరుసటి రోజు సంక్రాంతి. సంక్రాంతి తరువాతి రోజు పశువుల పండగ లేదా కనుమ. ఇలా ఈ భోగి, మకర సంక్రమణం, కనుమ-ఈ మూడు రోజులూ పండుగే. అందుకే దీన్ని పెద్ద పండుగ అంటారు. నిజానికి ఏ పండగ చూసినా మన తెలుగు లోగిళ్లలో అది ఆడపడచుల పండుగల్లానే గోచరిస్తాయి. సంక్రాంతి మరీనూ. కొందరు నాలుగు రోజుల పండగగా చేస్తారు. నాలుగో రోజున ముక్కనుమ అంటారు. బంతిపూల తోరణాలు, గుమ్మడి పూలతో అలంకరించిన గొబ్బెమ్మలు, ఇవన్నీ మన ఊళ్ల స్వభావాన్నే మార్చేస్తాయి. ప్రతి వాకిలీ ఎంతో శుభ్రంగా, అందంగా రకరకాల ముగ్గులతో ముచ్చటగొలుపుతూ ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఈ మూడురోజుల పండగల్లో మొదటిరోజు దేవతలకు సంబంధించింది. రెండోరోజు మానవులకు సంబంధించింది. మూడోరోజు పశువులకు సంబంధించింది.
        భోగిమంట మూడురోజులపాటు జరిగే సంక్రాంతి పండగలో మొదటిరోజున నాలుగు మార్గాల కూడలిలో వేసే పెద్ద మంట. అప్పటినుండి ఇంతకంటే మరింత వేడితో ఉత్తరాయణ సూర్యుడు రాబోతున్నాడనే సంకేతం. దక్షిణాయంలో ఉండే నిద్రను బద్దకంతో సహా దగ్ధం చేయాలనే సంకేతంతో చీకటితోనే భోగిమంట వేస్తారు. ఇంట్లో ఉండే పాత కలప సామగ్రి, వస్తువులు, ఎండుకొమ్మలు లాంటివి భోగిమంటలో వేసి తగలబెడ్తారు. భోగిపళ్లు భోగిపండ్లు అంటే రేగిపండ్లు. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను నింపి పిల్లల తలపై పోస్తారు. ఇది సూర్యునికి ప్రీతికరమైన పండుగ కాబట్టి సూర్యభగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో భోగిపండ్లు పోస్తారు.
      సంక్రాంతి పర్వదినాలలో ఎవరి ఆచార సంప్రదాయాలను అనుసరించి వారు ఈ కార్యక్రమం చేస్తూంటారు. ఈ రోజు బూడిద గుమ్మడికాయ దానం ఇస్తారు. అదొక్కటే కాదు. ధాన్యం, వస్త్రం, ఫలాలు, కూరగాయలు, బంగారం, ఆవు-ఇలా ఎవరి శక్తికొద్దీ వారు దానాన్ని ఇవ్వడం జరుగుతుంది. సంక్రాంతి రోజు దానం చేయడం అనంతమైన ఫలాలను ఆనందాన్ని ఇస్తాయి (పాశ్చాత్య ప్రభావంతో మనవాళ్లు జాయ్ ఆఫ్ గివింగ్ అనీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనీ, ఫలానా డేలనీ అంటున్నారు కానీ మన పండగల వెనక పరమార్థ్ధాన్ని మాత్రం గ్రహించే ప్రయత్నం చేయడంలేదు. అదీ మన దురదృష్టం) సంక్రాంతి పురుషుడు మట్టితో ఒక సంక్రాంతి పురుషుని బొమ్మను, అతని వాహనాన్ని (ప్రతి సంవత్సరం వేరువేరు వాహనాలపై పురుషుడు వస్తాడు. ఏ వాహనాన్ని ఎక్కితే ఆ వాహనానికి ఆ సంవత్సరం ఎక్కువ నష్టం అని ఒక నమ్మకం) చేసి సంక్రాంతి మూడు రోజుల్లో పూజలు చేస్తారు. హరిదాసు గొబ్బిళ్లతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం. ఆయన తలమీద మంచి గుమ్మడికాయ ఆకారంలో గల పాత్ర గుండ్రంగా ఉండే భూమికి సంకేతం. దాన్ని తలమీద పెట్టుకుని వుండడం శ్రీహరి అయిన తానే భూమిని ఉద్ధరిస్తున్నానని  అని చెప్పడానికి సంకేతం.

gangireddu-with-haridasu
       ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతిని కోస్తా జిల్లా ప్రజలు వైభవంగా జరుపుకుంటారు. బెంగాల్ రాష్ట్రంలో కూడా సంక్రాంతి జరుపుకుంటారు. వరిపంట కోతల సమయంలో రావడంవల్ల సంక్రాంతి రోజు బియ్యంతో చేసిన ప్రత్యేకమైన తినుబండారాలను ఆరగించడం, ఇచ్చిపుచ్చుకోవడం ఇక్కడి ఆనవాయితీ. బియ్యంపిండి, పంచదారలతో చక్రాలుగా చేసి చిన్నపిల్లల మెడల్లో దండలుగా వేస్తారు. తరవాత వాటిని కోళ్లకు వేస్తారు. ఉత్తరప్రదేశ్‌లో సంక్రాంతినాడు ప్రజలు త్రివేణి సంగమం వెళ్లి స్నానాలు చేస్తారు. సముద్రానికెళ్లి సంప్రదాయ సిద్ధమైన తర్పణాలు వదులుతారు. మహారాష్టల్రో కూడా ఇలానే కొద్దిపాటి తేడాతో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ మూడురోజుల పండుగల్లో మొదటి రోజు నదీ, సముద్ర స్నానాలు చేయడం, దానాలు చేయడం, తర్వాత రోజు కొత్తబియ్యం, బెల్లం, పాలతో పొంగలి తయారుచేస్తారు. ఆ తయారీలో పాలు ఎంత గొప్పగా పొంగితే ఆ ఏడాదంతా అంత గొప్పగా ఉంటుందని నమ్మిక. ఈ పొంగలిని అరటి ఆకులో ఆరగించడం అదో మధురమైన అనుభూతి. మూడోరోజున ఆవులను, ఎద్దులను శభ్రం చేసి రంగునీళ్లను చల్లి, కృతజ్ఞతా సూచకంగా వాటికి ఆహారాన్ని వేస్తారు. ఆ తరువాత వాటికి రంగులద్ది, పూలమాలలు వేసి ఊరేగించి ఆనందిస్తారు.
       శబరిమలై మకర జ్యోతి అయ్యప్ప దివ్యదేవస్థానం శబరిమలై. ఇక్కడ మకరజ్యోతి దర్శనం ఎంతో ముఖ్యమైన అంశం. వేలాదిమంది భక్తులు ‘పొన్నంబలమేడు’ తూర్పు దిక్కున కనిపించే ఈ జ్యోతిని ప్రతి సంవత్సరం దర్శించుకుంటారు. మకర జ్యోతి దర్శనంతో ‘మకర విళక్కు’ దీక్ష పూర్తవుతుంది.అయ్యప్పస్వామి జ్యోతి రూపంలో కనిపించి తన భక్తులను ఆశీర్వదిస్తాడని నమ్మకం. మకర జ్యోతి దర్శనానికి రెండు రోజుల ముందే మకర విళక్కు మొదలవుతాయి.
    తెలుగవాకిట మహాసంభరాల రోజులు ఈ మూడురోజులు అవే సంక్రాంతి పండుగరోజులు.. మా సందర్శకులందరికీ ఈ సందర్భంగా తెలుగువిశేష్.కాం సంక్రాంతి శుభాకాంక్షలు అందజేస్తుంది.. హ్యాపీ పొంగల్ మైడియర్ ఫ్రెండ్స్...

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maha kumbhamela in allahabad starts from today
Nayak movie unit press meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more