వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదర్వయంలో వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. షర్మిల చేసే పాదయాత్రతో రాష్ట్రంలో కొత్త రాజకీయం పుంతలు తొక్కుతుంది. అన్నీ పార్టీలు పాదయాత్రల మీద మనసు పెట్టారు. షర్మిల పాదయాత్ర తెలంగాణలో జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో జరుగతున్న పాదయాత్రలో షర్మిలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కె. చంద్రశేఖరరావు పై విమర్శల దాడి చేశారు. ఓబులాపురం, బయ్యారం గనుల్లో మాకు వాటా ఉందని నిరుపిస్తారా? కేసిఆర్ కు దమ్ముంటే నిరూపించాలని ఆమె సవాల్ విసిరారు. అంతేకాకుండా ఒక వేళ గనుల్లో మాకు వాటా లేదని మేము నిరూపిస్తే .. కేసిఆర్ మావద్దకు వచ్చి మా కాళ్లు, చేతులు పట్టుకుని క్షమాపణ చెప్పే సంస్కారం మీకు ఉందా ? అని షర్మిలా సవాల్ విసిరారు. షర్మిలా పాదయాత్రలో కేసిఆర్ టార్గెట్ చేసుకోని సవాల్ విసిరినట్లు తెలుస్తోంది. ఈ గనులతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎన్ని సార్లు చెప్పినా..పదే పదే ఆరోపణలు చేస్తున్నారని షర్మిలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో నెలరోజులు మకాం వేసిన కేసిఆర్, ప్యాకేజీ కుదరకపోవడంతోనే వెనక్కు వచ్చారని వైసీపీ నాయకురాలు కొండా సురేఖ ఆరోపించారు. కేసిఆర్ వంద సీట్లు సాధిస్తే తెలంగాణ ఎలా తెస్తారని ప్రశ్నిస్తే ఇప్పటి వరకు సమాధానం లేదని ఆమె విమర్శించారు. తమ పార్టీలోకి భారీగా వలసలు ఉంటాయని, తర్వలోనే టీఆర్ఎస్ ఖాళీ అవుతుందని సురేఖ అన్నారు. షర్మిలా విసిరిన సవాల్ కు కేసిఆర్ ఎలా సమాధానం చెబుతాడో? లేక షర్మిలా కాళ్లు పట్టుకుని క్షమాపణ చెబుతారో వేచి చూడాలి? షర్మిలా కౌంటర్ కు టీఆర్ఎస్ లో ప్రకంపనాలు ఎలా వస్తాయో? చూడాలి మరీ.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more