సూరజ్‌కుండ్‌లో నిర్వహించిన సంవాద్ బైఠక్‌తో కాంగ్రెస్ అధినేత్రి సోనియా 2014 లోక్‌సభ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేస్తూ సమర శంఖం పూరించారు. ఢిల్లీ సరిహద్దులోని సూరజ్‌కుండ్‌లో ప్రధాని మన్మోహన్ సింగ్ సహా 70మంది పార్టీ సీనియర్లతో నిర్వహించిన సంవాద్ బైఠక్‌లో సోనియా అధ్యక్షోపన్యాసం చేశారు. ఆర్థిక సంస్కరణలపై పెల్లుబికిన వ్యతిరేకత ఒకవైపు, అవినీతి ఆరోపణల నడుమ దిగజారిన పార్టీ ప్రతిష్ఠ మరోవైపు సవాళ్లు విసురుతున్న తరుణంలో.. ఏడాదిన్నరలో రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నది. మూడోసారీ కేంద్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్.. కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఢిల్లీకి 25 కిలోమీటర్ల దూరంలోని సూరజ్‌కుంద్‌లో పార్టీకి చెందిన 70 మంది ప్రముఖ నేతలతో ‘సంవాద్ బైఠక్’ జరిగింది. అవినీతి ఆరోపణలను, విమర్శలను తిప్పికొట్టాలని, 2014 ఎన్నికల్లో విజయం కోసం సంసిద్ధం కావాలని అధినేత్రి సోనియాగాంధీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం పెంపొందాలని, ప్రభుత్వ చర్యలను ప్రజలకు నచ్చజెప్పాలని, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు.
ఇదిలావుంటే, 2014 ఎన్నికల్లో విజయ సాధనే లక్ష్యంగా తగు వ్యూహాన్ని సిద్ధం చేసేందుకు మూడు ఉప సంఘాలతో సమన్వయ సంఘాన్ని సోనియా ఏర్పాటు చేశారు. వచ్చే జనవరిలో మేధోమథనం నిర్వహించి పార్టీ వ్యూహాన్ని ఖరారు చేస్తారు. సంవాద్ భైఠక్‌లో మంత్రులు, పార్టీ సీనియర్లు పార్టీ, సంకీర్ణ సర్కారు పని తీరు, పార్టీని ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు తీసుకోవలసిన చర్యలపై వ్యక్తం చేసిన అభిప్రాయాల ఆధారంగా ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసి జనవరి మేధోమథనంలో చర్చించనున్నట్టు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల కోసం సోనియా ఏర్పాటు చేసిన సమన్వయ సంఘం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఏఐసిసి మీడియా విభాగం అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ శుక్రవారం రాత్రి మీడియా సమావేశంలో వెల్లడించారు. సంవాద్ బైఠక్‌కు 70 మందిని ఆహ్వానిస్తే 66మంది హాజరయ్యారని ద్వివేదీ తెలిపారు. పర్యటన శాఖ సహాయ మంత్రి చిరంజీవితోపాటు విలాస్ ముత్తెంవార్ విదేశీ పర్యటన మూలంగా రాలేకపోతే దిన్షాపటేల్ గుజరాత్ ఎన్నికల మూలంగా హాజరు కాలేకపోయారనీ, రాజశేఖర్ అనారోగ్యం కారణంగా సంవాద్ బైఠక్‌కు రాలేకపోయారని తెలిపారు. హాజరైన అరవై ఆరు మందిలో దాదాపు నలభై మంది మంత్రులు, నాయకులు రాజకీయ, ఆర్థిక అంశాలు, పార్టీ ఎన్నికల ప్రణాలిక అమలుపై తమ అభిప్రాయాలను వెల్లడించారని ద్వివేదీ చెప్పారు.
ఆమ్ ఆద్మీ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పొదుపు చర్యలను పాటిస్తోంది. ఇందులో భాగంగానా అన్నట్లు ఢిల్లీకి 25 కిలోమీటర్ల దూరంలోని సూరజ్‌కుంద్‌లో నిర్వహించిన చర్చా సదస్సుకు 70 మందికిపైగా కాంగ్రెస్ ప్రతినిధులు రెండు బస్సుల్లో వచ్చారు. సోనియా, రాహుల్ కూడా ఇతర ప్రతినిధులతోనే కలిసి ప్రయాణించారు. ఏకే ఆంటోనీ, పీ చిదంబరం, కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్, సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, అంబికాసోనీ కూడా అదే బస్సులో వచ్చారు. భద్రత దృష్ట్యా ప్రధానమం త్రి మన్మోహన్‌సింగ్ మాత్రమే విడిగా వచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more