కొన్ని గంటల్లో బాబు ప్రజల వద్దకు పాదయాత్రతో వస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోవటానికి ‘వస్తున్నా మీకోసం’ పేరు తో పాదయాత్ర చేస్తున్నారు. బాబు పాదయాత్ర ప్రజల కోసమో లేక పదవి కోసమో .. మొత్తం రాష్ట్రంలో బాబు రెండో నంబర్ దక్కించుకున్నారు. అంటే మొదటి స్థానం దివంగత వైఎస్ ఆర్ దక్కించుకున్నారు. ఆయన చేసిన పాదయాత్ర వలన రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాబు వంతు వచ్చింది. అందుకే రెండో నంబర్ చెప్పటం జరిగింది. పాదయాత్ర చాలా చరిత్ర ఉంది. ఇప్పటి వరకు పాద యాత్ర చేసిన వారు అందరు సంచలనం పుట్టించారు. గాంధీ గారు ఉప్పు కోసం చేసిన పాదయాత్ర భారతీయ ప్రజల మనసుల్లో పెద్ద స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు బాబు పదవి కోసం పాదయాత్ర చేస్తున్నారు.
సాధారణ ఎన్నికలు ఇంకా ఏడాదిన్నర దూరంలో ఉండగానే, వివిధ రాజకీయ పక్షాలు ‘ముందస్తు’ వ్యూహాల్లో తలమునకలవుతున్నాయి. వరుసగా రెండుసార్లు అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో ఓటమితో డీలాపడిన టిడిపిలో ఆశలు రేకెత్తించేందుకు, పార్టీ శ్రేణుల్లో కదలిక తీసుకొచ్చేందుకు అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 117 రోజుల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి సాయంత్రం బాబు పాదయాత్ర ప్రారంభమవుతుంది. 2004 ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. కరవు కాటకాలతో ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. ఇప్పుడు రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? అనే ప్రశ్న తరుచుగా వినిపిస్తున్న పరిస్థితి. అయితే అప్పుడు అధికారంలో ఉన్న టిడిపికి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తే, ఇప్పుడు మాత్రం పరిస్థితి అలా లేదు. తెలంగాణలో నాలుగు పార్టీల ప్రాబల్యం, సీమాంధ్రలో మూడు పార్టీల ప్రాబల్యం కనిపిస్తోంది.ఇలాంటి పరిస్థితిలో పైచేయి సాధించేందుకు ప్రధాన రాజకీయ పక్షాలు ముందుగానే తమ ఆయుధాలను సన్నద్ధం చేసుకుంటున్నాయి. వరుస ఉప ఎన్నికల్లో ఘోర పరాజయంతో టిడిపి శ్రేణుల్లో నిరాశ నిస్పృహలు ఆవరించాయి. 2004 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకుడు ఎవరనే ప్రశ్నకన్నా, టిడిపి ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకతే కాంగ్రెస్ విజయానికి దోహదం చేసింది. పాదయాత్ర ద్వారా కాంగ్రెస్‌లో తనకు ఎదురులేదని, కాంగ్రెస్‌కు తానే నాయకుడినని చాటి చెప్పుకోవడానికి వైఎస్సార్‌కు అవకాశం దక్కింది. టిడిపిలో నాయకత్వపరంగా చంద్రబాబుకు ఎలాంటి ఇబ్బందీ లేదు. నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తానని చంద్రబాబు ముందుకు వచ్చినా స్వీకరించే స్థితిలో ఎన్టీఆర్ కుటుంబీకులు లేరు. పార్టీ నాయకత్వానికి బాబే శరణ్యం. అయితే పార్టీ అధికారంలోకి వస్తుందని పార్టీ శ్రేణుల్లో విశ్వాసం కలిగించడమే ఇప్పుడు చంద్రబాబుకు కావాల్సింది.సుదీర్ఘ పాదయాత్ర ద్వారా జనంలో ఉండడానికి అవకాశం లభిస్తుందని, ప్రచార ఆర్భాటంతో పార్టీ అధికారంలోకి వస్తుందనే అభిప్రాయం కలిగించడానికి సైతం ఉపయోగపడుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు.
వైఎస్సార్ చేసిన పాదయాత్రకు తన పాదయాత్రకు సంబంధం లేదని చంద్రబాబు పదే పదే చెబుతున్నా, బాబు పాదయాత్ర గురించి ప్రకటన చేయగానే రెండు పాదయాత్రల మధ్య పోలిక మొదలైంది. వైఎస్సార్ అధికారం కోసం పాదయాత్ర చేస్తే, తానుమాత్రం ప్రజల కోసం చేస్తున్నానని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ముందస్తు ఎన్నికల వ్యూహాన్ని ముందుగానే ఊహించి నాడు వైఎస్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అయితే ఇప్పుడు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు లేవు. కానీ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలకు ముందస్తుగానే సన్నద్ధంకాక తప్పని పరిస్థితి. రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని 2014 ఎన్నికలకు ముందస్తుగానే వ్యూహత్మకంగా చంద్రబాబు సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ అంశాన్ని కేంద్రం ఏవిధంగా పరిష్కరించాలని అనుకుంటుందో తెలియదు. తెలంగాణ పరిష్కారం అయితే తప్ప ఏ పార్టీ భవిష్యత్తు ఏమిటో అంతు చిక్కని పరిస్థితి. ఇలాంటి వాతావరణంలో కేంద్రం తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూస్తూ గడిపే బదలు పాదయాత్ర పేరిట ప్రజలకు చేరువ కావాలని చంద్రబాబు నిర్ణయించినట్టు పార్టీ నాయకులు తెలిపారు.పాదయాత్ర సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన స్థూపాన్ని చంద్రబాబు హిందూపురంలో ఆవిష్కరిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు హిందూపురంలోని సూగూరు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలుచేసి గాంధీజీ, అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించి పాదయాత్ర ప్రారంభిస్తారు. అనంతపురం జిల్లాలోని హిందూపురం, పెనుగొండ, రాప్తాడు, కళ్యాణ దుర్గం, రవకొండ, రాయదుర్గం, గుంతకల్లు నియోజక వర్గాల్లో 12 రోజులపాటు పాదయాత్ర సాగుతుంది. అనంతరం కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తారు. మొత్తం 13 జిల్లాల్లో దాదాపు 2200 కిలోమీటర్ల నుంచి 2350 కిలోమీటర్ల వరకు పాదయాత్ర సాగుతుందని పార్టీ నేతలు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more