మన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మాట మరిచిపోయారు, గతం ఆయనకు గుర్తుకు రావటంలేదని సీనియర్ నాయకులు ఎల్ కే అద్వానీ అంటున్నారు. దేశంలోని రిటైల్ వ్యాపారంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) అనుమతించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని ప్రతిపక్ష నాయకునిగా వాదించిన మన్మోహన్సింగ్ ఇప్పుడు గతాన్ని మరిచిపోయి తన నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారని బిజెపి సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ విమర్శించారు. ఎఫ్‌డిఐలను మల్టీబ్రాండ్ రిటైల్ వ్యాపారంలో అనుమతిస్తే ఉపాధి అవకాశాలు పెరగకపోగా మరింత మంది ఉపాధి కోల్పోయి వీధుల పాలవుతారని వాదించిన మన్మోహన్ ఇప్పుడు కొత్తపాట పాడుతున్నారని తన బ్లాగులో విరుచుకుపడ్డారు. చిల్లర వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుతించటం దేశద్రోహమే అవుతుందని లోక్‌సభలో అప్పటి కాంగ్రెస్ సభ్యుడు ప్రియరంజన్ దాస్ మున్షీ చేసిన విమర్శకు మంత్రి అరుణ్ శౌరి ‘మల్టీ బ్రాండ్ చిల్లర వ్యాపారంలో ఎఫ్‌డిఐలను అనుమతించే ప్రసక్తేలేదని’ సభలో జవాబు ఇచ్చారని అద్వానీ స్పష్టం చేశారు. ‘2002లో మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నారు.
ఆ సమయంలో మహారాష్ట్ర వ్యాపార సంఘాల సమాఖ్య ప్రతినిధి వర్గం ఆయనను కలిసింది. చిల్లర వ్యాపారంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించాలన్న వాజపేయి ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనపై చర్చించారు. ఎఫ్‌డిఐలను అనుమతించవలసిన అవసరం మన దేశానికి లేదనీ, అసలు ఈ విధమైన సంస్కరణలతో పనిలేదని మన్మోహన్సింగ్ ఆ ప్రతినిధి వర్గానికి స్పష్టం చేశారు’ అని బిజెపి నేత తన బ్లాగులో వివరించారు. అక్కడితో ఆగకుండా రిటైల్ వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చిన పక్షంలో ఉపాధిపరంగా విపరీతమైన నష్టం కలుగుతుందని కూడా మన్మోహన్ అన్నారని అద్వానీ గుర్తుచేశారు. మన్మోహన్ అభిప్రాయాలను వ్యాపార సంఘాల సమాఖ్య ప్రతినిధి వర్గం అధ్యక్షుడు సిటి షాంగ్వే ఒక లేఖలో వెల్లడించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ వ్యాపారంలో విదేశీ పెట్టుబడులను అనుమతించిన దేశాల్లోని చిన్నాచితక వ్యాపారులను బహుళ జాతి సంస్థలు అన్ని విధాలా దెబ్బతీసిన విషయాన్ని కూడా తాము మన్మోహన్ దృష్టికి తెచ్చామని షాంగ్వే పేర్కొన్నారు. కాగా సూరజ్‌కుండ్‌లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రతిపాదించిన ఆర్థిక తీర్మానంపై జరిగిన చర్చలో ప్రస్తావనకు వచ్చిన ఈ లేఖలోని అంశాలు ప్రధాని మన్మోహన్ సింగ్ అనుసరిస్తున్న ద్వంద్వనీతికి నిదర్శనమని అద్వానీ ఘాటుగా విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more