విజయమ్మ బిడ్డ జైలుకెళ్లాడనే ఆవేదనకంటే ఆ 18 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు తమ పార్టీకే ఓట్లేయాలంటూ రాజకీయ ఉపన్యాసాలు చేయడమే వింతగా తలపిస్తోందన్నారు. నాడు ఊరూరా ప్యాలెస్‌లు కడుతుంటే మిన్నకున్న వైఎస్ విజయమ్మ ఇప్పుడు అక్రమార్జనల వ్యవహారం బద్దలై జగన్ జైలుకెళ్తే మాత్రం బాధపడుతుండటం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. అంతంత సొమ్ము ఎలా వస్తోందంటూ ఆనాడే ఆరా తీయాల్సిన బాధ్యత తల్లిగా విజయమ్మకు లేదా అని బాబు సూటిగా ప్రశ్నించారు.
అయినాసరే పుత్రశోకం ఓ తండ్రిగా తనకూ తెలుసని పేర్కొన్నారు. నెల్లూరు ఎంపి లోక్‌సభ స్థానం పరిధిలోని అల్లూరు మండల కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ‘ విజయమ్మ జగన్‌ను పెంచిన విధంగా మీరు మీ బిడ్డల్ని పెంచవద్దంటూ’ సమావేశానికి హాజరైన మహిళలనుద్దేశించి సలహా ఇచ్చారు. వైఎస్ కుటుంబం వల్ల ప్రస్తుతం ఓ మంత్రితో సహా పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్ అధికారులు మొత్తం 13 మంది వరకు జైళ్లలో మగ్గుతున్నారని ఆరోపించారు. చట్టం అందరికీ సమానమేనన్న సత్యాన్ని గ్రహించాలన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విధులు నిర్వహించిన ఐఏఎస్ అధికారులు చాలామంది ప్రస్తుతం జైలుపాలయ్యారన్నారని గుర్తు చేశారు. మిగిలిన మంత్రుల్ని, వైఎస్ పరిపాలనలో కీలక సూత్రదారిగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు కెవిపిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. జగన్ దోపిడీ చేసిన ధనం తిరిగి ప్రజలకే చెందాలని అభిప్రాయపడ్డారు. అధికారంలోకి రాగానే ఆ సొమ్మంతా రికవరీ చేస్తామంటూ వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more