యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు అన్నా బృందంలో అంతరాలకు కారణమవుతున్నాయి. ఒకరి వ్యాఖ్యలను మరొకరు తోసిపుచ్చడం, ఖండించడం పరిపాటిగా మారిపోయింది. దీంతో అన్నా బృందలో సమన్వయలోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ప్రధానమంత్రి శిఖండి అంటూ ప్రశాంత్ భూషన్ చేసిన వ్యాఖ్యానాలు ఊహించనివిగా అన్నా బృంద సభ్యుడు కర్ణాటక మాజీ లోకాయుక్త జస్టిస్ సంతోష్‌హెగ్డే అన్నారు.
ఇక ప్రధాని మన్మోహన్‌ను శిఖండి అని తాను అనలేదని ప్రశాంత్ భూషణ్ 24గంటల్లోనే మాట మార్చేశారు.మహాభారతంలో పాండవులు శిఖండిని ఉపయోగించుకున్నట్లుగానే... కాంగ్రెస్ పార్టీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను రక్షణ కవచంలా వినియోగించుకుంటోందని ప్రశాంత్ వివరణ ఇచ్చారు. ప్రధాని అవినీతి పరుడు కాదని మాకు కూడా తెలుసు. అయితే ఆయన నాయకత్వంలో అవినీతి పెరిగిపోతుంటే ఇక ప్రధాని వ్యక్తిగత నిజాయతీకి తావేముందని ప్రశాంత్ భూషణ్ ప్రశ్నించారు. మరోవైపు ప్రధాని మన్మోహన్‌సింగ్ నిజాయతీపరుడంటూ అన్నా హజారే ప్రస్తుతించడంపై ఆయన బృందం వివరణ ఇచ్చింది. ప్రధానమంత్రికి సంబంధించిన ఆ మొత్తం వ్యవహారంపై అన్నాకు సరైన అవగాహన లేదని దీనిపై తాము ఆయనకు సమాచారం అందిస్తామని ప్రశాంత్ భూషన్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more