మద్యం సిండికేట్లలో తనకు సంబంధం లేదని, ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించాలని ఎక్సయిజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఈ అంశంలో తన పేరు పదేపదే ప్రస్తావనకు రావడం బాధేస్తోందని, దీనికి ఇంతటితో పుల్‌స్టాప్ పెట్టాలని తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఆయన సమావేశమయ్యారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఎసిబికి పట్టుబడిన నున్నా రమణ మంత్రి మోపిదేవి వెంకటరమణకు పదిలక్షలు ఇచ్చినట్లు చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరుగుతున్న సమయంలో మరోసారి మంత్రి పేరును రమణ ప్రస్తావించినట్లు తెలిసింది. ఇద్దరు వ్యక్తుల చేత మంత్రికి డబ్బులు పంపినట్లు రమణ ఒప్పుకున్నట్లు తెలిసింది. దీనిపై గతంలోనే విచారణకు సిద్ధమని మంత్రి మోపిదేవి చెప్పారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో పేర్లు బయటపెట్టాలని సిఎంను కోరారు. ఈ నేపథ్యంలో మళ్ళీ తన పేరును ప్రస్తావించడంతో ఆయన సిఎంను కలిసి వివరణ ఇచ్చుకున్నారు. సిఎంను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో తనకు సంబంధం లేదని చెబుతూ వస్తున్నా మళ్ళీ ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యంపై ఈ నెల 23న అసెంబ్లీలో చర్చకు వస్తున్నందున అదే రోజు సమాధానం చెబుతానని అన్నారు.
పదిలక్షలు తానే ఇచ్చినట్లు ఒకసారి, ఇద్దరు వ్యక్తుల చేత డబ్బులు పంపినట్లు మరోసారి రమణ చెప్పడంలోనే నిజమెంత ఉందో తెలుస్తోందన్నారు. తన పేరు పదేపదే ఎందుకు వస్తుందో తెలియడం లేదని, దీనివల్ల మానసికంగా కృంగదీస్తోందన్నారు. ఎసిబి తీరు ఇబ్బందికరంగా ఉందని, దీనికి ఇంతటితో పుల్‌స్టాప్ పెట్టాలని సిఎంతో చర్చించినట్లు చెప్పారు. ఎసిబి కావాలని చేస్తోందని, తన పేరు చెప్పడంపై కొన్ని అనుమానాలు వస్తున్నాయని ఎసిబి తీరును ఆయన తప్పుపట్టారు. మంత్రికి సంబంధం లేదని చెప్పిన మరో ఇద్దరి నుండి ఎసిబి వివరణ తీసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు మాట్లాడకముందే తాను స్పందించానని, తనకు సంబంధం ఉంటే రాజీనామా చేస్తానని మొదటే చెప్పానని అన్నారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో తనకు సంబంధం లేదన్నారు. తాను ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయడం లేదన్నారు. పార్టీ ఆధిపత్య పోరులో తనను పావుగా వాడుకుంటున్నారన్న వార్తలను ఆయన ఖండించారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more