తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలంలో ధ్వంస రచన సంఘటనల నుంచి తేరుకోకముందే మళ్లీ ధవళేశ్వరంలో తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు మరో విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దాంతో దళిత సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. గ్రామానికి దూరంగా ఉండే క్వారీ కెనాల్ రోడ్డులో అంబేద్కర్ విగ్రహం తల, కుడి చేయిని దుండగులు తొలగించి పక్కనే ఉన్న కాల్వలో పడేశారు. సంఘటన తెల్లవారుజామున 2-3 గంటల మధ్య జరిగి ఉంటుందని గ్రామస్థులు భావిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైన విషయాన్ని గుర్తించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అర్బన్ ఎస్పీ పి ఉమాపతి, సౌత్ జోన్ డిఎస్పీ వి రాజగోపాల్ ధ్వంసమైన విగ్రహం వద్దకు చేరుకున్నారు. పరిస్థితి సమీక్షించిన వెంటనే ధవళేశ్వరంలో భారీగా పోలీసులను మొహరించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో విగ్రహం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. రాజమండ్రి- ధవళేశ్వరం ప్రధాన రోడ్డుకు అడ్డుగా పెద్ద బండరాళ్లు, సిమెంట్ దిమ్మలను ఉంచి రాకపోకలను స్తంభింపచేశారు. మరికొంతమంది ఆందోళనకారులు జాతీయ రహదారిపై బైఠాయించారు . అయిదు ఆర్టీసీ బస్సులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కందుల దుర్గేష్, బలశాలి ఇందిర, వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర నేత జక్కంపూడి విజయలక్ష్మి, మాలమహానాడు అధ్యక్షుడు ఆర్‌ఎస్ రత్నాకర్ తదితరులు ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించిన అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించారు. 48గంటల్లో దోషులను అరెస్ట్ చేయకుంటే తాను ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ అల్టిమేటం జారీ చేశారు. 48 గంటల్లో దోషులను అరెస్ట్ చేస్తామని అర్బన్ ఎస్పీ ఉమాపతి హామీ ఇచ్చారు. దాంతో శాంతించిన ఆందోళనకారులు రాస్తారోకో విరమించారు.
ధ్వంస రచన మిస్టరీ
అంబేద్కర్ విగ్రహం ధ్వంసం సంఘటన మిస్టరీగా మారింది. అమలాపురంలో పరిస్థితి అదుపులోకి వస్తున్న సమయంలో మళ్లీ ఎవరు దుస్సంఘటనకు పాల్పడి ఉంటారో పోలీసులకు అంతుచిక్కటం లేదు. తెల్లవారుజామున పెద్ద శబ్ధం రావటంతో తాను బయటకు వచ్చి చూశానని, అప్పటికే ఒక యువకుడు వేగంగా నడుచుకుంటూ వెళ్లిపోయాడని, ధ్వంసమైన విగ్రహానికి ఎదురుగా గుడిసెలో ఉంటున్న రమణమ్మ అనే వృద్ధురాలు చెప్పింది. అయితే తనకు చూపు సరిగా లేకపోవటం వల్ల స్పష్టంగా చూడలేకపోయానని చెప్పింది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. పోలీసు జాగిలాన్ని రప్పించినా ఫలితం లేకపోయింది. క్లూస్ టీంలు రంగంలో దిగాయి.. అమలాపురం సంఘటనతో అప్రమత్తమై నిఘా ఉంచామని, అయినా ఈ సంఘటన చోటుచేసుకోవటం దురదృష్టకరమన్నారు. జిల్లా కలెక్టర్ రవిచంద్ర సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more