TANA board director lost Family in road accident అమెరికా రోడ్డు ప్రమాదం.. తానా ప్రముఖుడి కుటుంబం దుర్మరణం

Tana board director s wife daughters killed in accident in texas

TANA Board Director, Dr. Nagendra Srinivas, Kodali Nagendra Srinivas, Family, Wife, two children, Pick-up Truck, Lexus car, Road Accident, Kickapoo Road, Texas, TANA, TANA director wife and children died, Pediatric Cardiovascular Anesthesiologist, Guntur Medical College, Kurumaddhali, Krishna district, TANA, Accident, Telugu Association of North America, Texas, US

The wife and two daughters of Dr. Nagendra Srinivas Kodali, a director of the Board of the Telugu Association of North America (TANA) were killed in a major accident in Waller City of Texas, United States. The accident took place at around 11 am EST on Sunday on the FM 2920 stretch at Kickapoo Road, according to Waller police.

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు ప్రముఖుడి కుటుంబం దుర్మరణం

Posted: 09/27/2022 01:42 PM IST
Tana board director s wife daughters killed in accident in texas

అమెరికాలో భారతీయులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకులు వీకెండ్ సందర్భంగా విహారానికని బయలుదేరి రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయాన్ని మరువకముందే మరో దారుణ ఘటన సంభవించింది. టెక్సాస్ వాలర్ కౌంటీలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముకుడి కుటుంబం ప్రాణాలను కోల్పోయింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డు డైరెక్టర్ డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ కుటుంబం రోడ్డు ప్రమాదంలో అసువులు బాసారు. ఆయన భార్య యలమంచిలి వాణిశ్రీ, ఆయన ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు.

శ్రీనివాస్ భార్య వాణి అమెరికాలో ఐటీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ పెద్ద కూతురు మెడిసిన్ కోర్సు చదువుతోంది. కాగా అమెకు దసరా సెలవులు రావడంతో ఇంటికి చేరుకునేందుకు స్థానిక ఎయిర్ పోర్టుకు వచ్చింది. అయితే అమెను ఎయిర్ పోర్టు నుంచి ఇంటికి తీసుకువెళ్లేందుకు తల్లి వాణితో పాటు అమె చిన్న కూతురు కలసి బయలుదేరి వెళ్లి పెద్ద కూతురును తమ లెక్ సెస్ కారులో ఎక్కించుకుని తిరుగుపయనం అవుతుండగా, ఆదివారం ఉదయం 11.30 గంటలకు టెక్సాస్ వాలర్ కౌంటీలో వారు ప్రయాణిస్తున్న కారును ఓ వ్యాను బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వాణి ఐటీ ఉద్యోగి కాగా, పెద్ద కుమార్తె వైద్య విద్యను అభ్యసిస్తోంది. రెండో అమ్మాయి 11వ తరగతి చదువుతోంది. ప్రమాదంలో భార్య, ఇద్దరు కుమార్తెలను కోల్పోయిన శ్రీనివాస్ షాక్‌లోకి వెళ్లిపోయారు. రోడ్డు ప్రమాద సమాచారం తెలిసిన తానా సభ్యులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా కురుమద్దాలికి చెందిన నాగేంద్ర శ్రీనివాస్ ఉన్నత విద్యను అభ్యసించేందుకు 1995లో అమెరికా వెళ్లారు. అనంతరం పీడియాట్రిక్ కార్డియోవాస్క్యులర్ అనస్థీషియాలజిస్ట్‌గా పనిచేస్తూ హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. 2017 నుంచి ‘తానా’ బోర్డులో పనిచేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles