MP Farmers Found Diamond In Panna District ఆ స్నేహితులందరూ రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు.!

Madhya pradesh farmers found 3 21 carat diamond in panna district

Farmers, Lucky Friends, Rajendra Gupta, Seven Farmer Friends, Brijpur, Lalki Dheri, diamond, 3.21 carats, mining authorities, mining Officials, millionaires overnight, Panna district, Madhya Pradesh

A farmer named Rajendra Gupta from Brijpur in Panna district of Madhya Pradesh had leased a small diamond mine in an area called Lalki Dheri some time ago along with six friends. Later, he started hunting for diamonds. Despite working continuously, the diamond was not found. Not disappointed though. He went ahead with the determination to get the diamond at any cost. In this order, they found a diamond worth 3.21 carats in the mine.

ITEMVIDEOS: ఆ ఏడుగురు స్నేహితులందరూ ఒకేసారి కోటీశ్వరులయ్యారు.!

Posted: 09/23/2022 05:13 PM IST
Madhya pradesh farmers found 3 21 carat diamond in panna district

అదృష్టం ఎప్పుడు.. ఎవరికి ఎలా కలసివస్తుందో తెలియదు. రాసిపెట్టి ఉండాలే కానీ అది తప్పక కలసివస్తుందని పెద్దలంటారు. కొందరికి లాటరీ రూపంలో అదృష్టం కలసివస్తే.. మరికొందరికీ తాము పట్టుకున్నదల్లా బంగరమయ్యేలా అదృష్టం కలసివస్తుంది. ఆనంతపురం, కర్నూలు జిల్లా సరిహద్దులోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే చాలు వజ్రాలు రైతుల పంట పండిస్తున్నాయి. కొందరి దశ తిరిగితే రాత్రికి రాత్రే లక్షాధికారులను చేస్తే.. మరికొందరినీ ఏకంగా కోటీశ్వరులను కూడా చేస్తున్నాయి. అయితే మన తెలుగురాష్ట్రాల్లోని కర్నూలు, అనంతపురం జిల్లాలో ఎలాంటి వజ్రాల గనులు లేకపోయినా రైతులు మాత్రం అదృష్టం వరిస్తోంది.

అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వజ్రాల గనులు ఉండేవి. అక్కడ వజ్రాలను వెలికితీసి భూమిని డొల్లాగా మార్చేశారు. అయితే ఇక అక్కడి గనుల్లో వజ్రాల కోసం ఎవరూ కాంట్రాక్టర్లు రావడం లేదు. దీంతో ఆ రాష్ట్ర గనుల శాఖ ఇప్పటికీ అక్కడి భూమిలో గనులు ఉన్నాయని వాటిని ఏడాది పాటు కావాల్సినవారికి లీజుకు ఇస్తోంది. అయితే లీజు కాలపరిమితి తీరిపోయే లోపు గనుల నుంచి వజ్రాలను సేకరించుకోవడం వారిపైనే అధారపడి ఉంటుంది. అయితే ఇక్కడి గనులను లీజుకు తీసుకుని స్థానికులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం పరిపాటిగా మారింది. అయితే అందరిలోనూ కొందరికి మాత్రమే అదృష్టాన్ని వరిస్తూవస్తోంది.

తాజాగా ఓ రైతు ఇక్కడి గని భూమిని లీజుకు తీసుకుని తనతో పాటు ఏడుగురి స్నేహితుల్ని ఒక్కరోజులో కోటీశ్వరులను చేశాడు. ఇంతకీ అతను ఏం చేశాడంటే.. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో పన్నా జిల్లాలోని బ్రిజ్‌పుర్‌కు చెందిన రాజేంద్రగుప్త అనే రైతు అక్కడి వజ్రాల గనుల్లో కొంతభూమిని లీజుకు తీసుకోవాలని భావించాడు. అయితే తాను ఒక్కడే మాత్రమే కాకుండా తనతో పాటు మిగిలిన ఆరుగురు స్నేహితులతో కలిసి ఈ కార్యానికి ఉపక్రమించాడు. లల్కీ ధేరీ అనే ప్రాంతంలో ఒక చిన్న వజ్రాల గనిని లీజుకు తీసుకున్నాడు. అనంతరం, వజ్రాల వేట ప్రారంభించాడు. ఈ క్రమంలో ఒక నెలపాటు నిరంతరాయంగా శ్రమించినా వజ్రం దొరకలేదు. అయినప్పటికీ నిరాశ చెందలేదు.

వజ్రాన్ని ఎలాగైనా సాధించాలన్న సంకల్పంతో ముందుకుసాగాడు. ఈ క్రమంలో గురువారం వారికి గనిలో విలువైన 3.21 క్యారెట్ల వజ్రం దొరికింది. ఎంతో ఆనందపడిన రాజేంద్ర గుప్త దాన్ని వెంటనే వజ్రాల కార్యాలయానికి తీసుకెళ్లి అధికారులకు చూపించారు. వజ్రాన్ని పరిశీలించిన అధికారులు.. వజ్రం విలువ భారీ మొత్తంలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో, వారి ఆనందం రెట్టింపు అయ్యింది. ఆ వజ్రాన్ని వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బును.. సమానంగా పంచుకుని ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తామని వారు వెల్లడించారు. ఇలా రాత్రికి రాత్రే వారు కోటీశ్వరులయ్యారు. ఈ విషయం కాస్తా దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles