Kerala cops fined EV owner for no pollution certificate కేరళ పోలీసుల తీరుతో విస్మయం చెందిన నెటిజనులు.!

Kerala cops issue fine to e scooter for not carrying pollution papers trolled

Kerala cops, electric scooter, Viral video, e-challan, pollution, kerala traffic police, netizens, social media, Neelanchery, Malappuram district, Kerala

A fine imposed on an electric scooter owner for failing to provide a pollution under control (PUC) certificate has landed the Kerala police team in hot water, with netizens taking a swipe at it on social media. Images of the vehicle and e-challan issued by the traffic police have been doing rounds on the internet. The challan was issued on September 6 (Tuesday) in Neelanchery, Kerala's Malappuram district.

కేరళ పోలీసుల తీరుతో విస్మయం చెందిన నెటిజనులు.!

Posted: 09/10/2022 12:40 PM IST
Kerala cops issue fine to e scooter for not carrying pollution papers trolled

కేర‌ళ ట్రాఫిక్ పోలీసులు తీరుపై నెటిజనులు విభిన్నంగా స్పందిస్తున్నారు. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు క్రమంగా పెరుగుతున్న వేళ.. అసలు వాటిని ఎందుకు అంతలా ప్రపంచ దేశాలు కూడా ప్రోత్సహిస్తున్నాయో కూడా కేరళా పోలీసులకు తెలియదా.? అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు మనదేశంలోని పలు రాష్ట్రాలు ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఖర్చులను కూడా మాఫీ చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు కేంద్రం ప్రకటించిన రాయితీలకు అదనంగా మరిన్ని రాయితీలను కూడా భరిస్తున్నాయి.

ఎందుకని అన్న విషయం కేరళ పోలీసులకు తెలిసా.? తెలియదా.? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం తెలియకుండానే ట్రాఫిక్ పోలీసులు ఉద్యోగాలు వెలగబెడుతున్నారా.? అని ప్రశ్నలు వినబడుతున్నాయి. ఎందకంటే.. వారు చేసిన నిర్వాకం అలాంటిది. ఓ ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్‌కు పొల్యూష‌న్ స‌ర్టిఫికెట్ పేరిట చ‌లాన్ విధించారు. ప్రస్తుతం ఈ చ‌లాన్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కాలుష్య రహితంగా ఉండే విద్యుత్ వాహనాలకు కాలుష్య సర్టిఫికెట్ లేదంటూ కేరళ పోలీసులు వేసిన జరిమానా.. నెటిజనులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కేర‌ళ‌లోని మ‌లప్పురం జిల్లాలోని నీలాన్‌చెరి ఏరియాలో ఓ ఎల‌క్ట్రిక్ టూ వీల‌ర్‌కు ట్రాఫిక్ పోలీసులు చ‌లాన్ విధించారు. ఎందుకంటే ఆ వెహిక‌ల్‌కు పొల్యూష‌న్ అండ‌ర్ కంట్రోల్ స‌ర్టిఫికెట్ లేద‌ని చ‌లాన్ విధించిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు గానూ రూ. 250 జ‌రిమానా విధించారు. మోటార్ వెహిక‌ల్ చ‌ట్టం 1998లోని సెక్ష‌న్ 213(5)(e) ప్ర‌కారం చ‌లాన్ జారీ చేసిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే దీనిపై నెటిజ‌న్లు తీవ్రంగా స్పందించారు. ఈ విష‌యంలో జోక్యం చేసుకోవాల‌ని కేంద్ర ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి నెటిజ‌న్లు విజ్ఞ‌ప్తి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles