Drug investigation: Goa police not cooperating, says Hyd CP గోవా పోలీసులపై హైదరాబాద్ సీపీ సంచలన అరోపణలు

Drug investigation goa police not cooperating says hyderabad police commissioner

Sonali Phogat, drug racket, hyd police, goa police, Hyderabad Police Commissioner, IPS CV Anand, narcotic cases, drug peddlers, dark web, crypto-currency, couriers, Crime

Hyderabad: City Police Commissioner CV Anand accused Goa police of not cooperating with the Hyderabad counterparts in narcotic cases. He said Hyderabad police sought the help of Goa police in narcotic-related cases, but they did not cooperate. The remarks come in the wake of the investigation into interstate drug peddlers. Hyderabad CP was speaking at a press meet on drugs, the dark web, crypto-currency, and couriers.

సోనాలి ఫోగెట్ హత్యకేసులో గోవా పోలీసులపై హైదరాబాద్ సీపీ సంచలన అరోపణలు

Posted: 09/02/2022 04:15 PM IST
Drug investigation goa police not cooperating says hyderabad police commissioner

గోవాలోని అంజునా పోలీసుల నిర్లక్ష్యమే బీజేపీ నేత, టిక్‌ టాక్‌ స్టార్ సొనాలీ ఫోగట్‌ హత్యకు పరోక్ష కారణమైందని నగర పోలీసులు అరోపణలు సంధించారు అమె హత్యకేసులో నిందితులుగా ఉన్న వారిలో ఇద్దరు ఉస్మానియా యూనివర్సిటీ ఠాణాలో గత నెలలో నమోదైన డ్రగ్స్‌ కేసులోనూ నిందితులుగా ఉన్నారని.. దీనిపై అధికారిక సమాచారం ఇచ్చినా అంజునా పోలీసులు స్పందించలేదని హైదరాబాద్‌ పోలీసు కమీషనర్ సీవీ అనంద్ పేర్కొన్నారు. ఫోగట్‌ హత్యకేసులో అభియోగాలు ఎదుర్కోంటున్న పబ్‌ యజమాని సహా మరొకరు ఇక్కడి పోలీసులకు వాంటెడ్‌గా ఉన్నారని ఆయన తెలిపారు. వీరిని పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌ తీసుకువస్తామని గురువారం కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు.

గోవాలోని అంజునా బీచ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఏళ్లుగా డ్రగ్స్‌ దందా చేస్తున్న ఘరానా డ్రగ్‌ పెడ్లర్‌ ప్రీతీష్‌ నారాయణ్‌ బోర్కర్‌ను హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌– న్యూ) గత నెల 17న పట్టుకుంది. ఇతడి విచారణలో అంజునా ప్రాంతానికే చెందిన స్టీవెన్, ఎడ్విన్‌ నూనిస్‌ సహా ఆరుగురి నుంచి డ్రగ్స్‌ దేశవ్యాప్తంగా చలామణి అవుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రీతీష్‌ను అరెస్టు చేసిన ఉస్మానియా వర్సిటీ పోలీసులు ఆ కేసులో ఆరుగురినీ నిందితులుగా పేర్కొన్నారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ కాపీ సహా ఇతర వివరాలను అంజునా పోలీసులకు పంపిన హైదరాబాద్‌ అధికారులు వారిని అరెస్టు చేయాల్సిందిగా కోరారు.

దేశవ్యాప్తంగా జరుగుతున్న డ్రగ్స్‌ దందాకు గోవా కేంద్రంగా నిలుస్తుందన్న వార్తల నేపథ్యంలో అక్కడి పోలీసుల వీరికి అందిస్తున్న సహకారంతోనే ఈ వ్యాపారం సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ పోలీసులకు చిక్కిన ఓ వ్యక్తిని ప్రశ్నించగా.. గోవా నుంచి డ్రగ్‌ సరఫరా అయినట్లు తేలింది. దీంతో హెచ్‌– న్యూ టీమ్‌ అక్కడకు వెళ్లి బల్క్ సప్లయర్ ఉన్న హోటల్‌పై దాడి చేసింది. ఫలితంగా అతడు చిక్కడంతో పాటు దాదాపు 100 గ్రాముల ఎండీఎంఏ రికవరీ అయింది. కాగా, అంజునా పోలీసులు నిందితుడిని తీసుకువెళ్లడానికి వీల్లేదని, తామే అరెస్టు చూపిస్తామని పట్టుబట్టారు. ఆపై పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లాలని చెప్పి పంపారు. కానీ దానిపై ఇప్పటికే కేసు నమోదే కాలేదని సమాచారం.

తమకు వాంటెడ్‌గా ఉన్న వారిని అరెస్టు చేయడానికి వెళ్లిన హెచ్‌–న్యూ అధికారులు నిందితులను అరెస్టు చేసి తీసుకువెళితే కిడ్నాప్‌ కేసులు పెడతామంటూ గోవా పోలీసులు బెదిరించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే స్టీవెన్, ఎడ్విన్‌ నూనిస్‌ల సమాచారాన్ని హెచ్‌–న్యూ గోవా పోలీసులకు అందించి అరెస్టు చేయమని కోరింది. ఎడ్విన్‌ అంజునా ప్రాంతంలో గ్రాండ్‌ లియోనీ రెసార్ట్, స్టీవెన్‌ హిల్‌ టాప్‌ పబ్‌ నిర్వహిస్తున్నారని, వీటిలో పని చేసే వారితోనే డ్రగ్స్‌ అమ్మిస్తున్నారని తెలిపింది. అయినప్పటికీ గోవా పోలీసులు పట్టించుకోలేదు. డ్రగ్స్‌ కేసులో నిందితులను అరెస్టు చేయడానికి గోవా వెళ్లిన ప్రతిసారీ నెగెటివ్‌ రిజల్ట్స్‌ వస్తున్నాయి. గోవా డ్రగ్‌ నెట్‌వర్క్‌పై హెచ్‌–న్యూకు ఉన్న సమాచారం గోవా పోలీసులకు ఎందుకు లేదంటూ అక్కడి పత్రికలూ రాస్తున్నాయి’ అని సీవీ ఆనంద్‌ అన్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles