Man From Kerala Dies In Ambulance As Door Gets Jammed ఆంబులెన్స్ డోర్ తెరచుకోక.. ఆసుపత్రి ఎదుట బాధితుడు మృతి

Man from kerala dies in ambulance as door gets jammed in front of govt medical college

bike accident, injured man, man passed away in ambulence, Government medical college, ambulance door stuck, ambulance door jammed, Ambulence, door stuck, koyamon, casualty department, Feroke, Veena George, kerala health minister, investigation, Kerala

A man who had been injured in a bike accident passed away inside the ambulance that took him to the local government medical college after the door of the van wouldn't open owing to a problem. The man was recognised by police as Koyamon, 66 years old, a resident of the adjacent Feroke.

ఆంబులెన్స్ డోర్ తెరచుకోక ఆసుపత్రి ఎదుట బాధితుడు మృతి

Posted: 08/30/2022 08:41 PM IST
Man from kerala dies in ambulance as door gets jammed in front of govt medical college

విధి ఎంతటి విచిత్రమైందో, కఠానాత్మమైనదో ఈ ఘటన మనకు తెలియజేస్తోంది. ఓ రోడ్డు ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని గుర్తించిన స్థానికులు అంబులెన్సుకు ఫోన్ చేశారు. అంబులెన్సు కూడా సకాలంలోనే చేరుకుని ప్రమాద బాధితుడ్ని అసుపత్రికి తరలించింది. అయితే తీరా అసుపత్రి ఎదుటకు చేరే సరిరిక అంబులెన్సు తలుపులు బలంగా ఇరుక్కుపోయాయి. దీంతో అంబులెన్స్ తలుపులు తెరుచుకోకపోవడంతో సకాలంలో అసుపత్రికి చేరినా.. వైద్యులు చికిత్స చేసే అవకాశం లేకపోవడం.. అప్పటికే తీవ్ర రక్తస్త్రావంతో బాధితుడు మరణించాడు. ఈ ఘటన కేరళలో వెలుగు చూసింది.

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కోయమాన్ (66)‌ను ఒక స్కూటీ బలంగా ఢీకొట్టింది. రోడ్డుపై రక్తపు మడుగులో అతను పడిపోయి ఉండటం చూసిన కొందరు అంబులెన్సుకు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న ఒక అంబులెన్సు అతన్ని స్థానికంగా ఉన్నఆస్పత్రికి తీసుకెళ్లింది. కానీ ఆస్పత్రికి చేరుకున్న తర్వాత ఆ అంబులెన్సు తలుపులు తెరుచుకోలేదు. డ్రైవర్, అటెండెంట్ ఎంత ప్రయత్నించినా వాటిని తెరవలేకపోయారు. అరగంటపాటు కష్టపడిన తర్వాత వేరే వాళ్లు వచ్చి అంబులెన్సు అద్దాలు పగలగొట్టి, లోపలి నుంచి తలుపులు తెరిచారు. కానీ అప్పటికే కోయమాన్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

విధి ఎంతటి బలీయమైందో కదా.. ప్రాణాలను రక్షించే వైద్యుల ఉండే ఆసుపత్రి ఎదుట ఉండి కూడా కోయమాన్ ప్రాణాలను రక్షించలేకపోయారు. ఆంబులెన్స్ డ్రైవర్, అటెండెంట్ ఇద్దరూ వేగంగా కోయమాన్ ను అసుపత్రికి తరలించారు కానీ.. వైద్యుల వద్దకు చేర్చడంలో విఫలమయ్యారు. అదే అదునుగా చేసుకున్న విధి అతని ప్రాణాలను హరించింది. కేరళలోని ఫెరోకే సమీపంలో నివశించే కోయమాన్.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లుండగా అటుగా వెళ్తున్న ఒక స్కూటీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అంబులెన్సు తలుపుల సంగతి తమకు తెలియదని అతన్ని తీసుకొచ్చిన మెడికల్ కాలేజీ తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles