Man tries to taunt bull in the streets, gets trampled ఎద్దుతో ఆడుకోబోయి.. కుదేలయిన వ్యక్తి..

Viral video man tries to taunt bull in the streets gets trampled in front of onlookers

Bull attack, viral, man taunting bull gets trampled, bull attacks man, bull attack video, Bull attack viral clip, Bull attack spain, animal video, viral video

Ricky Gervais, who is known to be a fierce animal rights activist, shared the shocking footage on Twitter. It was originally shared online by Patrice Pressard. In the short video, the man wearing a black t-shirt is seen raising his left arm next to the bull's horn. The very next second, the bovine jumps up and attacks the man's face with its horns as onlookers start screaming in fear.

ITEMVIDEOS: వైరల్ వీడియో: ఎద్దుతో ఆడుకోబోయాడు.. కుమ్మి పడేసింది..

Posted: 08/30/2022 01:36 PM IST
Viral video man tries to taunt bull in the streets gets trampled in front of onlookers

సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు గంగిరెద్దుల వాడు వచ్చి.. తన ఎద్దు చేత ప్రతీ ఇంటి ముందు ఆడించి.. మెప్పించి వారిచ్చే బియ్యం, గోధుమలు, డబ్బులు, ఇత్యాది కానుకలను అందుకుంటాడు. కానీ ఆ ఎద్దు గంగిరెద్దుల వాడిపై దాడి చేసిందన్న ఘటనలు మాత్రం ఎప్పుడూ వినలేదు. ఎందుకంటే ఆ ఎద్దును అతను తన బిడ్డలానే చూసుకుంటాడు. అతని ప్రేమకు అంతటి భారీ జంతువు కూడా లొంగిపోతుంది. అదే వారిద్దరి మధ్య అనుబంధం. అది చూసి తాను అలా చేయాలని ఎవరైనా అనుకుంటే.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమవుతుంది. నక్క ఎప్పటికీ పులి కాలేదు కదా.

‘పులి చనువిచ్చింది కదా అని ఆడుకోవాలని చూస్తే వేటాడేస్తది’ అని యమదొంగ సినిమాలో డైలాగ్. ఈ డైలాగ్ పులికే కాదు, ఏ జంతువుకైనా సరిపోతుంది. వాటితో ప్రేమగా మెలిగితే పర్వాలేదని ఊరుకుంటాయి కానీ.. ఎవడు పడితే వాడు.. దానిని ఆడించాలని అనుకుంటే.. ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నం అవుతాయని ఈ ఘటన నిరూపిస్తోంది. రోడ్డుపై కనబడిన ఓ ఎద్దు చుట్టూ జనాన్ని చేర్చిన తరువాత దానిని అందరిలో ఆటపట్టించేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అంతే యమదోంగ సినిమా డైలాగ్‌ను నిజం చేసి చూపించింది. జంతు ప్రేమికుడిగా పేరున్న బ్రిటిష్ కమెడియన్ రిక్కీ గెర్వాయిస్ ఒక వీడియో షేర్ చేశారు.

ఒక ఎద్దు రోడ్డుపై నిలబడి ఉంది. ఒక వ్యక్తి దాని వద్దకొచ్చి, అవతల ఉన్న జనాలతో ఏదో అంటూ ఎద్దు కొమ్ముల మధ్యలో టచ్ చేశాడు. అంతే, ఆ ఎద్దు ఒక్క ఉదుటున అతన్ని కొమ్ములతో కుమ్మేసింది. అతను కింద పడగానే మొఖంపై ఒక్క తన్ను తన్నింది. ఆ వెంటనే అక్కడి నుంచి ఎద్దు పారిపోయింది. దెబ్బ గట్టిగా తగలడంతో సదరు యువకుడు స్పృహ తప్పి పడిపోయాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘హాని కలిగించడానికి ప్రయత్నిస్తుండగా ఎవరికైనా హాని జరిగితే.. సానుభూతి రాదు’ అని కొందరు అంటున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందీ ఇంకా తెలియరాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles