2 Air France pilots suspended after fighting in cockpit విమానం గాల్లో ఉండగా… కాక్‌పిట్‌లో కొట్టుకున్న పైలట్లు

Two air france pilots suspended after fighting in cockpit offical

Air France Fought On Plane pilots, air france, france, la tribune, airbus, paris, geneva, passengers at risk, complete safety audit, Geneva-Paris flight, Air France official, Air France, pilots, fight in cockpit, airlines, Air France pilots, BEA, France

In an appalling incident, two airline pilots put the safety of passengers at risk after they indulged in fist-fights and grabbed each other’s collars. Reportedly, a dispute between the pilot and co-pilot took an ugly turn during a flight and quickly turned into a physical fight. According to an Air France official, both the Air France pilots have been suspended for showing this reckless behaviour. The fight broke out in the cockpit during a Geneva-Paris flight in June, as soon as the plplane got into the air.

ప్రయాణికుల ప్రాణాలు పట్టవా: కాక్ పిట్లో పైలట్ల కోట్లాట: ఇద్దరి సస్సెండ్..

Posted: 08/29/2022 05:58 PM IST
Two air france pilots suspended after fighting in cockpit offical

విమానంలో ప్రయాణికులు ఉన్నారు. విమానం గాల్లో ఉంది. గమస్యస్థానం చేరేందుకు సమయం పడుతుందని తెలిసి వారిలో కొందరు హాయిగా కునుకు తీస్తుండగా, మరికొందరు పుస్తక పఠనం, ఇంకోందరు మొబైల్ ఫోన్లు చూస్తూ సేద తీరుతున్నారు. ఇంతలో కాక్ పిట్ నుంచి వారికి కాసింత పెద్దగానే శబ్దాలు వచ్చాయి. అనుమతి లేని కారణంగా వారు వెళ్లి చూడలేదు. కాగా ఇవే శబ్దాలు కెబిన్ క్రూ సిబ్బందికి కూడా వినిపించాయి. వారు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు పరుగుపరుగున కాక్ పిట్లోకి వెళ్లారు. కాక్ పిట్ లోని ఇద్దరు పైలట్లు కొట్టుకున్నారు. ఒకరి చొక్కాలు మరొకరు పట్టుకుని పిడిగుద్దులు కురిపించుకున్నారు.

క్యాబిన్ క్రూ సిబ్బంది దీనిని గమనించిన వారిద్దరి మధ్య జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఎయిర్‌ ఫ్రాన్స్‌కు చెందిన విమానంలో ఈ సంఘటన జరిగింది. జూన్‌లో ఎయిర్‌ ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్ బస్‌ విమానం జెనీవా నుంచి పారిస్‌కు బయలుదేరింది. విమానం టేకాఫ్‌ అయ్యి గాల్లో ఎగురుతుండగా కాక్‌పిట్‌లో ఉన్న పైలట్‌, కో పైలట్‌ మధ్య వివాదం జరిగింది. దీంతో వారిద్దరూ ఘర్షణ పడ్డారు. ఒకరి చొక్కా కాలర్‌ను మరొకరు పట్టుకుని చెంపదెబ్బలు, పిడిగుద్దులు కురిపించుకున్నారు. శబ్దాలు రావడాన్ని గమనించిన కేబిన్‌ సిబ్బంది వెంటనే జోక్యం చేసుకుని ఇద్దరికీ సర్థిచెప్పారు.

ఈ సంఘటన నేపథ్యంలో విమానం గమ్యస్థానం చేరేవరకు ఒక పైలట్‌ డెక్‌లో ఉన్నాడు. ఎయిర్‌ ఫ్రాన్స్‌ సంస్థ ప్రతినిధి ఈ సంఘటనను ధృవీకరించారు. క్యాబిన్ క్రూ సిబ్బంది జోక్యంతో ఇద్దరి మధ్య పరిస్థితి త్వరగా సద్దుమణిగిందని, విమానం సురక్షితంగా గమ్యస్థానానికి చేరిందని మీడియాకు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన ఇద్దరు పైలట్లను సస్పెండ్‌ చేసినట్లు వెల్లడించారు. మరోవైపు ఫ్రాన్స్ సివిల్ ఏవియేషన్ సేఫ్టీ ఇన్వెస్టిగేషన్ అథారిటీ, బ్యూరో డి ఎన్‌క్యూటెస్ ఎట్ డి ఎనాలిసెస్ (బీఈఏ) కూడా ఎయిర్‌ ఫ్రాన్స్‌ పైలట్ల తీరును తప్పుపట్టింది. భద్రతా నిబంధనల ఉల్లంఘనపై ఆందోళన వ్యక్తం చేసింది. ఎయిర్‌ ఫ్రాన్స్‌లో ఇటీవల జరిగిన మరిన్ని సంఘటనలతో కూడిన నివేదికను గత వారం విడుదల చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles