Rape-accused Lingayat seer detained by police in Karnataka మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు మఠాధిపతి అరెస్ట్

Pocso case filed against murugha mutt seer shivamurthy murugha sharanaru

Shivamurthy Murugha Sharanaru, Lingayat mutt seer, chief pontiff, minor girl students, sexually assault on minors, muruga mutt, murugha mutt seer, muruga mutt controversy, muruga mutt scandal, Chitradurga, Mysuru city police, FIR, POCSO Act, Haveri district, Karnataka, Crime

Shivamurthy Murugha Sharanaru, a prominent Lingayat mutt seer, was detained after he was booked for sexually assaulting minors in Karnataka. The seer, who is the chief pontiff of the prominent Murugha mutt in Karnataka's Chitradurga, was detained from Haveri district. He is accused of sexually assaulting girl students at the institution run by the mutt. The Mysuru city police have registered an FIR after a complaint was filed on behalf of two minors. He has been booked under sections of the Protection of Children from Sexual Offences (POCSO) Act.

మైనర్లపై లైంగిక వేధింపు ఆరోపణలు: లింగాయత్ మఠాధిపతి శివమూర్తి మురుగ అరెస్ట్

Posted: 08/29/2022 04:07 PM IST
Pocso case filed against murugha mutt seer shivamurthy murugha sharanaru

కర్ణాటకలోని ప్రముఖ లింగాయత్ మఠాధిపతిపై లైంగిక దాడి ఆరోప‌ణ‌ల‌ నేపథ్యంలో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. లింగాయ‌త్ మ‌ఠం పిఠాధిపతి స‌న్యాసి శివమూర్తి మురుగ శ‌ర‌న‌రుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మైసూరు నగరం పోలీసులు ఆయనను ఇవాళ అరెస్టు చేశారు. హ‌వేరి జిల్లాలోని చిత్ర‌దుర్గ‌లో గల లింగాయత్ మఠానికి వెళ్లిన పోలీసులు మురుగ మ‌ఠాధిప‌తి శివ‌మూర్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆయనపై లైంగిక వేధింపుల అరోపణలు నమోదయ్యాయి. లింగాయత్ మ‌ఠం నిర్వ‌హించే విద్యాసంస్థలలో చ‌దువుతున్న ఇద్దరు మైనర్ బాలిక‌ల‌పై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అరోపణలు వున్నాయి.

మైన‌ర్ బాలిక‌ల త‌ర‌పున ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా శివ‌మూర్తి మురుగ‌పై ఇదివరకే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మైసూర్ సిటీ పోలీసులు ఇవాళ ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఆయ‌న‌పై పోక్సో స‌హా ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. మ‌ఠం నిర్వ‌హిస్తున్న స్కూల్‌లో చదువుత‌న్న ఇద్ద‌రు బాలిక‌ల‌ను మైసూరుకు చెందిన ఎన్‌జీఓ ఒద‌నాది సేవా సంస్ధ కాపాడి ఆపై మ‌ఠాధిప‌తి నిర్వాకంపై ఇల్లా బాల‌ల సంక్షేమ క‌మిటీకి ఫిర్యాదు చేసింది. మురుగ మ‌ఠానికి చెందిన హాస్ట‌ల్‌లో ఉంటున్న 15, 16 పంవ‌త్స‌రాల ఇద్ద‌రు బాలిక‌ల‌ను శివానంద మురుగ మూడున్న‌ర ఏండ్లుగా లైంగిక వేధింపుల‌కు గురిచేస్తున్నారని వారు పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కోన్నారు.

కాగా ఆయనపై భయంతో ఈ విష‌యం ఎవ‌రికీ చెప్ప‌లేదు. ఇక ఆయనకు రాష్ట్రీయంగా ఉన్న పరపతి కూడా అధికంగా ఉండటంతో వారు మౌనంగానే మూడున్నరేళ్లుగా భాధను అనుభవిస్తున్నారు. ఇక ఆయన ఆశ్రమానికి వచ్చే రాష్ట్ర ప్రముఖులు జాబితాలో ఏకంగా ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు కూడా ఉన్న కారణంగా వారు భయపడ్డారని తెలిపారు. ఇదే సంస్ధ‌లో చ‌దువుతున్న మ‌రికొంద‌రు విద్యార్ధినుల‌ను శివ‌మూర్తి లైంగిక వేధింపుల‌కు గురిచేసిన‌ట్టు ఆరోప‌ణ‌లున్నాయ‌ని ఎన్‌జీఓ అధిప‌తి స్టాన్లీ తెలిపారు. త‌మ‌కు ఎలాంటి బెదిరింపులు వ‌చ్చినా వెన‌క్కి త‌గ్గ‌బోమ‌ని, బాల‌ల హ‌క్క‌లు కాపాడ‌టం స‌మాజంలోని అంద‌రి బాధ్య‌త‌ని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles