ఓ తాగుబోతు మనస్సును నోప్పిస్తే ఇలా కూడా చేస్తారా.? అన్న అలోచన సామాన్య ప్రజల్లో ఉత్పన్నమయ్యేలా చేసిన ఘటన ఇది. తాగుబోతు చేసిన తుంటరి పనితో చెన్నై నుంచి దుబాయ్ బయలుదేరి వెళ్లాల్సిన విమానం ఆగిపోయింది. ఇక ఇదిగో విమానం బయలుదేరుతుందనగా.. వచ్చిన ఓ ఫోన్ కాల్ తో విమానం కాస్తా ఆగిపోయింది. ఫోన్ కాల్ కు తాగుబోతుకు ఏంటీ సంబంధం.. కొంపదీసి పీకల వరకు తాగేసి విమానం సకాలంలో అందుకోవడం లేటయ్యిందా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయా.? అదేం లేదు ఆయన తన ఇంట్లోనే ఉన్నాడు.
మరి ఎందుకని విమానం ఆగిపోయింది. అసలు ఫోన్ కాల్ ఏమని వచ్చింది. అనేగా మీ సందేహం. ఆ ఫోన్ కాల్ తో ఎయిర్‌పోర్టు సిబ్బంది, పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టేలా చేసింది. ఔనా, మ్యాటర్ మాకు అవగతం అవుతోంది. అదేనా అంటే అచ్చంగా మీ అనుమానం కరెక్టే. విమానంలో బాంబు పెట్టామని ఆ తాగుబోతు ఎయిర్ పోర్టుకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. తన ఇంట్లోనే ఉన్న తాగుబోతుకు విమానానికి ఏంటీ సంబంధం. అసలెందుకు ఇలా ఫోన్ చేయాల్సివచ్చింది అంటారా.? ఈ తాగుబోతు కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు శనివారం ఉదయం దుబాయ్ వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరారు.
అయితే వాళ్లు ఈ రోజు దుబాయ్‌కి వెళ్లడం తాగుబోతుకు ఇష్టం లేదు. కానీ, వాళ్లు అతని మాటను పట్టించుకోకుండా ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. దాంతో వాళ్లను ఎలాగైనా దుబాయ్ వెళ్లకుండా ఆపాలని తాగుబోతు ప్లాన్ చేశాడు. ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బందికి ఫోన్ చేసి సదరు విమానంలో బాంబు ఉందని చెప్పాడు. దాంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టి బాంబు లేదని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. దీంతో దుబాయ్ వెళ్లాల్సిన విమానం ఆరు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. ఇక ఫోన్ కాల్ ను ట్రేస్ చేసిన పోలీసులు తాగుబోతును విచారించగా తమ కుటుంబసభ్యులను దుబాయ్ వెళ్లకుండా ఆపేందుకే ఆ పని చేశానని చల్లగా చెప్పాడు. దాంతో ముక్కున వేలేసుకోవడం పోలీసుల వంతయ్యింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more