బాలీవుడ్ గాయకుడు, కంపోజర్ రాహుల్ జైన్ పై ఎఫ్ఐఆర్ నమోదు. కాస్ట్యూమ్ స్టైలిస్ట్‌పై లైంగిక దాడికి పాల్పడ్డారన్న అభియోగాలపై ఆయనపై అత్యాచారం కేసు నమోదు కావడం బీటౌన్ లో కలకలం రేపుతోంది. తన ముంబై ఫ్లాట్ లో ఉన్న 30 ఏళ్ల కాస్ట్యూమ్ స్టయిలిస్ట్ పై అత్యాచారానికి పాల్పడ్డాడనే అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై అత్యాచారం చేశాడంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదయింది. ఇన్‌స్టాగ్రాంలో తనను పరిచయం చేసుకున్న రాహుల్ జైన్ తనను తన ఫ్లాట్ కు రమ్మని పిలిచాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది.
ఇన్‌స్టాగ్రాంలో తాను చేసిన పనిపై ప్రశంసలు కురిపించిన ఆయన ఆహ్వానం మేరకు అంధేరిలోని రాహుల్ జైన్ ఫ్లాట్‌కు వచ్చిన కాస్ట్యూమ్ స్టైలిస్ట్ పై అత్యాచారానికి పాల్పడ్డాడని అమె పేర్కొంది. వివరాల్లోకి వెళ్తే.. తనను ఇన్‌స్టాగ్రాంలో తనను పరిచయం చేసుకున్న రాహుల్ జైన్ తన వర్క్ గురించి ప్రశంసలు గుప్పించాడని అంధేరిలోని తన ఫ్లాట్‌కు రావాలని ఆహ్వానించాడని కాస్ట్యూమ్ స్టైలిస్ట్ పేర్కొంది. తనను పర్సనల్ కాస్ట్యూమ్ స్టయిలిస్టుగా నియమించుకుంటానని చెప్పాడం.. తనకు వచ్చిన ఆఫర్ తో ఉబ్బితబ్బిబైన బాధితురాలు.. రాహుల్ జైన్ ఫ్లాట్ కు వెళ్లింది.
తనను ఇంటర్వ్యూ పేరుతో బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని తెలిపింది. తాను ప్రతిఘటించినప్పటికీ బలవంతంగా అత్యాచారం చేశాడని... సాక్ష్యాలను తొలగించాడని చెప్పింది. బాధితురాలి ఫిర్యాదుతో రాహుల్ జైన్ పై పోలీసులు సెక్షన్ 376, 323, 506 కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశామని పోలీసులు తెలిపారు. మరోవైపు ఆమె ఎవరో కూడా తనకు తెలియదని రాహుల్ జైన్ తెలిపాడు. గతంలో కూడా మరో మహిళ తనపై అత్యాచారం కేసు పెట్టిందని చెప్పాడు. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే, గత ఏడాది అక్టోబర్ లో ఓ మహిళ రాహుల్ జైన్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. తనపై అత్యాచారం చేసి, గర్భవతిని చేశాడని, ఆ తర్వాత బలవంతంగా అబార్షన్ చేయించాడని ఆరోపించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more