Revanth Reddy says apologises To MP Komatireddy Venkat Reddy కాంగ్రెస్ ఎంపీకి పిసీసీ అధ్యక్షుడు బేషరతు క్షమాపణలు

Revanth reddy apologises to komatireddy venkat reddy after abusive remarks at rally

Revanth Reddy, TPCC President, Komatireddy Venkat Reddy, Munugode Assembly constituency, Munugode public meeting, Addanki Dayakar, Congress, Komatireddy Venkat Reddy, Telangana Pradesh Congress Committee, Komatireddy Rajagopal Reddy, Telangana, Politics

Telangana state Congress chief A Revanth Reddy on Saturday apologised to party MP Komatireddy Venkat Reddy for abusive remarks against the latter. In a video message, the Telangana Pradesh Congress Committee (TPCC) president said that he is issuing an unconditional apology for the remarks made by Addanki Dayakar at a press conference and at a public meeting in Munugode Assembly constituency.

ITEMVIDEOS: కోమటిరెడ్డికి పిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బేషరతు క్షమాపణలు

Posted: 08/13/2022 12:37 PM IST
Revanth reddy apologises to komatireddy venkat reddy after abusive remarks at rally

తెలంగాణ కాంగ్రెస్ చండూరు సభ వేడి తగ్గడం లేదు. ఎంపీ కోమటిరెడ్డిపై అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో మొదలైన రగడ... రోజురోజుకూ ముదురుతుంది. ఈ కామెంట్స్ పై సీరియస్ గా ఉన్న కోమటిరెడ్డి... ఏకంగా పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు చేశారు. ఇక ఆయన ముఖం చూసేది లేదని కూడా చెప్పారు. బహిరంగ క్షమాపణ చెప్పటమే కాదు... సదరు నేతను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఎంపీ కోమటిరెడ్డి కామెంట్స్ పై రేవంత్ రెడ్డి స్పందించారు. బహిరంగ క్షమాపణ చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు.

'హోంగార్డు వ్యాఖ్యలతో పాటు మునుగోడు బహిరంగ సభలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్... మునుగోడు పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి పరుషమైన పద జాలం వాడటంతో వారంతో మనస్తాపానికి గురయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా సారీ చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపై కోమటిరెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెబుతున్నా. ఇలాంటి ర్యలు, ఇలాంటి భాష ఎవరికీ మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి, రాష్ట్రసాధనలో పాత్ర పోషించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇలా అవమానించే విధంగా ఎవరు మాట్లాడినా తగదని, తదుపరి చర్యల కోసం క్రమశిక్షణా సంఘం చైర్మన్ చెన్నారెడ్డికి రేవంత్ సూచిస్తున్నాను’’ అంటూ రేవంత్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే అద్దంకి దయాకర్‌ శనివారం మరోసారి ఎంపీ కోమటిరెడ్డికి క్షమాపణలు తెలిపారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. షోకాజ్ నోటీసులకు వివరణ ఇచ్చానని.. క్షమాపణ కూడా చెప్పినట్లు వెల్లడించారు. భవిష్యత్‌లో మరోసారి అలా జరగకుండా చూసుకుంటాననని అద్దంకి దయాకర్‌ ప్రకటించారు. మొత్తంగా అద్దంకి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ కామెంట్స్ ను ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కూడా తీవ్రంగా ఖండించారు. సొంత పార్టీ నేతలు కూడా అద్దంకి తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

అయితే రేవంత్ క్షమాపణలు చెప్పిన విషయం తనకు తెలియదని.. తాను వినలేదు.. చూడలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంటకర్ రెడ్డి అన్నారు. చుండూరు సభలో తనపై ఇష్టానుసారంగా నోరుపారుసుకున్న అద్దంకి దయాకర్ పై చర్యలు తీసుకోవాల్సిందేనని వెంకట్ రెడ్డి స్పష్టంచేశారు. రేవంత్‌ క్షమాపణ చెప్పిన విషయం తన దృష్టికి రాలేదని చెప్పిన ఆయన తాను రేవంత్ ట్వీట్ చేసిన వీడియోను చూడలేదని, వినలేదని తెలిపారు. తనపై వాడరాని పదం వాడిన వారిని సస్పెండ్‌ చేయాల్సిందేనని అద్దంకి దయాకర్‌ను ఉద్దేశించి అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌ చేస్తున్న పాదయాత్రలో పాల్గొనే ఆలోచన లేదని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles