Priyanka Gandhi Dragged Away By Cops From Protest ప్రధానికి ధరల పెరుగుదల, నిరుద్యోగం కనిపించదా.?: ప్రియాంక గాంధీ

Priyanka gandhi dragged away by cops from congress s price rise protest

Priyanka Gandhi Vadra dragged by delhi police, Priyanka Gandhi detained, congress march to rashtrapati bhawan, congress rashtrapati bhawan march, congress rashtrapati bhavan march, congress protest against price rise, congress inflation protest, price rise protest congress, congress pm house gherao, Congress, GST, Inflation, congress Protest, Rashtrapati bhawan, PM House, Rahul Gandhi, Priyanka Gandhi, Inflation protest, National Politics

Police detained Priyanka Gandhi Vadra and other Congress leaders dragging them into police vehicles from outside the party headquarters in Delhi today as they were protesting against unemployment and price-rise. Dressed in black like other party leaders as a mark of protest, Priyanka Gandhi had climbed over barricades to reach the spot. She held a brief sit-in before being forcibly taken away by cops.

దేశాన్నే దోచి మిత్రులకు పెడుతున్న ప్రధానికి.. ధరల పెరుగుదల కనిపించదా.? ప్రియాంక

Posted: 08/05/2022 07:44 PM IST
Priyanka gandhi dragged away by cops from congress s price rise protest

దేశ ఆస్తులను తన దోస్తులకు ప్రధాని మోదీ అమ్మేస్తున్నారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేయరా? అని ప్రశ్నించారు. ధరల పెరుగుదల, నిత్యవసర వస్తువులపై జీఎస్టీ పెంపు, నిరుద్యోగం వంటి సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం దేశ వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రపతి, ప్రధాని మోదీ నివాసాలకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపేందుకు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు ప్రయత్నించారు. అయితే పోలీసులు వీరిని అడ్డుకుని అరెస్ట్‌ చేశారు.

కాగా, పోలీస్ వాహనంలో కూర్చొన్న ప్రియాంక గాంధీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రతిపక్షాల గొంతును నొక్కేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ద్రవ్యోల్బణం గురించి కేంద్ర మంత్రులకు పట్టడం లేదని మండిపడ్డారు. వారికి అసలు ధరల పెరుగుదలే కనిపించకపోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. గ్యాస్ సిలిండర్ ధర అమాంతం పెరిగి.. గ్రామీణ ప్రజలు మళ్లీ కట్టెల పోయిలకు చేరువవుతున్నారని అమె అవేదన వ్యక్తం చేశారు. అందుకే ధరల పెరుగుదలను చూపించేందుకు ప్రధాని మోదీ నివాసం, రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీ తలపెట్టినట్లు తెలిపారు.


స్వతంత్ర భారతవని బానిస సంకెళ్లలను తుంచుకున్ననాటి నుంచి ఒక్కో రూపాయి పోగుచేసుకుని సంపాదించిన ఆస్తులన్నింటినీ తన మిత్రులైప పారిశ్రామికవేత్తలకు అమ్మేయడం ఎక్కడి దేశభక్తి అని ఆమె ఆరోపించారు. ఇదేనా దేశ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా భారత మాతకు మీరిచ్చే కానుక అని నిలదీశారు. దేశ జాతీయ ఆస్తులను తన సొంత ఆస్తులుగా మిత్రులకు కట్టబెట్టడంపై ఎందుకు ఈడీ సహా జాతీయ దర్యాప్తు సంస్థలు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ).. దీనిపై దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles