‘My pencil has become costly’: Class 1 girl’s letter to PM Modi వైరల్: జీఎస్టీ ప్రభావంపై ఒకటవ తరగతి విద్యార్థిని లేఖ

Pencil eraser maggi gone costlier class 1 student writes letter to pm modi on price rise

Narendra Modi, Price Hike, GST, Pencil, Maggi, Eraser, Class one Student, six-year-old girl, Inflation, Registered post, pencil costlier, costly pencil, rise price, inflation, education news, Kannauj district, UttarPradesh, Viral news

A six-year-old girl studying in class 1 has written a letter to Prime Minister Narendra Modi about the ‘hardship’ she is facing due to the price rise. The girl, Kriti Dubey, of Chhibramau town in Uttar Pradesh’s Kannauj district wrote in her letter, “My name is Kriti Dubey. I study in class 1. Modiji, you have caused an immense price rise. Even my pencil and rubber (eraser) have got costlier and the price of Maggi has been increased, too. Now my mother beats me for asking for a pencil. What shall I do? Other kids steal my pencil."

నెట్టింట్లో చిన్నారి లేఖ వైరల్: జీఎస్టీ ప్రభావంపై ఎదురైన అనుభవం.. ప్రధానికి లేఖ

Posted: 08/03/2022 12:11 PM IST
Pencil eraser maggi gone costlier class 1 student writes letter to pm modi on price rise

కాదేదీ కల్తీకి అనర్హం అన్న నానుడి ఇప్పుడు జీఎస్టీకి కూడా వ్యాపించింది. కాదేదీ జీఎస్టీకి అనర్హం అంటూ నెటిజనులు అన్ లైన్లో జోకులు పేలుస్తున్నారు. రైతు ఉత్పత్తులతో పాటు బిడ్డలకు అందించే పాలు, బెల్లం, బియ్యంపై కూడా జీఎస్టీ విధించడంతో ఈ బాదుడుపై దేశప్రజలను నుంచి తీవ్రఅసంతృప్తి వ్యక్వమవుతోంది. ఈ నేపథ్యంలో ఓ చిన్నారి తనకు వచ్చిన జీఎస్టీ కష్టాన్ని ఏకంగా ప్రధానితో మొరపెట్టుకుంది. అదెలా అంటే ప్రధాని మోడీ ఎక్కువగా చిన్నారులతో ప్రేమపూర్వకంగా మాట్లాడుతారని తెలుసుకున్న ఓ చిన్నారి తనకు ఎదురైన జీఎస్టీ కష్టంపై కూడా మొరాలకించాలని ఏకంగా ఓ లేఖను రాసింది.

జీఎస్టీ విధింపు కారణంగా తాను కనీసం పెన్సిల్‌, రబ్బర్‌ కూడా కొనలేకపోతున్నానని, అవి ఖరీదై పోయాయంటూ ఒకటవ తరగతి చదువుతున్న బాలిక ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. అయితే ఈ లేఖ ప్రధానికి చేరిందో లేదో తెలియదు కానీ.. నెట్టింట్లో మాత్రం ఈ లేఖ విపరీతంగా వైరల్ అయ్యింది. నెటిజనులు ఈ లేఖను షేర్లు చేయడంతో.. నిత్యం సోషల్ మీడియాలో ప్రధాని యాక్టివ్ గా ఉండే ప్రధాని దీనిపై దృష్టిసారిస్తారని కూడా నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు. ఇక కోందరు మాత్రం నిత్యవసర వస్తువులపై జీఎస్టీ స్లాబుల విధింపు ప్రధానికి తెలియకుండా జరిగే ప్రసక్తే లేదని కూడా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ ఈ చిన్నారి ఎవరు.? ఏ రాష్ట్రానికి చెందినది అంటే.. స్వయంగా ప్రధాని మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసీ పార్లమెంటరీ స్థానమున్న ఉత్తరప్రదేశ్‌కు చెందినదే. యూపీ కన్నౌజ్ జిల్లా చిబ్రమావుకు చెందిన ఆరేళ్ల కీర్తి దూబే 1వ తరగతి చదువుతున్నది. ఆమె పెన్సిల్‌, రబ్బర్‌ను క్లాస్‌లో చోరీ చేస్తున్నారు. దీంతో కొత్త పెన్సిల్‌ కొనమని తల్లిని అడుగుతుండగా ఆమె మందలిస్తుంది. ఇది పరిపాటిగా మారింది. కాగా, ఆదివారం ఆ చిన్నారీ, మ్యాగీ ప్యాకెట్‌ కొనేందుకు ఐదు రుపాయలతో షాప్‌కు వెళ్లింది. అయితే మ్యాగీ ప్యాకెట్‌ ధర ఏడు రూపాయలు పెరిగినట్లు షాప్‌ వ్యక్తి చెప్పాడు.

దీంతో ఆ పాప నిరాశతో ఇంటికి తిరిగి వచ్చింది. కొత్త పెన్సిల్‌ కోసం మరోసారి మారం చేయగా తల్లి మందలించింది. టేబుల్స్‌ రాయమని చెబుతుంది. దీంతో తనకు జీఎస్టీ పెంపు వల్ల కలిగిన భాధను ప్రధాని మోడీకి వివరించాలని అనుకుంది. ధరల పెరుగుదలపై తాను ఎదుర్కోన్న అనుభవాన్ని ఏకంగా ప్రధాని మోదీకి లేఖ ద్వారా తెలియజేసింది. ‘ప్రధానమంత్రీ జీ.. నా పేరు కీర్తి దూబే. నేను 1వ తరగతి చదువుతున్నాను. మీరు ధరలు విపరీతంగా పెంచారు. నా పెన్సిల్, ఎరేజర్ కూడా ఖరీదయ్యాయి. మ్యాగీ ధర కూడా పెరిగింది. నేను పెన్సిల్ అడిగితే మా అమ్మ కొట్టింది.

నేను ఏమి చేయాలి? ఇతర విద్యార్థులు నా పెన్సిల్‌ను దొంగిలించారు’ అని హిందీలో రాసింది. మరోవైపు న్యాయవాది అయిన బాలిక తండ్రి విశాల్ దూబే, ధరల పెరుగుదలపై పాప ఆవేదనను అర్థం చేసుకున్నారు. ప్రధాని మోదీకి తన కుమార్తె రాసిన లేఖను ప్రధాని కార్యాలయానికి రిజిస్టర్‌ పోస్ట్ చేశారు. దీంతో ఈ లేఖ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కాగా, ధరల పెరుగుదలపై విపక్షాలు పార్లమెంట్‌లో గళమెత్తుతూ.. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ప్రధాని మెదీకి ఆ చిన్నారి ఈ మేరకు లేఖ రాయడం మరింత ఇబ్బందికర పరిణామంగా తయారైంది. మరీ ఈ చిన్నారి లేఖపై ప్రధాని మోడీ స్పందిస్తారో లేదో వేచిచూడాలి.!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  Price Hike  GST  Pencil  Maggi  Eraser  Class one Student  Inflation  Registered post  UttarPradesh  Viral news  

Other Articles