On tandoori chicken row, Mahua Moitra says: 'Silly souls!' బీజేపి విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎంపీ మహువా మొయిత్రా

Tandoori chicken row mahua moitra reminds bjp of mahatma gandhi s real ideals

Mahua Moitra, mahua moitra trimanool mp, smriti irani, union minister, silly souls, tandoori chicken, non violence, Truth, Swaraj, Simplicity, Bulldozer raj, 15 lakhs promise, end of federalism, Rs 10 lakh suit, barrack obama, America President, mahatma gandhi statue, bjp, congress, parliament, national politics

Mahua Moitra renewed her criticism of the BJP on July 30 amid a dispute over the tandoori chicken that suspended MPs were enjoying while staging a protest in front of the Gandhi statue in the Parliament compound. The Trinamool Congress MP pleaded with the ruling party to put aside the chicken dish and consider the much greater harm being done to Mahatma Gandhi's ideals, which include non-violence, truth, swaraj, and simplicity.

బీజేపి విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎంపీ మహువా మొయిత్రా

Posted: 07/30/2022 01:41 PM IST
Tandoori chicken row mahua moitra reminds bjp of mahatma gandhi s real ideals

పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఉభయసభల్లో విపక్ష సభ్యులు ధరల పెరుగుదల తదితర అంశాలపై ఎలుగెత్తగా, 24 మంది సస్పెన్షన్ కు గురయ్యారు. అయితే, సస్పెన్షన్ ను నిరసిస్తూ విపక్ష ఎంపీలు పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అక్కడే భోజనం చేస్తూ, అక్కడే నిద్రిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. వారి బోజనం విషయం వచ్చేసరికి బీజేపి వివాదాస్పదం చేసింది. విపక్ష ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద తందూరీ చికెన్ తింటున్నారంటూ బీజేపీ మండిపడింది. అహింసావాది విగ్రహం వద్ద మాంసాహారం తినడం ఏంటని ప్రశ్నించింది.

దీనిపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా స్పందిస్తూ.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ సభ్యులు తందూరీ చికెన్ వివాదాన్ని పక్కనబెట్టి, గాంధీ మహాత్ముడి ఆశయాలకు కలుగుతున్న నష్టంపై దృష్టి సారించాలని హితవు పలికారు. అధికారపక్షం దీని గురించి ఆలోచిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. గాంధీ విగ్రహం వద్ద చికెన్ తింటే కలిగే నష్టం కంటే... అహింస, సత్యం, స్వావలంబన, నిరాడంబరత వంటి గాంధీ ప్రవచించిన ఆదర్శాలకు ప్రస్తుత పాలనలో మరింత ముప్పు ఏర్పడిందని అన్నారు. గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయంటూ యూపీలో బుల్డోజర్ తో కూల్చివేతల ఉదంతాలను ప్రస్తావించారు.

అహింస అంటూనే, యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ప్రసిద్ధికెక్కిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని మహువా మొయిత్రా విమర్శించారు. గాంధీ పేర్కొన్న సత్యాన్ని తుంగలో తొక్కుతూ.. 2014 ఎన్నికల వేళ ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామన్న హామీని విస్మరించారని ఆరోపించారు. స్వావలంబన అంశంపై స్పందిస్తూ, సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక నిరాడంబరత అంశంపై స్పందిస్తూ, ప్రధాని మోదీ ధరించిన రూ.10 లక్షల సూట్ అంశాన్ని ఎత్తిచూపారు. గాంధీ సిద్ధాంతాలకు ఇంత హాని జరుగుతుంటే బీజేపీ ఎంపీలు తందూరీ చికెన్ వివాదాన్ని రేకెత్తిస్తున్నారని మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles