Heavy rains in Hyderabad inundates low-lying areas హైదరాబాద్ పై వరుణుడి ప్రతాపం: మరో మూడు రోజులు భారీ వర్షాలు..!

Heavy rain lashes hyderabad nearly 100 mm rainfall recorded in just 2 hours

heavy rain in hyderabad, hyderabad rains news, hyderabad rains today, hyderabad rains latest news, disaster response force, ghmc, hyderabad, rainfall, GHMC, Low lying area, Hyderabad rains, telangana rains, Telangana

The city was pounded by nearly 100 mm rainfall in a span of merely about two hours on Monday night. According to the Telangana State Development Planning Society figures, Hayathnagar recorded the highest rainfall of 98.5 mm followed by 89.8 mm at Amberpet and 88.0 mm at Saidabad. Many other areas such as Bahadurpura, Charminar, Himayatnagar, and Nampally recorded over 80 mm rainfall in a matter of a few hours. The heavy rain was accompanied by thunder and lightning.

హైదరాబాద్ పై వరుణుడి ప్రతాపం: మరో మూడు రోజులు భారీ వర్షాలు..!

Posted: 07/26/2022 11:59 AM IST
Heavy rain lashes hyderabad nearly 100 mm rainfall recorded in just 2 hours

హైదరాబాద్ నగరవాసులపై వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపాడు. గత మూడువారాలుగా నగరంపై కనికరం చూపని వరుణుడు ప్రతి రోజు నగరంపై తన ప్రభావాన్ని చూపుతూనే ఉన్నాడు. తాజాగా సోమవారం అర్థరాత్రి నుంచి మళ్లీ కుండపోత వర్షంతో నగరంలోని అనేక ప్రాంతాలు జలమయం చేసింది. రోడ్లు నీటిమునిగి చెరువులను తలపించాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి కూడా నీళ్లు చేరిపోయాయి. నగరంలోని పలుప్రాంతాల్లో వర్షం ఏకంగా బీభత్సాన్ని తలపించింది. నగరవ్యాప్తంగా కుండపోతగా కురిసిన వర్షం.. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులుగా, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇవాళ ఉదయం నుంచి కూడా చిరుజల్లులు పడుతుంటడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బంజారాహిల్స్, నాంపల్లి, ఖైరతాబాద్, పాతబస్తీ, కోఠి, అబిడ్స్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ముషీరాబాద్, కాప్రా, బేగంబజార్, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్​బాగ్, లక్డీకపూల్, చార్మినార్‌, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, బార్కస్‌, చాంద్రయాణగుట్ట, సైదాబాద్‌, నారాయణగూడ, హిమాయత్​నగర్​ తదితల ప్రాంతాలలో అర్థరాత్రి వేళ వర్షం తీవ్ర ప్రభావాన్ని చాటింది. ఏకధాటిగా కురుసిన వర్షానికి వరద నీరు రహదారులపైకి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ప్రధాన మార్గాల్లోనూ ఇదే పరిస్థితి తలెత్తడంతో అనేకప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. కోఠిలో దుకాణాలలోకి నీరు చేరి.. వ్యాపారులకు నష్టాన్ని మిగిల్చింది.

ఖైరతాబాద్‌, అమీర్‌పేట్‌, నాంపల్లి, అంబర్‌పేట్‌, ఎస్సార్​నగర్​, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, సోమాజిగూడ తదితర ప్రాంతాల్లోనూ వర్షం పడింది. కోఠిలో వరద నీటిలో ఓ మోటారు బైక్ కొట్టుకుపోగా, మలక్‌పేట వంతెన దిగువన నడుము లోతులో నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. ఎల్బీనగర్ పరిధిలోని చింతల్‌కుంట జాతీయ రహదారిపైనా మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది. వర్షాలకు మూసారాంబాగ్‌ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించింది. మూసారాంబాగ్‌ నుంచి గోల్నాక వైపు రాకపోకలు నిలిచిపోయాయి.  వర్షానికి పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. వరద నీటిని మళ్లించేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది శ్రమిస్తున్నారు.

రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు

ఇప్పటికే వరుణుడి అపారకరుణతో తెలంగాణలోని జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తుండగా, భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం మాత్రం మరో పిడుగులాంటి వార్తను వెలువరించింది. రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లలు నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles