Presidential Election 2022: Droupadi Murmu, Yashwant Sinha's Face Off కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నిక.. ముర్ముకే గెలుపు అవకాశాలు

Presidential polls 2022 pm modi former pm manmohan singh others cast their votes

Droupadi Murmu, Yashwant Sinha, Presidential polls,​ Presidential Election, Presidential Polls 2022, Draupadi Murmu News, Yashwant Sinha News, NDA, BJP, Congress, UPA, Draupadi Murmu Latest News, President of India, Presidential Election Today, Presidential Polls, Electoral collageum, National Politics

Elections to choose the 15th President of India are being held today a race between NDA candidate Droupadi Murmu and the opposition's Yashwant Sinha. The counting of votes will be held on July 21 and the new President will take oath on July 25, under the schedule announced by the Election Commission.

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నిక.. ముర్ముకే గెలుపు అవకాశాలు

Posted: 07/18/2022 01:12 PM IST
Presidential polls 2022 pm modi former pm manmohan singh others cast their votes

దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఎన్నికలను ఇవాళ నిర్వహిస్తున్నారు. ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఎక్కువమంది ఎలక్టోరల్ కాలేజీలో సభ్యుల మద్దతు ముర్ముకే ఉండడంతో ఆమె గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఆమె విజయం సాధిస్తే రాష్ట్రపతి పీఠంపై కూర్చున్న తొలి గిరిజన మహిళగా రికార్డులకెక్కుతారు.  ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరుగనుంది. పార్లమెంటుతోపాటు ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటింగ్ నిర్వహిస్తారు.

పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులతో పాటు అసెంబ్లీలలోని శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారు. వీరు మాత్రమే రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు హక్కు కలిగి ఉంటారు. వీరి ఓట్లు ప్రాధాన్యతా క్రమంలో లెక్కింపబడతాయి. పార్లమెంటులో లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. కాగా, ఈసారి 9 మంది ఎమ్మెల్యేలు పార్లమెంటులో, 44 మంది ఎంపీలు ఆయా రాష్ట్రాల శాసనసభల్లో ఓటు వేయనున్నారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం తెలిపింది.

తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 21 మంది లోక్‌సభ సభ్యులు, 13మంది రాజ్యసభ సభ్యులు కోల్‌కతాలోని శాసనసభలో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. కాగా ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన పరిమళ్ నత్వానీ గాంధీనగర్‌లోని గుజరాత్ అసెంబ్లీలో ఓటుహక్కు వినియోగించుకొనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో బ్యాలెట్‌ను ఉపయోగిస్తున్నారు. ఎలక్టోరల్ కాలేజీలో 10.81 లక్షల ఓట్లు ఉండగా, మెజారిటీ పార్టీలన్నీ ముర్ముకే మద్దతు ప్రకటించిన నేపథ్యంలో 6.66 లక్షల ఓట్లు ముర్ముకు దక్కే అవకాశం ఉందని అంచనా. ఈ నెల 21న ఓట్లను లెక్కించి అదే రోజు రాత్రి ఫలితాన్ని వెల్లడిస్తారు. 25న నూతన రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles