Accused in jail for 4 years as SI ignores 45 court summons ఎస్ఐ నిర్లక్ష్యంపై ఐఏఎస్ కు నోటీసు.. హాజరుకాకపోవడంతో కోర్టు అసంతృప్తి

Accused in jail for 4 years in chhattisgarh as si ignores 45 summons for court statement

Sub Inspector, Chetan Singh Chandrakar, arrest warrant, undertrial prisoner, Devendra Singh, drugs case, Court notices to four IPS, Justice Sachin Singh Rajput, chhattisgarh high court, High Court, surguja, ips, bilaspur, chhattisgarh, Crime news

A youth is in jail for 4 years due to the lack of a sub-inspector's testimony. He has now filed a petition in the High Court in this matter. It was told that so far 45 summons and warrants have been issued to the sub-inspector, but he did not come to court. In this entire matter, the High Court had issued notice to four IPS. Out of this, three SPs posted in Surguja appeared in the High Court.

ఎస్ఐ నిర్లక్ష్యంపై ఐఏఎస్ కు నోటీసు.. హాజరుకాకపోవడంతో కోర్టు అసంతృప్తి

Posted: 07/16/2022 01:41 PM IST
Accused in jail for 4 years in chhattisgarh as si ignores 45 summons for court statement

ఏదేని అభియోగాలపై న్యాయస్థానంలో జ్యుడీషియల్ రిమాండ్ అనుభవిస్తున్న అండర్ ట్రయల్ నిందితుడు.. బెయిల్ పై బయటకు రావాలంటే.. తప్పక న్యాయస్థానంలో దర్యాప్తు అధికారి తప్పక కోర్టులో తన వాంగ్మూలాన్ని అందించాల్సి ఉంది. అయితే ఓ విచారణ అధికారి మాత్రం నాలుగేళ్లుగా తన వాంగ్మూలాన్ని అందించకుండా ఓ నిందితుడ్ని ఏకంగా నాలుగేళ్లుగా బయటకు రాకుండా అడ్డుకోగలిగాడు. ఇలా వ్యవహరించి తన వాంగ్మూలం ఇవ్వకపోవడం కారణంగా న్యాయస్థానం అతడ్ని కోర్టుకు రమ్మని ఏకంగా 45 సమన్లు జారీ చేసింది. అంతేకాదు చివరకు అరెస్ట్‌ వారెంట్‌ కూడా జారీ చేసినా ఆయన స్పందించలేదు.

వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజాలో ఈ సంఘటన జరిగింది. 2018 జూలై 23న డ్రగ్స్‌ అమ్ముతున్న దేవేంద్ర సింగ్‌ను సర్గుజా పోలీసులు అరెస్ట్‌ చేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు అతడు జైలులోనే ఉన్నాడు. నిందితుడి బెయిల్‌ పిటిషన్లను కింది కోర్టుతోపాటు హైకోర్టు తిరస్కరించాయి. మరోవైపు దేవేంద్ర సింగ్‌ను డ్రగ్స్‌ కేసులో అరెస్ట్ ‌చేసిన ఎస్‌ఐ చేతన్ సింగ్ చంద్రకర్ ఇప్పటి వరకు కోర్టుకు హాజరై స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదు. దీని కోసం కోర్టు ఆయనకు 45 సార్లు సమన్లు జారీ చేసింది. చివరకు అరెస్ట్‌ వారెంట్‌ కూడా ఇచ్చింది. అయినప్పటికీ ఆయన స్పందించలేదు. దీంతో ట్రయిల్ ‌కోర్టులో విచారణ జరుగకపోవడంతో నిందితుడు బెయిల్ ‌పొందలేక నాలుగేళ్లుగా జైలులోనే ఉన్నాడు.

ఈ నేపథ్యంలో నిందితుడు దేవేంద్ర సింగ్‌ ఈ అంశంపై తాజాగా హైకోర్టును ఆశ్రయించాడు. 45 సార్లు సమన్లు, అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసినప్పటికీ స్టేట్‌మెంట్‌ ఇచ్చేందుకు ఎస్‌ఐ చేతన్ సింగ్ ట్రయిల్‌ కోర్టుకు రాలేదని, దీంతో తాను బెయిల్‌ పొందలేక నాలుగేళ్లుగా జైలులోనే ఉంటున్నట్లు ఆరోపించాడు. దీంతో హైకోర్టు నలుగురు ఐపీఎస్‌లకు నోటీసులు జారీ చేసింది. ఇందులో ముగ్గురు హైకోర్టుకు హాజరుకాగా, మరొకరు రాలేదు. దీంతో ఈ అంశంపై హైకోర్టు న్యాయమూర్తి సచిన్ సింగ్ రాజ్‌పుత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ పోలీస్‌ అధికారి నుంచి వివరణ కోరారు. కేసు విచారణను ఈ నెల 22కు వాయిదా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles