నిత్యావసర సరుకులు ఓ వైపు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు గ్యాస్ ధరలు కూడా అంతకంతకూ అందకుండా పోతున్నాయి.. దేశంలో మధ్యతరగతి వారు రెండు పూటలా తినాలంటే కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక కాసింత ఉన్నత మధ్యతరగతి కుటుంబాల్లో వారాంతంలోనో, లేక మాసంలో ఒకసారి కుటుంబంతో కలిసి సరదాగా రెస్టారెంట్‌కు వెళితే పెరిగిన ధరలతో జేబు గుల్ల కావడం గ్యారంటీ. ఓ వైపు బిల్లు రాగానే మనకు వడ్డించిన వస్తువులు ఏన్ని దేనికెంత ధర వేశారో చూసుకున్న తరువాత.. జీఎస్టీ ఎంత వేశారు.. సర్వీసు చార్జీల పేరుతో ఎంత అదనంగా వడ్డించారు అన్నది తప్పక చూసుకోవాల్సి వస్తుంది.
ఈ సర్వీసు చార్జీల నేపథ్యంలోనే చాలావరకు ఇళ్లలోనే కూర్చోని స్విగ్గీ, జోమాటో సర్వీసులను వినియోగించుకున్నారు సగటు మధ్య తరగతివాసులు. అంతలా సర్వీసు చార్జీలు బాదుడు వినియోగదారులను కుంగదీస్తోంది. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హోటళ్లు, రెస్టారెంట్లు సర్వీస్ చార్జీని వసూలు చేయరాదని వినియోగదారుల వ్యవహారాల శాఖకు చెందిన సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఆదేశించింది. ఫుడ్ బిల్లులపై ఆటోమేటిక్‌గా లేదా డిఫాల్ట్‌గా సర్వీసు చార్జీలను వసూలు చేయవద్దని హోటళ్లు, రెస్టారెంట్లకు స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన హోటళ్లు, రెస్టారెంట్లపై వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చని సీసీపీఏ పేర్కొంది.
ఎలాంటి ఇతర పేర్లతో సర్వీసు చార్జీని వసూలు చేయరాదని తేల్చిచెప్పింది. సర్వీస్ చార్జి చెల్లించాలని ఏ హోటల్, రెస్టారెంట్ వినియోగదారులపై ఒత్తిడి తీసుకురాకూడదని ఆదేశించింది. వినియోగదారుడు స్వచ్ఛందంగా సర్వీస్ చార్జీ చెల్లించవచ్చని దీనిపై ఎలాంటి బలవంతం ఉండదని వినియోగదారులకు హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు తెలియచేయాలని కోరింది. ఈ మేరకు ఇదివరకే దేశ న్యాయస్థానాలు తీర్పును వెలువరిచాయని పేర్కోంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఈ మేరకు గతంలో అదేశాలసు జారీ చేసిన విషయాన్ని సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ గుర్తుచేసింది.
ఫుడ్ బిల్లుతో పాటు సర్వీస్ చార్జిని కలిపి మొత్తం బిల్లుపై జీఎస్టీ విధించడం అనుమతించబోమని తెలిపింది. సర్వీస్ చార్జిని బిల్లులో కలిపి ఆ మొత్తంపై జీఎస్టీ విధిస్తే సర్వీస్ చార్జిని తొలగించాలని వినియోగదారులు ఆయా హోటళ్లు, రెస్టారెంట్లను కోరవచ్చని పేర్కొంది. సమస్య పరిష్కారం కాకుంటే వినియోగదారులు 1915 నెంబర్‌పై నేషనల్ కన్జూమర్ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ఎన్సీహెచ్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది. ఇక అలాగని తినే ఆహార పదార్థాలపై హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు ధరలను పెంచితాయన్న అనుమానాలను కూడా వినియోగదారులు వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 13 | తన బిడ్డ అపదలో ఉన్నాడంటే ప్రతీ తల్లి గజేంద్రమోక్ష ఘట్టంలోని శ్రీమహావిష్ణువు రూపం దాల్చి అత్యంత వేగంగా ప్రతిస్పందించి రక్షిస్తుందని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తుందంటే అవసరమైతే పులితో కూడా పోట్లాడి.. తన... Read more
Aug 13 | బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పోందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రియాంఖ ఖార్గే... Read more
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more