Maharashtra: Congress 'ED Sarkar' jibe after Eknath Shinde take oath ఔను మాది ఈడీ ప్రభుత్వమే: సమర్థించుకున్న ఫడ్నావిస్

Yes it s an ed government devendra fadnavis responds to ed sarkar jibe in assembly

Eknath Shinde, Devendra Fadnavis, Congress, ED sarkar jibe, Sharad Pawar, Shiv Sena, Uddhav Thackeray, Vidhan Parishad, IT Notices, Love letter from IT Dept, Maharashtra Political Crisis, Maharashtra Government Formation, Maharashtra Election, Maharashtra MLA, Maharashtra MLC Election 2022, Maharashtra Vidhan Parishad, Sanjay Raut, Vidhan Parishad Election, Vidhan Parishad Election Maharashtra, Vidhan Parishad Election Maharashtra 2022, Ajit Pawar, BJP, Maharashtra Politics

Maharashtra's new Deputy Chief Minister Devendra Fadnavis countered the opposition's charge that the Enforcement Directorate (ED) was misused by the Bharatiya Janata Party (BJP) to effect the change in government in the state. Responding to the criticism, Fadnavis inside the Assembly said, "People taunt that it's an ED government. Yes, it's an ED government, the government of Eknath-Devendra".

"ఔను మాది ఈడీ ప్రభుత్వమే" కొత్త అర్థంతో సమర్థించుకున్న ఫడ్నావిస్

Posted: 07/04/2022 03:58 PM IST
Yes it s an ed government devendra fadnavis responds to ed sarkar jibe in assembly

మహారాష్ట్రలో కొలువుదీరిన కొత్త సర్కార్ తమపై వస్తున్న అరోపణలను సమర్థించుకుంది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ నేతలపై ఎన్ ఫోర్స్ మెంట్ (ఈడీ) దాడులను నిరసిస్తూ.. అసెంబ్లీలో విపక్ష సభ్యులు ‘ఈడీ.. ఈడీ..’ అంటూ నినాదాలు చేయడంపై.. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దీటుగా స్పందించారు. “ప్రతిపక్షాలు మాది ఈడీ ప్రభుత్వం అని నినాదాలు చేస్తున్నాయి. అవును.. మాది ఈడీ గవర్నమెంటే. ఈడీ అంటే ఏక్ నాథ్, దేవేంద్ర ఫడ్నవీస్..” అని ఆయన కొత్త అర్థం చెప్పడంతో పాటు తమది ఈడీ ప్రభుత్వమని సమర్థించుకున్నారు.

ఏక్ నాథ్ షిండే కూటమితో కలిసి తాము మరోసారి శివసేన–బీజేపీ సర్కారును ఏర్పాటు చేశామని దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. పార్టీ ఆదేశాల మేరకే తాను ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నానని చెప్పారు. పార్టీ తనను ఇంట్లో కూర్చొమ్మంటే కూర్చునే వాడినని అన్నారు. ఈ ప్రభుత్వంలో అధికారం కోసం గొడవలు ఏమీ ఉండబోవని, తాము పూర్తిగా సహకరిస్తామని ఫడ్నవీస్ తెలిపారు. కాగా, శివసేనకు చెందిన ఎమ్మెల్యే సంతోష్ బంగర్ కూడా చివరి నిమిషంలో గోడ దూకారు. ఇవాళ్టి ఉదయం వరకు థాక్రే వర్గంలో ఉన్న ఆయన బలపరీక్షకు మాత్రం షిండే వర్గంతో పాటు అసెంబ్లీకి వచ్చారు.

ఇవాళ అసెంబ్లీ సాక్షిగా శివసేన అధినేత ఉద్దవ్ థాక్రేకు షాకిచ్చింది. ఇప్పటికే షిండే, ఫడ్నావిస్ లు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులుగా న మహా స్పీకర్​.. ఏక్‌నాథ్ శిందే ప్రభుత్వ బలపరీక్షకు ముందు మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు షాకిచ్చారు మహా అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్. ప్రస్తుతం శివసేన శాసనసభా పక్షనేతగా ఉన్న అజయ్ చౌదరిని తొలగించి, శిందేను తిరిగి స్పీకర్​ నియమించారు. శివసేన చీఫ్​ విప్​గా ఉన్న ఠాక్రే వర్గానికి చెందిన సునీల్​ ప్రభును తొలగించి.. భరత్​ గోగావలేను నియమించారు. అయితే, ఈ నిర్ణయంపై ఠాక్రే వర్గం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ పిటిషన్​పై​ జులై 11న విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసం తెలిపింది.

మహారాష్ట్రలో త్వరలోనే మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్​ అన్నారు. మరో ఆరునెలల్లో శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. షిండేకు మద్దతు ఇస్తున్న నేతలు ఎవరూ సంతోషంగా లేరు. మంత్రివర్గ విస్తరణ సమయంలో మనస్పర్థలు వస్తాయి. అప్పుడు కచ్చితంగా షిండే ప్రభుత్వం పతనం అవుతుంది. ఆ తర్వాత తిరుగుబాటు ఎమ్మెల్యేలు మళ్లీ మా దగ్గరికే వస్తారు" అని పవార్‌ తెలిపారు. కేవలం ఆరు నెలలే సమయం ఉందని, ఎన్సీపీ శాసనసభ్యులు తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువ సమయం గడపాలని ఆయన సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles