Sharad Pawar says 'received love letter from IT dept' ‘‘ప్రేమలేఖలు అందాయి’’: ఐటీ నోటీసులపై శరద్ పవార్ ట్వీట్.!

Received love letter sharad pawar s swipe at centre on tax notice

Sharad Pawar, Shiv Sena, Uddhav Thackeray, Vidhan Parishad, IT Notices, Love letter from IT Dept, Eknath Shinde, Devendra Fadnavis, Maharashtra Political Crisis, Maharashtra Government Formation, Maharashtra Election, Maharashtra MLA, Maharashtra MLC Election 2022, Maharashtra Vidhan Parishad, MLC Election, Sanjay Raut, Vidhan Parishad Election, Vidhan Parishad Election Maharashtra, Vidhan Parishad Election Maharashtra 2022, Ajit Pawar, BJP, Maharashtra Politics

The Income Tax department has sent a notice to Nationalist Congress Party (NCP) chief Sharad Pawar in connection with poll affidavits filed by him in 2004, 2009, 2014, and 2020. This comes a day after the Maha Vikas Aghadi coalition, comprising the NCP, Congress and Shiv Sena, was edged out of power in Maharashtra by rebel Sena leader Eknath Shinde, with backing from the BJP.

‘‘ప్రేమలేఖలు అందాయి’’: ఐటీ నోటీసులపై శరద్ పవార్ ట్వీట్.!

Posted: 07/01/2022 12:41 PM IST
Received love letter sharad pawar s swipe at centre on tax notice

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఎట్టకేలకు ముగిసి.. శివసేన రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్ న్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నావిస్ ఢిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఈ తరుణంలో.. ప్రజలకు ప్రభుత్వ సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయని అంతా ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ కు కేంద్రప్రభుత్వం షాక్ ఇచ్చింది. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన రెబెల్స్ నేత ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణం చేసిన మరుసటి రోజే శరద్ పవార్ కు తొలి షాక్ తగిలింది.

శివసేన అధినేత ఉద్దవ్ థాకరే ప్రభుత్వానికి మద్దుతునిచ్చిన ఆయనపై మహారాష్ట్రలో తమ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ఐటీ శాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని శరద్ పవార్ ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. తనకు ఆదాయపన్ను శాఖ నుంచి ప్రేమలేఖలు అందాయని ఆయన వ్యంగంగా ట్వీట్ చేశారు. 2004, 2009, 2014, 2020లలో జరిగిన ఎన్నికల్లో తాను సమర్పించిన అఫిడవిట్లకు సంబంధించి ఐటీ శాఖ నుంచి తనకు ప్రేమలేఖ అందిందని చెప్పారు. కొందరు వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారని... రాజకీయ కుట్రల్లో భాగంగానే ఇది జరుగుతోందని అన్నారు.

ఐటీ నోటీసులకు తాను భయపడనని... అఫిడవిట్లకు సంబంధించిన సమాచారమంతా తన వద్ద ఉందని చెప్పారు. హిందుత్వ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్, ఎన్సీపీలతో ఉద్ధవ్ థాకరే చేతులు కలిపారంటూ ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలపై పవార్ స్పందిస్తూ... హిందుత్వ సిద్ధాంతం కోసం షిండే తిరుగుబాటు చేయలేదని... అధికారం కోసం ఆ పని చేశారని విమర్శించారు. మరోవైపు, శివసేనకు చెందిన 39 మంది ఎమ్మెల్యేలు షిండేతో పాటు బయటకు వచ్చేశారు. దీంతో, తన సొంత పార్టీ (శివసేన)లో ఉద్ధవ్ థాకరే మైనార్టీగా మిగిలిపోయారు. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చని చెప్పడానికి ఇది మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles