మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్‌నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి మహరాష్ట్ర రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ.. ఏక్ నాథ్ షిండేతో ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నావిస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. కాగా రేపు మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేస్తుందని సమాచారం. అయితే షిండే ప్రభుత్వానికి తాము బయటి నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించిన ఫడ్నావిస్ మధ్యాహ్నానికి సాయంత్రానికి మాట మార్చాడం గమనార్హం.
మధ్యాహ్నం దేవేంద్ర ఫడ్నావిస్ ప్రకటన తరువాత ఢిల్లీ నుంచి బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దేవేంద్ర ఫడ్నావిస్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ రాత్రి జరిగిన ప్రమాణస్వీకారోత్సవంలో ఢిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. షిండే ప్రభుత్వంలో భాగం కాబోమని చెప్పిన ఆయన తన మాటను తోసిరాజుతూ భాగంగా మారారు. మొత్తానికి మహారాష్ట్రలోనూ బీహార్ మార్కు రాజకీయానికి బీజేపి తెరతీసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీహార్ లోనూ నితీష్ జేడీ(యూ) పార్టీకి ఉన్న 45 మంది ఎమ్మెల్యేలకు 77 మంది సభ్యుల బలం ఉన్న బీజేపి మద్దతిచ్చిన విషయం తెలిసిందే.ః
ఇది ఏక్‌నాథ్ షిండే ప్రస్థానం.. అటో డ్రైవర్ నుంచి కెరీర్ ప్రారంభం..
ఆటో డ్రైవర్‌గా జీవితం ప్రారంభించిన ఆయనకు కాలం, అదృష్టం కలిసి రావడంతో ఏకంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. 1964 ఫిబ్రవరి 9న మహారాష్ట్రలోని సతారాలో జన్మించిన షిండే, మరాఠా సమాజానికి చెందినవారు. ఆయన కుటుంబం జీవనోపాధి కోసం థానేకు మారింది. దీంతో ఏకనాథ్ షిండే 11వ తరగతి వరకు థానేలోని మంగళ హై స్కూల్, జూనియర్ కాలేజీలో చదివారు. అనంతరం జీవనోపాధి కోసం కూలీ పనులు చేశారు. కుటుంబాన్ని పోషించుకోవడానికి థానేలో ఆటో నడిపారు.
కాగా, స్కూల్ స్థాయి నుంచే శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాలకు షిండే ప్రభావితమయ్యారు. అనంతరం ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1980 ఆరంభంలో నాటి థానే శివసేన అధ్యక్షుడు ఆనంద్ దిఘేను పరిచయం చేసుకున్నారు. ఆయన మద్దతుతో శివ సైనికుడిగా ఆ పార్టీలో చేరారు. 1980లో వాగ్లే ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో కార్మిక నాయకుడిగా వృత్తిని ప్రారంభించారు. శివసేన ఆందోళనల్లో ముందుండే ముందుండే ఆయన, బెల్గావిపై మహారాష్ట్ర-కర్ణాటక మధ్య ఆందోళనల సమయంలో అరెస్టై 40 రోజుల పాటు జైలులో ఉన్నారు.
1997లో తొలి రాజకీయ పీఠాన్ని షిండే అధిరోహించారు. థానే మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. అనంతరం 2004లో కోప్రి పంచపఖాడి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్థానం నుంచి వరుసగా నాలుగోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రజా సమస్యల పట్ల దూకుడుగా వ్యవహరించే వ్యక్తిగా పేరుగాంచిన షిండే శివసేనలో కీలకంగా ఎదిగారు. ముంబైకి ఆనుకుని ఉన్న థానే-పాల్ఘర్ ప్రాంతంలో కీలకమైన సేన నాయకుడిగా రాణించారు. బాలాసాహెబ్‌కు గట్టి మద్దతుదారుగా, ఆయన అనుచరుడిగా, శివసేన వ్యవస్థాపకుడి సిద్ధాంతాల ఉద్రేకంతో నడిచే సైనికుడిగా తనను తాను నిరూపించుకున్నారు.
ఆయన రాజకీయ గురువు ఆనంద్ డిఘే, 2001లో షిండేను థానే మున్సిపల్ కార్పొరేషన్ సభా నాయకుడిగా ఎన్నుకున్నారు. ఈ మలుపు ఆయన స్థావరమైన థానే జిల్లాను ఏకీకృతం చేయడంలో దోహదపడింది. ఆపై షిండే వెనక్కి తిరిగి చూసుకోలేదు. శివసేనలో సీనియర్‌గా, కీలక నేతగా, అసెంబ్లీలో శాసనసభాపక్ష నేతగా, చివరకు ఆ పార్టీని చీల్చే రెబల్ నాయకుడిగా ఎదిగిన ఆయన అనంతర పరిణామాలతో ఏకంగా మహారాష్ట్రకు సీఎం అయ్యారు. ఆయన ఒక్కగానొక్క కుమారుడు శ్రీకాంత్ ఆర్థోపెడిక్ సర్జన్. కళ్యాణ్ నుంచి రెండవసారి ఎంపీగా ఉన్నారు. కాగా, శివసేనలో అట్టడుగు స్థాయి నుంచి సీఎం పీఠాన్ని అధిరోహించిన ఏక్‌నాథ్ షిండే ఆ పదవిలో ఎంత కాలం కొనసాగుతారు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం వ్యతిరేకతను తట్టుకుని ఎలా నిలబడతారు అన్నది ప్రశ్నగా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more
Aug 13 | తెలంగాణ కాంగ్రెస్ చండూరు సభ వేడి తగ్గడం లేదు. ఎంపీ కోమటిరెడ్డిపై అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో మొదలైన రగడ... రోజురోజుకూ ముదురుతుంది. ఈ కామెంట్స్ పై సీరియస్ గా ఉన్న కోమటిరెడ్డి...... Read more
Aug 12 | ఉచిత తాయిలాలు వద్దన్న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణపై రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) అధినేత జయంత్ చౌదరి విమర్శలు గుప్పించారు. ముందుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాను పొందుతున్న ఉచితాలేంటో... Read more