కరోనా మహమ్మారి తరువాత దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలు వచ్చాయని, వాటికనుగూణంగా తమకు కూడా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆకస్మిక సమ్మెకు దిగిన సినీకార్మికులకు టాలీవుడ్ నిర్మాతల మండలి నుంచి స్పష్టమైన హామీ లభించింది. ఇక తెలంగాణ ప్రభుత్వం తరపున సినమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా చోరవ చూపి.. అటు నిర్మాతల మండలి, ఇటు సినీకార్మికుల సంఘాల నేతలతో చర్చలు జరిపారు. ఆయన కృషి ఫలితంగా రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా సినిమా షూటింగులు షూరూ కానున్నాయి.
సినీకార్మకుల మెరుపు సమ్మె ఎక్కడికి దారి తీస్తుందోనని అందోళన చెందిన సగటు సినీఅభిమానికి చక్కని శుభవార్త వినిపించింది. తెలుగు సినీమా ఫెడరేషన్ కార్యాలయాన్ని ది్గ్భంధించిన కార్మికులు.. తాము అర్థాకలితో అలమటిస్తున్నామని, తమ ఆకలి గోడును నాలుగేళ్లుగా నిర్మాతల మండలి దృష్టికి తీసుకువస్తున్నా.. పట్టించుకోలేదని అన్నారు. దీంతో తాము గత్యంతర లేని తరుణంలోనే పక్షం రోజుల ముందు నోటీసు ఇచ్చి సమ్మెకు పూనుకున్నామని వారు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక ఒక్కరోజుతో ఈ సమస్య ముగుస్తుందని భావించగా, రెండో రోజు కూడా కొనసాగడంతో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చోరవ చూపారు.
ఓ వైపు సినీ ఇండస్ట్రీలో అన్ని విభాగాల కార్మికులు ఆందోళనలో పాల్గొంటున్న నేపథ్యంలో టాలీవుడ్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న 28 సినిమాల షూటింగులు నిలిచిపోయాయి. దీంతో ఈ సినిమాలపై సమ్మె ప్రభావం తీవ్రంగా పడనుంది. ఇప్పటికే మూడు రోజులు గడుస్తున్న తరుణంలో మరెన్ని రోజులు సమ్మె జరుగుతుందో తెలియకపోవడంతో నిర్మాతలు ఆందోళనలో ఉన్నారు. అసలే కరోనా మహమ్మారి ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన సినీ ఇండస్ట్రీ.. కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. కాగా,కార్మికుల వేతనాలను పెంచడంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని నిర్మాతల మండలి ప్రకటించింది.
ఈ క్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. అటు నిర్మాతల మండలితో ఇటు కార్మిక సంఘాల నేతలు చర్చలు జరిపారు. సినీ కార్మికుల సమస్యలు, వేతనాల పెంపుపై సుమారు 2 గంటల పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా దిల్ రాజు అధ్యక్షతన సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు నిర్మాతల మండలి ప్రకటించింది. రేపు సమన్వయ కమిటీతో చర్చించి వేతనాలపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. దీంతో, సమ్మెను విరమిస్తున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ నేతలు ప్రకటించారు. రేపటి నుంచి కార్మికులంతా యథావిధిగా షూటింగుల్లో పాల్గొంటారని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more