అగ్నివీరులుగా బయటకు వచ్చిన తరువాత వారికి మంచి అవకాశాలు ఉంటాయని ఇటీవల అగ్నపాత్ పథకాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేసిన నలుగురు పారిశ్రామిక వేత్తలకు విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇక అగ్నివీరులకు తాను ఉద్యోగాలిస్తానంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఇటీవల చేసిన ట్వీట్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఓ వైపు ఆశావహులు, మరోవైపు యువత, నెటిజనులు, సోషల్ మీడియా నుంచి తీవ్ర విమర్శలను చవిచూశారు.
ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని స్వాగతించిన పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చే అగ్నివీరులకు తమ సంస్థలో ఉద్యోగాలిస్తామని చేసిన ట్వీట్ పై కూడా మండిపడుతున్నారు. ఇక తాజాగా పలువురు మాజీ సైనికాధికారులు కూడా ఆనంద్ మహీంద్రా ట్వీట్ పై తీవ్రంగా స్పందించారు. వీరిలో భారత నావికాదళం మాజీ చీఫ్, చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ మాజీ చైర్మన్ అరుణ్ ప్రకాష్ వంటి వారు కూడా ఉన్నారు. సర్వీసు పూర్తిచేసుకున్న అగ్నివీరులకు ఉద్యోగాలు ఇస్తారు సరే.. ఇప్పటి వరకు బయటకు వచ్చిన ఎంతమంది సైనికాధికారులకు మీ సంస్థలో ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
కొత్త పథకం కోసం వేచి చూడడం ఎందుకని, ఇప్పటికే నైపుణ్యం, క్రమశిక్షణ కలిగిన వేలాదిమంది మాజీ సైనికులు, సైనికాధికారులు ఉన్నారని, ప్రతి సంవత్సరం వేలాదిమంది సైన్యం నుంచి బయటకు వచ్చి తమ రెండవ కెరియర్ను ప్రారంభించేందుకు వేచి చూస్తున్నారని ఆనంద్ మహీంద్రాకు అరుణ్ ప్రకాశ్ గుర్తు చేశారు. అలాంటి వారిలో ఇప్పటి వరకు మీరు ఎంతమందికి ఉద్యోగావకాశాలు కల్పించారో వెల్లడిస్తే బాగుంటుందని ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చారు. తాను 40 ఏళ్లుగా వాయుసేనలో సేవలు అందించానని, ఏళ్ల తరబడి ఇలాంటి హామీలను వింటున్నానని వాయుసేన మాజీ ఎయిర్ వైస్ మార్షల్ మన్మోహన్ బహదూర్ అన్నారు.
ఇది అగ్నిపాత్ పథకంపై దేశవ్యాప్తంగా ఎంతటి నిరసన ఉందో తెలియజేస్తోందని అన్నారు. ఆర్మీ ఉద్యోగాల కోసం ఎందరో యువత కొన్నేళ్లుగా కఠోర శ్రమకు ఓర్చి శ్రమిస్తుండగా, వారి ఆశలను అడియాశలు చేస్తూ కేంద్రం ప్రకటనలు చేయడం ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండానే దీనిని అప్పటికప్పుడు ప్రకటించినట్టుగా ఉందని మాజీ సైనిక ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అగ్నిపాథ్ పై రోజుకో ప్రకటన చేస్తుండడం.. ఆర్మీలో చేరే యువతకు తప్పుడు సంకేతాలను అందిస్తోందని విమర్శించారు. 25 శాతం మందిని ఆర్మీలోకి తీసుకుంటామని తొలుత ప్రకటించిన కేంద్రం.. అప్పుడే మళ్లీ శిక్షణ ఉంటుందని ఎందుకు ప్రకటించలేదని.. ఈ పథకం నోట్ల రద్దు ఘటనను తలపిస్తుందని వారు విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 17 | జేబులో డబ్బులు పెట్టుకుని తిరిగితే.. ఎవరైనా జేబు దొంగలు కొట్టేస్తారేమో అన్న అందోళన అవసరం లేకుండా.. ఎంచక్కా.. డిజిటల్ పే వచ్చేసింది. ఇక ఎదో ఒకచోట డబ్బు అవసరం అయితే.. అక్కడికక్కడే కనిపించే ఏటీఎంకు... Read more
Aug 17 | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఎదురుగా వస్తున్న గూడ్సు రైలును.. అదే మార్గంలో వస్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్ రైలులోని... Read more
Aug 17 | మధుమేహ రోగులకు శుభవార్తను అందించారు వైద్యశాస్త్ర పరిశోధకులు. కరోనా మహమ్మారి బారిన పడిన మధుమేహ వ్యాధిగ్రస్తులు దాని నుంచి బయటపడేందుకు మానసికంగా, శారీరికంగానూ చేసిన పోరాటం వల్లే అనేక మంది బతికి బయటపడగా, కొందరు... Read more
Aug 17 | కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కరోనా మహమ్మారికి మునుపటి స్థితికి చేరుకుని ఇప్పుడిప్పుడే భక్తులకు ఆలవాలంగా మారుతోంది. ఈ తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... Read more
Aug 16 | రాష్ట్రంలోని వివిధ జిల్లాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ దరఖాస్తులు కోరుతోంది. అప్లై చేసేందుకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉంది.... Read more