Two Pak Terrorist Killed In Srinagar Encounter శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం

Two lashkar terrorists killed in srinagar encounter in jammu kashmir

terrorism, J&K, Kashmir, Jammu and Kashmir, Srinagar encounter, Bemina area encounter, Jammu and Kashmir terrorists, security forces, Jammu and Kashmir terrorists dead, security forces Encounter, one policeman injured, jammu kashmir encounter, bemina encounter JK, Jammu encounter, CRPF forces, Jammu Kashmir encounter, Srinagar Encounter, terrorists killed in Central Kashmir, search operation in J&K, LeT terrorists killed, Srinagar, Jammu and Kashmir, National politics

Two terrorists from Lashkar-e-Taiba (LeT) were killed and one policeman was injured in a late night encounter between the security forces and the terrorists at Bemina in Central Kashmir’s, Srinagar district, according to officials.

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం

Posted: 06/14/2022 03:51 PM IST
Two lashkar terrorists killed in srinagar encounter in jammu kashmir

జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్ లో ఇవాళ ఉదయం జరిగిన ఎన్ కౌంటరల్లో ఇద్దరు పాక్ ప్రేరేమిత ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో కూంబింగ్ చేస్తున్న భద్రతా బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. కాగా ఒక భారత పోలిసు కానిస్టేబుల్ కు కూడా గాయాలయ్యాయి. ఈ విషయాన్ని కాశ్మీర్ జోన్ పోలీసు ఐజీ అధికారి విజయ్ కుమార్ కూడా నిర్థారించారు. ఇద్దరు ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టాయని అన్నారు.

కాగా, ఈ ఎన్ కౌంటర్లో కాశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన ఓ కానిస్టేబుల్ కు కూడా గాయాలయ్యాయని ఆయన తెలిపారు. శ్రీనగర్‌లోని బెమినా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు చనిపోయారని కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ చెప్పారు. వారు లష్కరే తొయీబాకు చెందిన ఉగ్రవాదులుని తెలిపారు. వారిలో ఒకరిని అనంత్‌నాగ్‌ జిల్లాలోని పహల్‌గామ్‌కు చెందిన ఆదిల్‌ హుస్సెయిన్‌ గా గుర్తించామన్నారు. అతడు 2018 నుంచి పాకిస్థాన్‌లో ఉంటున్నాడని వెల్లడించారు.

గత కొన్ని నెలలుగా కాశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై సరిహద్దు భద్రతాదళాలు, జమ్మూ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి అనేక మందిని మట్టుబెట్టాయి. మరీ ముఖ్యంగా పాకిస్థాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులతో పాటు వారి కమాండర్లను కూడా పదుల సంఖ్యలో హతమార్చారు. లష్కరే ఉగ్రసంస్థకు చెందిన కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిర్దిష్ట ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా చాలా కార్యకలాపాలు పోలీసులు, సైన్యం సంయుక్తంగా నిర్వహించాయి. అయినా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదలు భారత్ లోకి అక్రమచోరబాట్లతో చోచ్చుకొస్తూనే ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles