Turtles Balance On Wooden Log In River తాబేళ్ల ఆటలు ఎప్పుడైనా చూశారా.. ఆశ్చర్యపోతారంతే.!

Turtles balance on wooden log in river in now viral video

Turtles,animal video, Turtle Viral Video, Tortoise video, seven turtles, wooden log, Buitengebieden, Twitter, Viral video, Trending video

Animals have strange ways to amuse the world. Sometimes, their antics in the wild go viral on the internet, and sometimes, their games. Yes, animals also like to play games where they are seen challenging others in the flock. Like this group of turtles, which are trying to balance on an unstable log in a river.

ITEMVIDEOS: తాబేళ్ల ఆటలు ఎప్పుడైనా చూశారా.. ఆశ్చర్యపోతారంతే.!

Posted: 06/07/2022 08:34 PM IST
Turtles balance on wooden log in river in now viral video

తాబేళ్లు అనగానే.. మనకు చటుక్కున గుర్తుకు వచ్చేది ఓ నానుడి.. అదేనండీ స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్.. నిదానంగా.. స్థిరంగా ముందుకు సాగితే విజయం తప్పక లభిస్తుంది. ఈ నానుడి ఎందుకు వచ్చిందో తెలుసుగా.? చిన్నప్పుడు చదువుకున్న పాఠం. ఇక దాని జోలికి వెళ్లకుండా.. తాబేళ్ల విషయానికి వస్తే ఇవి లక్ష్మీదేవి వాహనాలు. ఇవి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్లుగా భావిస్తారు. ఈ భూమ్మీద మనుషులతోపాటు లక్షలాది జీవజాలం కూడా ఉంది. వాటిలో కొన్న జంతువులు మన దేవదేవతలకు వాహనాలుగా ఏర్పాటు చేసుకున్నారు.

అయితే వారం రోజులు కష్టపడిన మనుషులు వారాంతంలో ఎంజాయ్ చేయడం మామూలే. మరి మనలాగే జంతువులు కూడా ఎంజాయ్ చేస్తాయా? అంటే సమాధానం ఏం చెప్తాం? ఇదిగో ఇప్పుడు మనం చూసే వీడియో కూడా అలాంటిదే. కొన్ని తాబేళ్లు చెరువులో పడిన ఒక దుంగపై నిలబడి ఉయ్యాల ఊగుతూ కనిపించాయి. వాటి బరువు ఆధారంగా దుంగ నీళ్లలో ఆటు ఇటు ఊగింది. ఇలా దుంగ ఊగుతూ బ్యాలెన్స్ అదుపుతప్పిన తాబేళ్లు ఒకదాని తర్వాత మరోకటి నీళ్లలో పడిపోయాయి. నీళ్లలో పడిపోయిన తాబేళ్లు మళ్లీ దుంగపైకి ఎక్కేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి.

కాగా ఈ వీడియో ముగిసే సమయానికి కేవలం మూడు తాబేళ్లు మాత్రమే దుంగపై మిగిలివున్నాయి. ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు నవ్వేస్తున్నారు. ఔరా తాబేళ్లు కూడా ఇలా నీళ్లలో ఆటలాడుతాయా.? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పోటీలో ఎవరు గెలిచారో మాత్రం తెలియడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే.. అంతలా ఊగిపోతున్న దుంగ మీదకు ఈ తాబేళ్లను ఎవరు ఎక్కించారు? అని అడుగుతున్నారు. ఇది కచ్చితంగా తాబేళ్ల ప్రేమే అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ట్విట్టర్‌లో ఈ వీడియోకు ఇప్పటికే 37 లక్షలపైగా లైక్స్, 84 లక్షల వరకు వ్యూస్ వచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles