Nigeria Church Attack: Gunmen Kill 'Many' Worshippers నైజీరియాలో చర్చిపై ఉగ్రవాదుల మారణహోమం: 50 మందికి పైగా మృత్యువాత

More than 50 people are feared dead in an attack on a catholic church in nigeria

Church attack Nigeria, Nigeria church attack sunday,50 dead, priest abducted, Pope Francis, St. Francis Catholic Church, Ondo, gun fire, bomb blast, explosives, Nigeria Church Attack, Ogunmolasuyi Oluwole, Owo, Middle East, Africa, Catholic News, Nigeria, Religious persecution, Catholic Church in Nigeria, bomb blast, gun fire, terrorists, crime

Gunmen opened fire on worshippers and detonated explosives at a Catholic church in southwestern Nigeria on Sunday, leaving dozens feared dead, state lawmakers said. The attackers targeted the St. Francis Catholic Church in Ondo state just as the worshippers gathered on Pentecost Sunday, legislator Ogunmolasuyi Oluwole said. Among the dead were many children, he said.

నైజీరియాలో చర్చిపై ఉగ్రవాదుల మారణహోమం: 50 మందికి పైగా మృత్యువాత

Posted: 06/06/2022 11:18 AM IST
More than 50 people are feared dead in an attack on a catholic church in nigeria

ఆఫ్రికా దేశమైన నైజీరియాలో ఉగ్రవాదులు మరోమారు దాడులకు తెగబడ్డారు. ఓ ప్రార్థనా మందిరంపై తుపాకీ కాల్పులు, బాంబులతో మారణహోమం సృష్టించారు. ఈ ఉగ్రదాడిలో 50 మందికి పైగా భక్తుల ప్రాణాలను ఉగ్రవాదులు బలిగొన్నారు. అనేకమంది భక్తలు తీవ్రగాయాలపాలపై అసుపత్రులలో చికిత్స పోందుతున్నారు. నైజీరియాలోని ఓండోలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో ఈ ఘటన జరిగింది. ఆదివారం ప్రార్థనల కోసం స్థానికులు పెద్ద సంఖ్యలో ప్రార్థనా మందిరానికి తరలిరావడంతో ఎక్కువమంది ఈ కాల్పుల్లో హతులయ్యారు. మృతుల్లో చిన్నారులే అధికంగా వున్నారని తెలుస్తోంది. కాగా మృతుల సంఖ్య మరింత పెరగే అవకాశం వుందని వైద్యులు చెబుతున్నారు.

ఆదివారం స్థానికులు పెద్ద సంఖ్యలో చర్చిలోనికి వచ్చి ప్రార్థనలు చేస్తున్న సమయంలో ముష్కరులు ఒక్కాసారిగా దాడి చేశాడు. చర్చిలో ప్రార్థనలు చేస్తున్న భక్తులపై తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం బాంబులు విసరడంతో 50 మంది మరణించారని స్థానిక శాసనసభ్యుడు ఒలువోల్‌ వెల్లడించారు. భక్తుల ప్రార్థనలు మిన్నంటిని భక్తిపారవశ్యంలో మునిగి తేలాల్సిన చోట.. ఈ మారణకాండతో హాహాకారాలు, అర్థనాధాలు.. చర్చిలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిన అవయవాలతో చర్చి భీతావహంగా మారింది. అధికారికంగా మృతుల సంఖ్యను ప్రభుత్వం వెల్లడించనప్పటికీ 50 మందికి పైగానే మృత్యువాత పడ్డారని నైజీరియా లోయర్ లెజిస్లేటివ్ చాంబర్ సభ్యుడు అడెలెగ్బె టిమిలెయిన్ తెలిపారు.

చర్చి పాధర్ ను కూడా ముష్కరులు అపహరించుకుపోయారని తెలిపారు. ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. నెదర్ ప్రాంతానికి చెందిన పిశాచాలు మాత్రమే గర్భం దాల్చి ఇటువంటి మారణహోమాన్ని సృష్టించగలవని మండిపడ్డారు. ఏది ఏమైనా, ఈ దేశం ఎప్పటికీ దుష్టులకు లొంగదని తేల్చి చెప్పారు. చీకటి ఎప్పటికీ కాంతిని పారదోలలేదని అన్నారు. చివరికి నైజీరియానే గెలుస్తుందని బుహారీ పేర్కొన్నారు. కాగా, చర్చిపై దాడికి ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించలేదు. నైజీరియాలో అత్యంత శాంతియుత రాష్ట్రాలలో ఒకటిగా ఖ్యాతికెక్కిన ఓండోలో జరిగిన ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles