Samples of 5-year-old UP girl collected for suspected monkeypox దేశంలోనూ మంకీ పాక్స్ కలకలం.. యూపీలో ఐదేళ్ల చిన్నారిలో లక్షణాలు

Samples of 5 year old up girl collected for suspected monkeypox

India Monkeypox cases, monkeypox, India Monkeypox, UP Monkeypox, up girl, Ghaziabad, CDC, Uttar Pradesh

India may have its first suspected case of monkeypox in Uttar Pradesh, according to reports. Samples of a 5-yr-old girl was collected for testing for monkeypox, as a precautionary measure, the CMO of Ghaziabad said in a statement.

దేశంలోనూ మంకీ పాక్స్ కలకలం.. యూపీలో ఐదేళ్ల చిన్నారిలో లక్షణాలు

Posted: 06/04/2022 05:26 PM IST
Samples of 5 year old up girl collected for suspected monkeypox

అమెరికా, యూరప్ దేశాల్లోనే పాకిన మంకీపాక్స్.. ఇప్పుడు మన దేశంలోకీ ప్రవేశించిందా? అంటే ఔననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ కు చెందిన ఐదేళ్ల చిన్నారిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఆ చిన్నారి నమూనాలను అధికారులు సేకరించి, పరీక్షల కోసం పంపారు. ఆ చిన్నారికి చర్మం పగుళ్లు, దురద, దద్దుర్ల వంటి లక్షణాలు వచ్చాయని, ఆమెకి ఇంతకుముందు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవని ఘజియాబాద్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ చెప్పారు. గత నెలరోజుల్లో విదేశాలకు వెళ్లి వచ్చిన దాఖలాలూ లేవన్నారు.

ప్రస్తుతానికి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ముందు జాగ్రత్త చర్యగా టెస్టులకు పంపామని తెలిపారు. ఆఫ్రికా దేశాల్లో ప్రారంభమైన మంకీపాక్స్‌ క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా 700కుపైగా మంకీపాక్స్ కేసులు వచ్చాయని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నిన్న ప్రకటించింది. అమెరికాలో 21 మంది దాని బారిన పడినట్టు వెల్లడించింది. కెనడాలో 77 మందికి అది సోకింది. అయితే మంకీపాక్స్ అంత తీవ్రమైన వ్యాధి ఏం కాదని నిపుణులు చెబుతున్నారు. మంకీపాక్స్‌ రెండు నుంచి నాలుగు వారాల్లో తగ్గిపోతుందని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది.

ఈ వ్యాధికి సంబంధించి దద్దుర్లు, జ్వరం, వణుకుడు, నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయంటున్నారు. పశ్చిమ, మధ్య ఆఫ్రికాకే పరిమితమైన ఈ వ్యాధి.. మేలో యూరప్ దేశాలకు పాకింది. అక్కడి నుంచి అమెరికా, కెనడాలకూ వ్యాపించింది. ప్రస్తుతం మంకీ ఫాక్స్ ఫ్రాన్స్‌ను వణికిస్తోంది. దేశంలో ఒక్కరోజే 51 మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. బుధవారం నాటికి 33గా ఉన్న మొత్తం కేసుల సంఖ్య రెండు రోజుల్లోనే వందకు చేరువైంది. ఈ యూరోపియన్‌ దేశంలో మొదటి మంకీపాక్స్‌ కేసు మే నెలలో వెలుగు చూసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India Monkeypox cases  monkeypox  India Monkeypox  UP Monkeypox  up girl  Ghaziabad  CDC  Uttar Pradesh  

Other Articles