Distraught mother ‘handcuffed’ in chaos outside school ‘నా కొడుకును క్షమించండి..’’ టెక్సాస్ హంతకుడి తల్లి విన్నపం

I had an uneasy feeling sometimes texas shooter s mother in first reaction

texas school shooting, mass shooting in texas, shooting in texas, rob elementary school shooting, gun laws in united states, Salvador Ramos, who is Salvador Ramos, texas shooting, Uvalde, Texas, Adriana Reyes, gunman, Matt Gutman, assault rifles, United states, Crime

Speaking for the first time on the horrific Texas elementary school shootout, in which 19 children and two teachers were killed, Adriana Reyes, the mother of the accused, Salvador Ramos, said she had an ‘uneasy feeling’ sometimes. “I had an uneasy feeling sometimes, like what are you up to? We all have a rage, some people have it more than others,” Reyes told a day after the tragedy at Robb Elementary School in Uvalde.

తల్లడిల్లిన తల్లి హృదయం: నా కొడుకును క్షమించండి.. టెక్సాస్ హంతకుడి తల్లి విన్నపం

Posted: 05/28/2022 01:45 PM IST
I had an uneasy feeling sometimes texas shooter s mother in first reaction

కన్న కొడుకు సక్రమమైన మార్గంలో నడవాలని ఏ తల్తైనా కోరుకుంటోంది. అదే కొడుకు తెలిసి.. చేసినా తెలియక చేసినా కొడుకును ఓ వైపు మందలిస్తూనే.. మరోవైపు తన కోడుకును వెనుకేసుకొస్తోంది. అమెది మాతృ హృదయం. ఇది మరోసారి రుజువైంది. అభంశుభం తెలియని అమాయక చిన్నారుల ప్రాణాలను హరించిన హంతకుడి తల్లి కూడా అదే పని చేసింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం యువాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో 19 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లను 18 ఏళ్ల బాలుడు సాల్వడార్ రామోస్ తుపాకీతో మట్టుబెట్టడం తెలిసిందే. పోలీసుల కాల్పుల్లో రామోస్ కూడా మరణించాడు.

దీనిపై సాల్వడార్ రామోస్ కన్నతల్లి అడ్రినా మార్టినెజ్ స్పందించారు. ఓ టీవీ చానల్ తో ఆమె మాట్లాడుతూ.. ‘‘నన్ను క్షమించండి. నా కుమారుడిని కూడా క్షమించండి. నా కొడుకు చేసిన పనికి అతడి వైపు నుంచి కారణాలు ఉన్నాయి. అది నాకు తెలుసు. దయచేసి అతడి చర్యను జడ్జ్ చేయవద్దు. ప్రాణాలు కోల్పోయిన అమాయక చిన్నారులు క్షమించాలనే నేను వేడుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. అంతమందిని కాల్చి చంపడానికి కారణాలు ఏమున్నాయి? అని టీవీ ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి ఆమె సరైన సమాధానం ఇవ్వలేదు.

సదరు నరహంతక బాలుడి తండ్రి స్పందిస్తూ.. ‘‘నా కుమారుడు చేసిన దానికి నేను క్షమాపణలు చెబుతున్నాను. నా కొడుకు ఎప్పుడూ కూడా ఇలాంటి చర్యకు దిగుతాడని ఊహించనే లేదు. అతడు అలాంటి పని చేయడానికి బదులు నన్ను చంపి ఉండాల్సింది. కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులను వారి తల్లిదండ్రులు ఎలా అయితే ఇక ఎప్పుడూ చూడలేరో.. నేను కూడా నా కొడుకును ఇంకెప్పుడూ చూడలేను. అదే నాకు బాధ కలిగిస్తోంది’’ అని పేర్కొన్నాడు. స్కూల్లో కాల్పులకు దిగడానికి ముందు సదరు బాలుడు ఇంటి వద్ద అమ్మమ్మపైనా తుపాకీతో విరుచుకుపడడం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salvador Ramos  texas shooting  Uvalde  Texas  Adriana Reyes  gunman  Matt Gutman  assault rifles  United states  Crime  

Other Articles