Covid-19 infection linked to impaired heart function: Study గుండెపైనా కరోనా తీవ్ర ప్రభావం: అధ్యయనం

Covid damages heart kidneys and lungs even months after infection study

COVID, INSACOG, Omicron Variant, Coronavirus, COVID and Heart, COVID and Heart Damage, COVID and Kidneys, Covid and Kidney damage, covid and Lungs, Covid and Lungs damage, Long Covid symptoms, COVID can damage heart, COVID damages heart, WHO, Coronavirus

Coronavirus affects the respiratory system leading to severe problems in the lungs. But, not just the lungs, the deadly COVID-19 virus can also affect the right side of the heart. Yes, you read that right. Coronavirus is a severe respiratory disease which targets the lungs, but the effects can also be felt in the heart, especially on the right side of it.

ఊపిరితిత్తులే కాదు.. గుండెపై కూడా కరోనా తీవ్రప్రభావం: అధ్యయనం

Posted: 05/25/2022 03:21 PM IST
Covid damages heart kidneys and lungs even months after infection study

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది వచ్చి.. వేగంగా ఇతరులకు సోకుతున్న వేరియంట్ ఒమిక్రాన్ మాత్రం.. రోగుల ఊపిరితిత్తులపై కాకుండా గెండెపై తీవ్రప్రభావాన్ని చూపుతున్నాయని ఇటీవల మనదేశంలోని ప్రముఖ కార్డియాలజిస్టులు సందేహాలు వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం కరోనా మహమ్మారికి సంబంధించి మరో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా మరణాలకు ఊపిరితిత్తులు దెబ్బతినడమే కారణమని ఇప్పటి వరకు భావించగా, దీంతోపాటు మరో నిజం కూడా వెలుగులోకి వచ్చింది. వైరస్ ఊపిరితిత్తుల్లో ఉండిపోయి వాటి పనితీరును దారుణంగా దెబ్బతీస్తుందని ఇప్పటి వరకు నిర్వహించిన పరిశోధనల్లో తేలగా, తాజాగా యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో, ఎన్‌హెచ్ఎస్ గోల్డెన్ జూబ్లీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో మరో విస్తుపోయే విషయం వెల్లడైంది. కరోనా వైరస్ ఊపిరితిత్తులతో పాటు గుండె పనితీరును కూడా దారుణంగా దెబ్బతీస్తుందని ఈ పరిశోధనలో తేలింది.

ఊపిరితిత్తులకు రక్తం సరఫరా చేసే గుండెలోని కుడివైపు భాగంపై వైరస్ తీవ్రప్రభావం చూపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఐసీయూలలో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న 121 మంది రోగులపై అధ్యయనం చేసిన అనంతరం వారీ విషయాన్ని వెల్లడించారు. తాము పరిశీలించిన ప్రతి ముగ్గురిలో ఒకరికి గుండె కుడివైపు దెబ్బతింటోందని, దీనివల్ల మరణం కూడా సంభవించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీంతో కరోనా సోకడంతో గుండెపోటుకు కూడా గురై మరణించిన వారు చాలామంది ఉన్నారని అవన్నీ కూడా కరోనా మరణాలుగానే పరిగణలోకే వస్తాయని అంటున్నారు వైద్యులు.

కరోనా కారణంగా ఊపిరితిత్తులు బలహీనపడడం వల్ల అవి రక్తాన్ని స్వీకరించలేకపోతున్నాయని, అయితే, గుండె మాత్రం రక్తం పంపింగ్ చేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఫలితంగా గుండెపైనా కరోనా తీవ్ర ప్రభావం చూపుతోందని పరిశోధకుల్లో ఒకరైన కార్రడియోథొరాసిక్ ఎనస్థీషియా, ఇంటెన్సివ్ కేర్ విభాగానికి చెందిన ఫిలిప్ మెక్‌కాల్ పేర్కొన్నారు.కరోనా వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు అర్థమైంది కాబట్టి, ఇకపై మరింత మెరుగైన చికిత్స ద్వారా దానిని అధిగమించవచ్చని పరిశోధనకు నేతృత్వం వహించిన గోల్డెన్ జూబ్లీ ఇంటెన్సివ్ కేర్ నిపుణుడు బెన్ షెల్లీ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles