Maoists open letter to Araku people ఎంపీ, ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వస్తే..: మావోయిస్టు పార్టీ కార్యదర్శి గణేశ్

Stop mla mp from entering your villages maoists aob secretary ganesh

Maoist, YSRCP, Araku, Andhra-Odisha border, Alluri sitarama raju district, Visakhapatnam, G Madhavi, Chetti palguna, Andhra Pradesh, Crime

The Maoists have issued warnings against Araku MPs and legislators. The left wing extremists objected that those who were elected to the Legislative Assembly and the Lok Sabha not taking steps to escalate for the betterment of the people. Ganesh, secretary of the Awobi Special Zonal Committee of the Maoist party, has called on MPs and MLAs not to enter the villages and be evicted. To this end, he released a letter to the media.

ఎంపీ, ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వస్తే.. ఈ పని చేయండీ: మావోయిస్టు పార్టీ కార్యదర్శి గణేశ్

Posted: 05/24/2022 01:02 PM IST
Stop mla mp from entering your villages maoists aob secretary ganesh

అరకు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులకు వ్యతిరేకంగా మావోయిస్టులు హెచ్చరికలు జారీచేశారు. అరకు ఎంపీ జి.మాధవి చెట్టి ఫాల్గుణ, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిలకు వ్యతిరేకంగా మావోలు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులుగా శాసనసభకు, లోక్ సభకు ఎన్నికైన వీరు ప్రజలకు మేలుచేయడం మాని వైషమ్యాలను పెంచిపోషించే చర్యలను చేపడు తున్నారని మావోలు అక్షేపించారు. ఎంపీ, ఎమ్మెల్యేలను గ్రామాల్లోకి రానీయొద్దని, వస్తే తన్ని తరమాలని మావోయిస్టు పార్టీ ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేశ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మీడియాకు లేఖ విడుదల చేశారు.

వైసీపీ ప్రభుత్వ విధానాలు యావత్తూ మోసపూరితంగా, ద్రోహపూరితంగా ఉణ్నాయని, ఈ విధానాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకించాలని అన్నారు. ఆదివాసీల ఓట్లతో ప్రజా ప్రతినిధులైన వీరిద్దరూ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. వైసీపీ పాలన రాష్ట్రాన్ని తీవ్రమైన రుణ, ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక, రాజకీయ వివాదాలు పెరిగాయని అన్నారు. దోపిడీ చేయడాన్ని కళగా మార్చుకున్న ప్రభుత్వం అందులో భాగంగానే పేర్లతో స్థానికులను సంతోషపరుస్తోందని అన్నారు.

మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరిట జిల్లాను ఏర్పాటు చేసిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా అల్లూరి వర్ధంతిని ఘనంగా నిర్వహించిందని అన్నారు. ఇదంతా దేవతకు బలిచ్చే ముందు జంతువులకు చేసే పూజ లాంటిదని గణేశ్ అన్నారు. జీవో-97ను తప్పనిసరి పరిస్థితుల్లో రద్దు చేసినప్పటికీ అన్‌రాక్ కంపెనీతో జరిగిన ఒప్పందాన్ని మాత్రం రద్దు చేయలేదని గుర్తు చేశారు. బాక్సైట్ తవ్వకాలు చేపట్టాలన్న ఉద్దేశంతోనే జీవో-89ను తెరపైకి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్టు పార్టీని అంతం చేయాలన్న లక్ష్యంతో గ్రేహౌండ్స్ సాయుధ బలగాలతో ప్రభుత్వం వేట కొనసాగిస్తోందని ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles