YSRCP MLC arrested for murder of former driver వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాస్కర్ అరెస్ట్..

Mlc ananta udaya bhaskar arrested and being interrogated in ex drivers murder

Ananta Uday Bhaskar, YSRCP MLC, Accident, Kakinada police, MLC confession, driver Subramanyam, beaten to death, Andhra MLC driver death, Andhra Pradesh, Crime

Three days after a MLC of ruling YSR Congress Party in Andhra Pradesh handed the body of his former driver to the latter’s family, claiming that he had died in an accident, Kakinada district police on Monday arrested the legislator, Ananta Uday Bhaskar, in connection with the death.

వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాస్కర్ అరెస్ట్.. రహస్యంగా విచారిస్తున్న పోలీసులు!

Posted: 05/23/2022 08:33 PM IST
Mlc ananta udaya bhaskar arrested and being interrogated in ex drivers murder

అధికార వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారని సమాచారం. తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మూడు రోజుల తరువాత సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని ఆయన కుటుంబసభ్యలకు అప్పగించిన ఎమ్మెల్సీ.. ఆయన ప్రమాదంలో మరణించాడని వారితో నమ్మబలికాడు. అయితే ప్రమాదమే అయితే ఆ క్షణంలోనే తమకు సమాచారం తెలిసేందని సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు దీని వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానాలను వ్యక్తం చేశారు.

దీంతో ఈ వ్యవహారం యావత్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అనంత ఉదయ్ భాస్కర్ ను కాపాడే క్రమంలో అనేక మంది వైసీపీ నేతలు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఆయన తప్పు ఏమీ లేదని.. అండగా నిలిచారు.ఈ క్రమంలో పోలీసులు మాత్రం ఈ కేసును హత్యకేసుగా మార్చారు. కేసును విచారించిన కాకినాడ పోలీసులు ఎమ్మెల్సీ అనంత భాస్కర్ ను అరెస్ట్ చేశారు. రహస్య ప్రదేశంలో ఆయనను విచారించారు. ప్రస్తుతం అనంత భాస్కర్ పోలీసుల కస్టడీలో ఉన్నట్టు కాకినాడ ఏఎస్పీ వెల్లడించారు. మరోవైపు, ఈ విచారణలో సుబ్రహ్మణ్యంను తానే హత్య చేసినట్టు ఎమ్మెల్సీ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.

తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకున్నందుకే హత్య చేసినట్టు ఆయన తెలిపినట్టు సమాచారం. తనను బ్లాక్ మెయిల్ చేయడంతో, బెదిరిద్దామని అనుకున్నానని... కొట్టి బెదిరిద్దాం అని భావించానని చెప్పారు. అయితే తాను ఆవేశంతో కొడితే చనిపోయాడని తెలిపారు. మరోవైపు కాసేపట్లో ఆయనను జడ్జి జానకి ఎదుట హాజరు పరచనున్నారు. కోర్టు సమయం ముగియడంతో జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. జడ్జి ఆయనకు రిమాండ్ విధించే అవశాశం ఉంది. ప్రస్తుతం ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఎమ్మెల్సీని ఆసుపత్రికి తరలిస్తున్నట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles