Security tightened at Aurangzeb tomb ఎంఎన్ఎస్ హెచ్చరికల నేపథ్యంలో ఔరంగజేబ్ సమాధి మూసివేత.!

Asi shuts aurangzeb s tomb in maha for 5 days amid row over aimim leader s visit

Aurangzeb tomb, AIMIM Leader Akbaruddin owaisi, MNS Tweet, MNS spokesperson Gajanan Kale, Aurangzeb tomb closed, ASI shuts aurangazeb tomb, Aurangabad, aurangzeb tomb, aurangzeb tomb in aurangabad, archaelogical survey of india, mughals, bjp, shiv sena, ncp, congress, mumbai news, maharashtra news, Crime

The Archaeological Survey of India (ASI) Thursday shut Mughal emperor Aurangzeb’s tomb in the Aurangabad district of Maharashtra for five days after a mosque committee in the area tried to lock the place, officials said. The Maharashtra Navnirman Sena (MNS) spokesperson Gajanan Kale had in a tweet questioned the need for the monument’s existence in the state and said it should be destroyed.

ఎంఎన్ఎస్ హెచ్చరికల నేపథ్యంలో ఔరంగజేబ్ సమాధి మూసివేత.!

Posted: 05/19/2022 03:31 PM IST
Asi shuts aurangzeb s tomb in maha for 5 days amid row over aimim leader s visit

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో హిందువులపై అదనపు పన్నులు వేసిన ఇబ్బందులకు గురిచేశాడన్న విషయం చరిత్ర పాఠ్యపుస్తాకాల్లో నిక్షిప్తమైవుంది. ఈ అంశమే ఇప్పుడు మహారాష్ట్రలో ప్రజల మధ్య శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తోంది. ఇటీవల మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఔరంగజేబు సమాధిని సందర్శించి.. ఆక్కడ నమాజు చేయడంతో అగ్గికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. దీంతో అక్బరుద్దీన్ పై అటు బీజేపి ఇటు ఎంఎన్ఎస్ ఒంటికాలుపై లేచాయి. మరోవైపు అధికార శివసేన పార్టీ కూడా తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది.

ఈ క్రమంలో మరోఅడుగు ముందుకేసిన మహారాష్ట్ర నవ నిర్మాణసేన (ఎంఎన్ఎస్) రాష్ట్రంలో అలుముకుంటున్న వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. మహారాష్ట్రలో ఔరంగజేబ్ సమాధి ఉండాల్సిన అవసరం ఏముందని ఎంఎన్ఎస్ అధికార ప్రతినిధి గజానన్ కాలే ట్వీట్ మహారాష్ట్రలో అగ్గిరాజేసింది. అంతటితో ఆగని ఆయన రాష్ట్రంలోని ఔరంగజేబ్ సమాధిని ధ్వంసం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా ఖుల్తాబాద్ ప్రాంతంలో ఉన్న ఔరంగజేబు సమాధిని సమాధిని భారత పురావస్తు శాఖ అధికారులు మూసివేశారు.

ఈ నేపథ్యంలో సమాధి ఉన్న ప్రాంతంలోని మసీదు కమిటీ దానికి తాళం వేయడానికి ప్రయత్నించగా.. ఆర్కియాలజీ శాఖ ఆ చర్యను అడ్డుకుని సమాధి ప్రాంతాన్ని మూసివేసింది. ఐదు రోజులపాటు సమాధిని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు సమాధి వద్ద భద్రతను పెంచి కట్టుదిట్టం చేశారు. ఈ అంశంపై పురావస్తు శాఖ ఔరంగాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ మిలన్ కుమార్ చౌలే మాట్లాడుతూ... మసీదు కమిటీ ఆ ప్రాంతాన్ని లాక్ చేయడానికి ప్రయత్నించిందని... తాము దాన్ని తెరిపించామని చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో, ఐదు రోజుల పాటు సమాధిని మూసి వేయాలని నిన్న నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఐదు రోజుల తర్వాత పరిస్థితిని బట్టి సమాధి ప్రాంతాన్ని తెరవాలా? లేక మరో ఐదు రోజుల పాటు మూసివేయాలా? అనే నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles