HC sentences 3 IAS officers to one month jail కోర్టుధిక్కారానికి పాల్పడిన ముగ్గురు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష.!

Andhra pradesh hc sentences 3 ias officers to one month jail for contempt of court

Andhra Pradesh High Court, IAS officers, contempt of court, Special Chief Secretary, poonam malakondaiah, high court, district collector of kurnool g veerapandian, guilty of contempt of court, Special Commissioner of Agriculture H Arun Kumar, Andhra Pradesh, Crime

The Andhra Pradesh High Court sentenced three IAS officers, including a Special Chief Secretary, to a jail term of one month and also ordered them to pay a fine of Rs 2,000 each holding them guilty of contempt of court. Justice B Devanand passed the order against Special Chief Secretary (Agriculture) Poonam Malakondaiah, the then Special Commissioner of Agriculture H Arun Kumar and the then District Collector of Kurnool G Veerapandian for "having violated the orders of the court" and failed to implement its orders within a specified time.

కోర్టుధిక్కారానికి పాల్పడిన ముగ్గురు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష.!

Posted: 05/07/2022 12:22 PM IST
Andhra pradesh hc sentences 3 ias officers to one month jail for contempt of court

కోర్టు ధిక్కరణ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆరుగురు వారంలో ఒక రోజు సామాజిక సేవ చేయాలని శిక్ష విధించిన నేపథ్యంలోనూ ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారులు తీరు మారడంలేదు. ఆ అధికారులకు నాలుగు వారాల పాటు స్వల్ప ఊరట లభించిన తరువాత.. తాజాగా మరో ముగ్గురు అధికారులు కూడా కోర్టు ధీక్కార ఉల్లంఘనలకు పాల్పడిన ముగ్గరు ఐఏఎస్ అధికారులపై.. న్యాయస్థానం ఆగ్రహానికి గురయ్యారు. తమ అదేశాలను నిర్ణీత, నిర్ధేశిత సమయంలో అమలుపర్చాల్సిన అధికారులు, మీనమేషాలు లెక్కపెడ్డటం ద్వారా బాధితులకు న్యాయం ఎప్పుడు జరుగుతుదని న్యాయస్థానం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది.

కోర్టు ధిక్కారణకు పాల్పడిన ముగ్గురు అధికారులపై హైకోర్టు కొరడా ఝళిపిస్తోంది. తీర్పును అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులకు జైలు శిక్షలు విధిస్తూ సంచలన తీర్పులు వెల్లడిస్తోంది. తాజాగా మరో ముగ్గురు ఐఏఎస్‌లకు నెల రోజుల జైలు శిక్ష, 2 వేల రూపాయల జరిమానా విధించింది. వీరిలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆ శాఖ మాజీ కమిషనర్ హెచ్. అరుణ్‌కుమార్, పౌర సరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండియన్ ఉన్నారు. నిన్న జరిగిన విచారణకు అరుణ్ కుమార్, వీరపాండియన్ హాజరయ్యారు. వీరిద్దరి అభ్యర్థన మేరకు తీర్పు అమలును ఆరు వారాలపాటు నిలిపేస్తూ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశాలు జారీ చేశారు.

 అదే సమయంలో పూనం మాలకొండయ్య కోర్టుకు హాజరు కాకపోవడంతో తీర్పు అమలును నిలుపుదల చేసేందుకు నిరాకరించారు. ఈ నెల 13వ తేదీ లోపు హైకోర్టు రిజిస్ట్రార్ (జుడీషియల్) ఎదుట లొంగిపోవాలని ఆమెను ఆదేశించారు. అయితే, సింగిల్ జడ్జి తీర్పుపై పూనం మాలకొండయ్య నిన్ననే అత్యవసరంగా ధర్మాసనం ఎదుట అప్పీల్ చేయగా విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సత్యనారాయణలతో కూడిన ధర్మాసనం సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసింది.

కాగా, కర్నూలు జిల్లా ఎంపిక కమిటీ తనను విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్-2)గా ఎంపిక చేయకపోవడాన్ని సవాలు చేస్తూ జిల్లాకు చెందిన ఎన్. మదనసుందర్ గౌడ్ 2019లో హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన న్యాయస్థానం పిటిషనర్ పేరును పరిగణనలోకి తీసుకోవాలని, రెండు వారాల్లో అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలంటూ 22 అక్టోబరు 2019న న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో పిటిషనర్ మదన సుందర్ గౌడ్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. తాజాగా, దీనిని విచారించి న్యాయస్థానం అందుకు కారకులైన ముగ్గురు ఐఏఎస్ అధికారులకు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles