Adilabad in focus with arms transportation by Khalistani outfit అదిలాబాద్ లో నలుగురు ఖలిస్తాన్ ఉగ్రవాదులు..

Tension in adilabad as khalistanis caught with explosives in haryana

Kalistani terrorists in Adilabad, Kalistani terrorists transporting explosives, Pakistani Kalistani terrorists in Adilabad, 4 terrorists, Khalistan, Adilabad, Karnal ,Pakistan, Nanded, Maharashtra, Punjab, Ludhiana, Nepal, Ferozpur, RDX, Telangana, Crime

The arrest of four alleged persons associated with the activities of the banned Khalistani outfit and its remote connection with Adilabad in the transportation of explosives and firearms has brought into sharp focus the clandestine activities. Adilabad could have been a mere transit point for this consignment as various security sources revealed.

అదిలాబాద్ లో నలుగురు ఖలిస్తాన్ ఉగ్రవాదులు.. భారీ మందుగుండు సామాగ్రి స్వాధీనం..

Posted: 05/06/2022 12:51 PM IST
Tension in adilabad as khalistanis caught with explosives in haryana

భారత్​పై నిత్యం విషం చిమ్ముతుండే పాకిస్థాన్​ తలపెట్టిన మరో భారీ కుట్రను హర్యానా పోలీసులు భగ్నం చేశారు. నలుగురు అనుమానిత ఉగ్రవాదులను కర్నాల్​ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున బుల్లెట్లు, గన్‌పౌడర్ కంటైనర్‌లను స్వాధీనం చేసుకున్నారు. మధుబన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తే అసలు బాగోతం బయటపడింది. తెలంగాణలోని ఆదిలాబాద్​ కేంద్రంగా భారీ ఉగ్ర కుట్రను ప్లాన్ చేశారు. కాగా, ఉగ్రకుట్రను భగ్నం చేసిన పోలీసులు నలుగురు ఉగ్రవాద అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. నిందితులు పాకిస్థాన్​కు చెందిన ఉగ్రవాదులతో టచ్​లో ఉన్నారు. పాక్​ ఉగ్రవాదులు చెప్పిన విధంగా నిందితులు తెలంగాణలోని ఆదిలాబాద్​కు మందుగుండు సామగ్రిని తరలిస్తున్నారు. నిందితులను గుర్‌ప్రీత్, అమన్‌దీప్, పర్మిందర్, భూపిందర్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడు గుర్​ప్రీత్​కు ఫిరోజ్​పుర్​ జిల్లాలో డ్రోన్ ద్వారా పేలుడు పదార్థాలు అందాయి. వీరు నాందేడ్​కు పేలుడు పదార్థాలను తరలించే సమయంలో పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయమైన వర్గాల సమాచారం మేరకు పోలీసులు వారిని బస్తారా టోల్ ప్లాజా సమీపంలో చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారిలో ముగ్గరు ఫిరోజ్‌పుర్‌కు, మరొకరు లుథియానాకు చెందినవారని తెలిపారు.

ఒక పిస్టల్, 31 లైవ్ క్యాట్రిడ్జ్‌లు, పేలుడు పదార్థాలతో కూడిన మూడు కంటైనర్లు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాల చట్టం కింద ఎఫ్​ఐఆర్​ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు. ఇదిలావుండగా, అటు మణిపూర్​లో ఓ బాంబు పేలుడు కలకలం రేపింది. ఆ బాంబును ఐఈడీగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ పేలుడు వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇంపాల్​ వెస్ట్ సిటీలో సచితా కార్ హౌస్ అనే దుకాణం ఎదుట గురువారం తెల్లవారుజామున 3:30 గంటలకు బాంబు పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు.

పేలుడు ధాటికి షాప్‌లోని కొన్ని సామాన్లు, షాపు దగ్గర పార్క్​ చేసి ఉన్న కారు ముందు భాగం ధ్వంసమయ్యాయి. బాంబ్​ డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్‌తో పాటు మణిపుర్ ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ నిపుణుల బృందం పేలుడు జరిగిన ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు, గుజరాత్​లో అక్రమంగా ఆయుధాలను సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి సుమారు 30 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 4 terrorists  Khalistan  Adilabad  Karnal  Pakistan  Nanded  Maharashtra  Punjab  Ludhiana  Nepal  Ferozpur  RDX  Telangana  Crime  

Other Articles