India wants Russia to sell its oil at less than $70 per barrel రిస్క్ తీసుకుంటున్నా.. క్రూడ్ అయిల్ ధర తగ్గించరా.?: రష్యాతో భారత్

India seeks less than 70 per barrel price for russian oil to compensate for risk

russian oil,russian oil imports, india buys russian oil, discounted russian oil, india buys discounted russian oil, Generic 1st 'CL' Future, Russia, Organization of the Petroleum Exporting Countries, Imports, Asia, Ukraine, Vladimir Putin, Europe, Government, markets

Amid the rising global prices of crude oil, India is said to be seeking deeper discounts on Russian oil to compensate for the risk of dealing with Moscow amid sanctions. With the reducing demand from the European nations due to Russian invasion of Ukraine, the oil industry in Russia is under severe pressure.

రిస్క్ తీసుకుంటున్నా.. క్రూడ్ అయిల్ ధర తగ్గించరా.?: రష్యాతో భారత్

Posted: 05/04/2022 05:48 PM IST
India seeks less than 70 per barrel price for russian oil to compensate for risk

ఉక్రెయిన్‌-ర‌ష్యాల మధ్య యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి, అంటే, దాదాపు ఫిబ్ర‌వ‌రి చివ‌రి వారం నుంచి దేశంలోని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రిఫైన‌రీలు ర‌ష్యా నుంచి దాదాపు 40 మిలియ‌న్ బారెళ్ల ముడి చ‌మురును కొనుగోలు చేశాయి. ఇత‌ర దేశాల ఆంక్ష‌లు, హెచ్చ‌రిక‌ల‌ను ప‌ట్టించుకోకుండా, ర‌ష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నందున తమకు ప్రస్తుతం అందుతున్న ధర కన్నా తక్కువ ధరకు అందించాలని భారత్ రష్యా ఎదుట డిమాండ్ పెట్టింది. పలు దేశాలు వార్నింగ్ లను పక్కనబెడ్డి క్రూడ్ అయిలను కొనుగోలు చేస్తూ రిస్క్ తీసుకుంటున్నందున ఈ త‌గ్గింపు న్యాయ‌మైన‌దేన‌ని భార‌త్ వాదిస్తోంది.

బ్యారెల్ ముడి చ‌మురును 70 డాల‌ర్ల క‌న్నా త‌క్కువ‌కు ఇవ్వాల‌ని కోరుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇరు దేశాల ఉన్న‌త స్థాయి అధికారుల మ‌ధ్య ఈ చ‌ర్చ‌లు సాగుతున్నాయ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధ‌ర 108 డాల‌ర్ల‌కు పైగానే ఉంది. ర‌ష్యా నుంచి ఫిబ్ర‌వ‌రి చివ‌రి వారం నుంచి 40 మిలియ‌న్ బ్యారెళ్ల ముడి చ‌మురును ఇండియా దిగుమ‌తి చేసుకుంది. ఇది ర‌ష్యా నుంచి భార‌త్ మొత్తం 2021 సంవ‌త్స‌రంలో చేసుకున్న ముడిచ‌మురు దిగుమ‌తి కన్నా 20% ఎక్కువ‌.

దేశం మొత్తం ముడి చ‌మురు దిగుమ‌తుల్లో దాదాపు 85% ర‌ష్యా నుంచే కొనుగోలు చేస్తుంది. ర‌ష్యా నుంచి క్రూడాయిల్ కొంటున్న న‌మ్మ‌క‌మైన మిత్ర‌దేశాల్లో భార‌త్ ప్ర‌ధాన‌మైన‌ది. ముఖ్యంగా, ఉక్రెయిన్‌తో యుద్ధం వ‌ల్ల యూరోప్ దేశాల నుంచి క్రూడాయిల్ కొనుగోలుకు డిమాండ్ పూర్తిగా ప‌డిపోవ‌డంతో, భార‌త్ కొనుగోలుకు ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. ముఖ్యంగా, ర‌ష్యా వాణిజ్య అవ‌స‌రాల‌కు భార‌త్ చేసే చెల్లింపులు అత్యంత కీల‌కంగా మారాయి. ఆయుధాలు, ముడిచ‌మురు భార‌త్‌కు ఎగుమ‌తి చేసే దేశాల్లో ర‌ష్యా ముఖ్య‌మైన‌ది.

అయితే, ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న ర‌ష్యాపై అమెరికా, జ‌పాన్‌, యూరోప్ దేశాలు తీవ్ర ఆర్థిక ఆంక్ష‌లు విధించాయి. అలాగే, ర‌ష్యాతో వాణిజ్య సంబంధాల‌ను తెగ‌తెంపులు చేసుకోవాల‌ని భార‌త్‌పైనా ఒత్తిడి తెస్తున్నాయి. ఈ ఒత్తిడిని త‌ట్టుకుంటూనే ర‌ష్యాతో స‌త్సంబంధాల‌ను ఇండియా కొన‌సాగిస్తోంది. భార‌త్ డిమాండ్ చేస్తున్న ధ‌ర‌కు ర‌ష్యా అంగీక‌రిస్తే.. ప్ర‌భుత్వ రిఫైన‌రీల కోసం నెల‌కు 15 మిలియ‌న్ బ్యారెళ్ల క్రూడాయిల్‌ను దిగుమ‌తి చేసుకుంటామ‌ని భార‌త్ హామీ ఇస్తోంది. రిల‌య‌న్స్‌, న‌యారా ఎన‌ర్జీ త‌దిత‌ర‌ ప్రైవేటు రిఫైన‌రీలు త‌మ దిగుమ‌తి అవ‌స‌రాల‌ను వేరుగా తెలియ‌జేస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Russia  Ukraine  Crude Oil  Moscow  Risk compensation  European nations  oil industry  Government  markets  

Other Articles