Heavy rains in Telangana in next 4 days రానున్న నాలుగు రోజులు తెలంగాణకు వర్ష సూచన

Heavy rainfall lash parts of city thundershowers likely in telangana in next 4 days

Indian Meteorological Department (IMD), yellow alert, light to moderate rain, thundershowers, Hyderabad heavy rain, Telangana heavy rain, Hyderabad heavy rain update, Hyderabad rains, Hyderabad weather, hyderabad rainfall, Telangana rains, Hyderabad weather today, IMD hyderabad update, Telangana, Andhra Pradesh, weather news

The city of Hyderabad had experienced the thunderstorm with heavy rains and winds in the wee of Wednesday. It is reported that IMD- Hyderabad, Begumpet recorded 63.1 mm rainfall, and minimum temperature dropped to 19.6 degree Celsius at morning —a massive seven degree Celsius departure from normal.

తెలంగాణకు ఎల్లో అలెర్ట్.. రానున్న నాలుగు రోజులు వర్షాలు..

Posted: 05/04/2022 03:34 PM IST
Heavy rainfall lash parts of city thundershowers likely in telangana in next 4 days

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రాబోయే నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా.. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30 ,40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వర్షం పడే అవకాశం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, కుమురం భీమ్ ఆసిఫాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మంచిర్యాలు, మేడ్చల్-మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, జైశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

ఓ వైపు ఎండలు మండిపోతుంటే.. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో చిన్నపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దక్షిణ అండమాన్ సముద్రంలో నేడు ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించింది. ఈ కారణంగా మే 6వ తేదీన అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత 24 గంటల్లో మరింత బలపడనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

అల్పపీడనం ప్రభావంతో మే 8 వరకు ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలైన ఉమ్మడి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం తూర్పు గోదావరి జిల్లాల్లో, యానాం ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IMD  heavy rains  Yellow alert  thunderstorm  rainfall  Hyderabad  light to moderate rain  Telangana  weather news  

Other Articles