Divya Darshan at Tirumala will resume in June: TTD Chairman వేసవి తరువాత దివ్యదర్శనాలకు అనుమతి: టీటీడీ చైర్మన్

Divya darshan at tirumala will resume after peak summer ttd chairman

TTD board meeting resolutions, development works at Tirumala and Tirupati, srivari mettu trekking route to be reopened, TTD board meeting, divya darshan, TTD board Chairman, Y.V. Subba Reddy, srivari mettu margam, Srivari Devotees, andhra pradesh, Devotional

The TTD has resolved to resume the Divya Darshan facility at the Lord Venkateswara temple here once the peak summer ends. A decision to this effect was taken at the bimonthly meeting of the TTD board of trustees chaired by its Chairman Y.V. Subba Reddy here on Saturday.

వేసవి తరువాత దివ్యదర్శనాలకు అనుమతి: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

Posted: 04/30/2022 06:45 PM IST
Divya darshan at tirumala will resume after peak summer ttd chairman

టీటీడీ పాలక మండలి సమావేశం ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం తిరుమల అన్నమయ్య భవన్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో పాలక మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. సామాన్య భక్తులకి త్వరగా దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. సర్వదర్శనం స్లాట్ విధానం ప్రారంభిస్తామని ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. నడకదారి భక్తులకి దివ్యదర్శనం టికెట్ల కేటాయించాలని నిర్ణయం తీసుకున్నామని, మహారాష్ట్ర ప్రభుత్వం ముంబాయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి పది ఎకరాల స్థలం కేటాయించారు. మహారాష్ట్ర మంత్రి ఆదిత్య తాక్రే నేడు స్థలానికి  సంబంధించిన పత్రాలు అందించారు. దాదాపు 500 కోట్లు విలువ చేసే స్థలం. త్వరలోనే ముంబాయి లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేపడతాం. ఆలయ నిర్మాణానికి పూర్తి ఆర్థికంగా ఇవ్వడానికి గౌతమ్ సింఘానియా ముందుకొచ్చారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు

టీటీడీ పాలక మండలి నిర్ణయాలు...

* శ్రీవారి మెట్టు మార్గం మే 5 నుంచి ప్రారంభం
* శ్రీవారి ఆలయం లో రెండు కొత్త బంగారు సింహాసనాలు తయారీకి ఆమోదం.
* పద్మావతి మెడికల్ కాలేజీలో రెండు బ్లాకుల నిర్మాణానికి 21 కోట్లు కేటాయింపు. మరో ఏడాదిలో శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి.
* విపత్తుల సమయంలో ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురికాకుండా కమిటి సూచనలు. అనేక ప్రాంతాలలో ఘాట్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలి
* రెండు విడతలుగా మరమ్మత్తులు.. 36 కోట్లు ఘాట్ రోడ్డు మరమ్మత్తులు
* తిరుమలలో బాలాజీ నగర్ ప్రాంతంలో ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్ ఏర్పాటు
* బయో గ్యాస్ ద్వారా అన్నప్రసాద కేంద్రం, లడ్డు తయారీకి ఉపయోగించాలని నిర్ణయం
* తిరుమల లోని టీటీడీ ఉద్యోగులు ఉంటే 737  కాటేజీలు మరమ్మత్తులు చేపట్టాలని నిర్ణయం
* ధన రూపంలో ఇచ్చే విరాళాలు టీటీడీ అన్ని ప్రివిలేజ్ ఇస్తుంది. ఇకపై వస్తు రూపంలో ఇచ్చే వాటికి కూడా ప్రివిలేజ్ ఇవ్వాలని నిర్ణయం
* టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాలపై నిర్ణయం
* సీఎం తిరుపతి పర్యటన, చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన, టాటా క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించనున్న సీఎం
* శ్రీనివాససేతు ప్రారంభం
* బర్డ్‌ ఆసుపత్రిలో స్మైల్వట్రైన్ కేంద్రం ఏర్పాటు
* తిరుమలలో స్థానికుల సమస్యలు పరిష్కారానికి పాలకమండలి నిర్ణయం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles