Remove mobile number and personal information from Google గూగుల్ లో మీ ఫోన్ నెంబరు ఉందా.? ఇప్పుడు తొలగించుకోవచ్చు.?

Google can now remove your phone number address from search results

google, google adds, google online searches, google personal and privacy settings, google new policy, latest news on google, google, search engine, name phone numbers, internet, other search engines, google phone numbers

One can now request Google to remove personal information such as phone number, email address from the search results. According to reports Michelle Chang the global policy lead for Google said it is updating its privacy policies. “Highly personal content” will completely be under users control.

గూగుల్ లో మీ ఫోన్ నెంబరు ఉందా.? ఇప్పుడు తొలగించుకోవచ్చు.?

Posted: 04/29/2022 01:37 PM IST
Google can now remove your phone number address from search results

సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త ఎత్తులతో ప్రజలు దాచుకున్న డబ్బును కొట్టేసేందుకు ప్రయత్నాలు చేస్తూనేవున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిందని.. దాని పలితాలతో ఇదివరకు క్యూలైన్లలో నిలబడి చెల్లించాల్సిన బిల్లులు ఇప్పుడు ఇంట్లోనే కూర్చోని ఎంచక్కా కట్టేస్తున్నామని సంతోషిస్తున్న తరుణంలో.. సైబర్ నేరగాళ్లు పొంచివున్నారన్న విషయాన్ని మర్చిపోతున్నాము. ఇక దీనికి తోడు ఇంటర్నెట్లో వ్యక్తిగత గొప్యతా వివరాలను కూడా షేర్ చేసుకుంటున్నారు. గూగుల్ లో తమ ఫోటో, తమ పేరు, తమ ఫోన్ నెంబరు ఇలా అన్నింటితో పాటు తమ బ్యాంకు వివరాలను కూడా కొందరు అవగాహనా రాహిత్యంతో షేర్ చేసుకుంటున్నారు.

అయితే ఇది అత్యంత ప్రమాదకరమన్న విషయం మాత్రం వారికి తెలియడం లేదు. కాసింత సమాచారం దొరికినా.. మన బ్యాంకుల్లోని డబ్బును ఖాళీ చేసేసే సైబర్ కేటుగాళ్లు మన మధ్యే తిష్టవేసుకున్నారు. పోరబాటునో, గ్రహపాటునో ఒకరికి సంబంధించిన గోప్యత సమాచారం వీరి కంటబడితే.. ఇంకేముంది.. మొత్తం ఊడ్చికెళ్లిపోతారు. అందుకనే సర్చ్ ఇంజన్ వెబ్ సైట్లలో మన వ్యక్తిగత సమాచారం బహిర్గతం చేయడం చాలా ప్రమాదకరం. అనేక అంశాలతో ముడిపడి ఉండే ఫోన్ నెంబర్లు ఇంటర్నెట్లో పబ్లిగ్గా పేరుతో సహా దర్శనమివ్వడం దోంగలకు తాళం చెవి అప్పగించినట్టే అవుతుంది.

అందుకే... తమ సెర్చ్ ఇంజిన్ పరిధిలో ఉన్న ఫోన్ నెంబర్లను తొలగించేందుకు గూగుల్ ఎట్టకేలకు సమ్మతించింది. గతంలో గూగుల్ బ్యాంకు ఖాతాల వివరాలు, క్రెడిట్ కార్డు వివరాలు మాత్రమే తొలగించేందుకు వెసులుబాటు కల్పించింది. తమ వివరాలు గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఉంటే వాటిని తొలగించాలని గూగుల్ ను కోరే వీలుండేది. ఇప్పుడా వెసులుబాటును ఫోన్ నెంబర్లు, చిరునామాల తొలగింపునకు కూడా విస్తరిస్తూ గూగుల్ నిర్ణయం తీసుకుంది. ఫోన్ నెంబర్లను తొలగించాలంటూ ఇటీవల గూగుల్ కు పెద్ద సంఖ్యలో వినతులు అందాయి.

వీటిని పరిగణనలోకి తీసుకుని తాజా నిర్ణయం తీసుకున్నట్టు గూగుల్ గ్లోబల్ పాలసీ విభాగం చీఫ్ మిచెల్లీ చాంగ్ వెల్లడించారు. అయితే, గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఉన్న వివరాలను మాత్రమే తాము తొలగించగలమని, ఇతర సంస్థల సెర్చ్ ఇంజిన్లలో కనిపించే వివరాలను తాము తొలగించలేమని, ఆయా వెబ్ సైట్లను సంప్రదించి తమ వివరాలు తొలగించాలని యూజర్లు కోరాలని గూగుల్ తన బ్లాగ్ లో పేర్కొంది. ఇటీవల సైబర్ నేరాలు పెరుగుతున్న తరుణంలో యూజర్ల విజ్ఞప్తులను పరిశీలించిన గూగుల్ తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : google  search engine  name phone numbers  internet  other search engines  google phone numbers  

Other Articles